Search
  • Follow NativePlanet
Share
» »షిల్లాంగ్ పర్యటనలో ఆనందాలు !

షిల్లాంగ్ పర్యటనలో ఆనందాలు !

షిల్లాంగ్ పట్టణాన్ని తూర్పు భారత దేశ స్కాట్ ల్యాండ్ అని పిలుస్తారు. మేఘాలయ రాష్ట్రానికి రాజ దాని అయిన షిల్లాంగ్ చల్లని వాతావరణంతో మండువేసవి కి గొప్ప పరిష్కారంగా వుంటుంది. నగర జీవన ఒత్తిడుల నుండి దూరంగా వుంచి పూర్తి విశ్రాంతి ని అందిస్తుంది. ఇక్కడి ప్రజలు విభిన్న సంస్కృతులు కలవారు. షిల్లాంగ్ ను ఈశాన్య భారత ఫాషన్ రాజధానిగా కూడా గుర్తిస్తారు.

పట్టణంలో ఎన్నో పర్వత శ్రేణులు, అందమైన సరస్సులు, ప్రవహించే నదులు, తోటలు, అన్నీ కలిపి షిల్లాంగ్ ను ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా చేసాయి. మరి అందమైన పర్వత శ్రేణుల నగరానికి మీరు చేసే పర్యటనలో ఏమి చూడాలి ?

మండువేసవికి గొప్ప పరిష్కారం!

మండువేసవికి గొప్ప పరిష్కారం!

షిల్లాంగ్ ఎలా చేరాలి ?
షిల్లాంగ్ చేరేందుకు చక్కని రోడ్డు కలదు. బస్సు లు, లేదా టాక్సీ లలో షిల్లాంగ్ తేలికగా చేరవచ్చు. గౌహతి పట్టణం లో ఉదయం పెందలకడే బయలు దేరాలి. గౌహతి లోని ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లు లభ్యంగా వుంటాయి. గౌహతి లోని పల్తాన్ బజార్ నుండి షేర్ టాక్సీ లు కూడా లభ్యంగా వుంటాయి. ఇవి సుమారు రూపాయలు రెండు వందల నుండి రూపాయలు నాల్గు వందల వరకూ చార్జీలుగా వసూలు చేస్తాయి. అస్సాం ప్రభుత్వం లేదా మేఘాలయ ప్రభుత్వం నడిపే బస్సు లు కూడా తరచుగా లభిస్తాయి. ప్రైవేటు బస్సు లు కూడా కలవు.

మండువేసవికి గొప్ప పరిష్కారం!

మండువేసవికి గొప్ప పరిష్కారం!

ఉమియం సరస్సు
మీరు గౌహతి నుండి షిల్లాంగ్ వేల్లెవారైతే, ఉమియుం సరస్సు మీకు షిల్లాంగ్ పట్టణం ఇంకనూ 15 కి. మీ. ల దూరం ఉందనగా తగులుతుంది. ఈ సరస్సునే బారా పాణి అని కూడా అంతారు. దీనిని ఉమియం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ పై నిర్మించారు. ఎండల రోజుల్లో ఈ సరస్సు నీరు ప్రకాశవంతంగా పూర్తి నీలి రంగులో చూడవచ్చు.

మండువేసవికి గొప్ప పరిష్కారం!

మండువేసవికి గొప్ప పరిష్కారం!

షిల్లాంగ్ గోల్ఫ్ కోర్సు
మీ షిల్లాంగ్ టూర్ ను గోల్ఫ్ కోర్స్ నుండి మొదలు పెట్టండి. షిల్లాంగ్ బ్రిటిష్ అస్సాం రాష్ట్రానికి రాజధానిగా వుండేది. ఇక్కడ కల గోల్ఫ్ కోర్సు, వార్డ్ లేక్ , భావన సముదాయాలు బ్రిటిష్ కల్చర్ చూపుతాయి. ఈ గోల్ఫ్ కోర్సు ను 1898 లో నిర్మించారు. ఇండియా లో ఇది మూడవ అతి పురాతన గోల్ఫ్ కోర్సు.

Photo Courtesy: Ajit Thapa

మండువేసవికి గొప్ప పరిష్కారం!

మండువేసవికి గొప్ప పరిష్కారం!

షిల్లాంగ్ కేథడ్రాల్
మీ తరువాతి పర్యటన అంశం షిల్లాంగ్ కేథడ్రాల్ ఈశాన్య దేశంలో ఇది పెద్ద కేథడ్రాల్ చర్చి. పూర్తిగా నీలి రంగులో వుంటుంది.

Photo Courtesy: Javed Rahman

మండువేసవికి గొప్ప పరిష్కారం!

మండువేసవికి గొప్ప పరిష్కారం!

షిల్లాంగ్ శిఖరం
షిల్లాంగ్ శిఖరం నగరం లో అతి ఎత్తైన శిఖరం. ఇక్కడ నుండి మీరు షిల్లాంగ్ పట్టణం అంతా పూర్తిగా చూడవచ్చు. ప్రయాణించే మేఘాల నడుమ శిఖరంపై నిలబడి దేముడి వాలే కింద పట్టణాన్ని చూస్తారు. ఇక్కడ నుండి మీరు పోలీస్ మరియు బారా బజార్ లు చూసి బారా బజార్ లో షాపింగ్ చేయవచ్చు.

Photo Courtesy: Masrur Ashraf

మండువేసవికి గొప్ప పరిష్కారం!

మండువేసవికి గొప్ప పరిష్కారం!

ఎలిఫెంట్ జలపాతాలు
మీ షాపింగ్ మరియు తినటం పూర్తి అయిన తరువాత ఎలిఫెంట్ జలపాతాలకు బయలు దేరండి. ఏవి మూడు అంచెల జలపాతాలు జలపాతాల అడుగుకి వెళ్ళాలంటే, 165 మెట్లు దిగాలిల్. పర్యాటకులకు స్థానిక దుస్తుల వేషంలో ఒక వంద రూపాయలకే ఒక ఫోటో తీసే ఏర్పాటు కలదు.

Photo Courtesy: Ashwin Kumar

మండువేసవికి గొప్ప పరిష్కారం!

మండువేసవికి గొప్ప పరిష్కారం!

సరస్సులు
పోలీస్ బజార్ నుండి లేడీ హైదరి పార్క్, మరియు వార్డ్స్ లేక్ లకు నడకలో వెళ్ళవచ్చు. వార్డ్ లేక్ ఒక కృత్రిమ సరస్సు. దీనిలో బోటింగ్ చేయవచ్చు. అందమైన గార్డెన్ కూడా ఇక్కడ కలదు. గార్డెన్ లోని బెంచ్ లపై కూర్చొని ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు.

మండువేసవికి గొప్ప పరిష్కారం!

మండువేసవికి గొప్ప పరిష్కారం!

డాన్ బాస్కో మ్యూజియం
నగరం మధ్యలో కల పోలీస్ బజార్ నుండి పది నిమిషాల ప్రయాణంలో ఈ మ్యూజియం చేరవచ్చు. దీనిలో స్థానిక ప్రజల దుస్తులు, పురాతన ఆయుధాలు, ఆభరణాలు , అరుదైన ఫొటోగ్రాఫ్ లు చూడవచ్చు.

Photo Courtesy: Ashwin Kumar

మండువేసవికి గొప్ప పరిష్కారం!

మండువేసవికి గొప్ప పరిష్కారం!

జలపాతాలు
సెవెన్ సిస్టర్ ఫాల్స్, స్వీట్ ఫాల్స్, నోహ ఖాలికాయ్ ఫాల్స్, బిషప్ ఫాల్స్ మరియు బీదాన్ ఫాల్స్ వంటి ప్రధాన జలపాతాలు తప్పక చూడాలి. టాక్సీ లలో పేకేజ్ టూర్ పై వీటిని అక్కడి చిరపుంజి తో సహా చూడవచ్చు.

మండువేసవికి గొప్ప పరిష్కారం!

మండువేసవికి గొప్ప పరిష్కారం!

చిరపుంజి
చిరపుంజి చూడకుండా మీ షిల్లాంగ్ పర్యటన పూర్తి కాదు. ప్రపంచంలో అధిక వర్ష పాత ప్రదేశం. ఇక్కడ కల లివింగ్ రూట్ బ్రిడ్జి లు, స్టాలగ్ మైట్ గుహలు ఒక ప్రధాన ఆకర్షణ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X