Search
  • Follow NativePlanet
Share
» »ఈ స్వామి చెప్పులను కానుకలుగా స్వీకరిస్తాడు?

ఈ స్వామి చెప్పులను కానుకలుగా స్వీకరిస్తాడు?

బేతాళ దేవాలయానికి సంబంధించిన కథనం.

సామాన్యంగా బేతాళ అన్న తక్షణం మనకందరికి దెయ్యం, పిశాచ వర్గానికి చెందిన ఓ నిశాచర జీవిగా బేతాళుడికి పేరుంది. అయితే చాలా తప్పు. అతడు కూడా దైవ గణాకి చెందిన వాడు. అతనికి కూడా దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఎక్కడ ఉందనే విషయంతో పాటు బేతాళుడికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

బేతాళ దేవాలయం

బేతాళ దేవాలయం

P.C: You Tube

బేతాళుడు అంటే రాత్రి సమయంలో కాపలా తిరిగేవాడని అర్థం. అయితే అతను పిశాచి కాదు. శైవగణాల్లోని దెయ్యం, భూతం తదితర నిశాచరాలకు అధిపతి. రుద్రగణాల్లోని ఒక గణానికి అధిపతి.

ఈ దేవాలయాలకు వెళితే ఈ మూడు నక్షత్రాల వారు తప్పక కోటాధిపతులు అవుతారుఈ దేవాలయాలకు వెళితే ఈ మూడు నక్షత్రాల వారు తప్పక కోటాధిపతులు అవుతారు

బేతాళ దేవాలయం

బేతాళ దేవాలయం

P.C: You Tube

బేతాళుడు పురుషుడు మాత్రమే. భారత దేశంలోని ప్రచారంలో ఉన్న అనేక పురాణాల్లో బేతాళుడు ప్రస్తావన ఉంది. అయితే ఈ బేతాళుడికి దేవాలయాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి.

బేతాళ దేవాలయం

బేతాళ దేవాలయం

P.C: You Tube

ఈ బేతాళుడిని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. కొన్ని చోట్ల ఈ బేతాళుడిని గ్రామ దేవతగా కూడా కొలుస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో ఉన్న కొన్ని గ్రామాల్లో బేతాళుడిని పోతురాజుగా పూజిస్తారు.

బేతాళ దేవాలయం

బేతాళ దేవాలయం

P.C: You Tube

మరికొన్ని గ్రామాల్లో మాత్రం పోతురాజు ఈ బేతాళుడి సహోదరుడిగా పేర్కొంటారు. తమిళనాడులో ఈ బేతాళుడిని కర్పస్వామిగా పూజిస్తారు. ఇక మహారాష్ట్రతో పాటు గోవాలో బేతాళుడిగానే పూజిస్తారు.

బేతాళ దేవాలయం

బేతాళ దేవాలయం

P.C: You Tube

గోవాలోని బిచోలిమా తాలూకా అమోనా అనే గ్రామంలో ఉన్న బేతాల దేవాలయం ఉంది. ఈ బేతాళుడిని గోవాలో యుద్ధవీరుడిగా కొలుస్తారు. అదే విధంగా మహారాష్ట్రలోని సింధుదుర్గ జిల్లా వంగూర తాలూకా ఆరావళి అనే గ్రామంలో ఉంది.

బేతాళ దేవాలయం

బేతాళ దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయాన్ని 17వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. పూర్వం ఈ గ్రామాన్ని హరవల్లి అని పిలిచేవారు. హర అంటే శివుడు వల్లి అంటే గ్రామం అని అర్థం.

బేతాళ దేవాలయం

బేతాళ దేవాలయం

P.C: You Tube

అంటే శివుడు నివశించిన గ్రామం కాబట్టే ఈ దేవాలయానికి హరవల్లి అని పేరువచ్చినట్లు చెబుతారు. ఆ శివుడి రుద్రగణాల్లో ఒక గణమైన పిశాచి గణాలకు అధిపతి అయిన బేతాళుడు కూడా ఇక్కడ శివుడితో పాటు ఉండేవాడని చెబతారు.

బేతాళ దేవాలయం

బేతాళ దేవాలయం

P.C: You Tube

ఇప్పటికీ ఈ బేతాళుడు గ్రామంలో రాత్రి పూట ఆ గ్రామాన్ని కాపాలా కాస్తాడని చెబుతారు. ఈ దేవాలయంలో బేతాళుడు నిలుచొన్న స్థితిలో భక్తులకు దర్శనమిస్తాడు. సుమారు తొమ్మిది అడుగుల ఎతైన ఈ విగ్రహాన్ని పంచ లోహాలతో చేశారు.

బేతాళ దేవాలయం

బేతాళ దేవాలయం

P.C: You Tube

స్వామి కుడిచేతిలో కత్తి, ఎడమ చేతిలో అగ్ని పాత్ర ఉండటాన్ని మనం చూడవచ్చు. బేతాళుడికి అరటిపళ్లు అంటే చాలా ఇష్టం. అందువల్లే ఇక్కడికి వచ్చిన భక్తులు అరటి పళ్లను సమర్పిస్తారు.

బేతాళ దేవాలయం

బేతాళ దేవాలయం

P.C: You Tube

ఎంతటి శక్తివంతమైన భూత, ప్రేతాల నుంచి బాధింపబడుతున్నవారు ఒక్కసారి ఈ దేవాలయాన్ని సందర్శిస్తే తప్పక ఫలితం ఉంటుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ గ్రామంలో బేతాళుడు ప్రతి రోజూ రాత్రి స్వయంగా వస్తాడని అఘోరాలు నమ్ముతారు.

బేతాళ దేవాలయం

బేతాళ దేవాలయం

P.C: You Tube

అందువల్లే వారు ఇక్కడ అమావాస్య, పౌర్ణమి వంటి రోజుల్లో వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. దీని వల్ల తమకు అతీత శక్తులు వస్తాయని వారి నమ్మకం. ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు తమ కోర్కెలు తీరిన తర్వాత కొత్త పాదరక్షలు (చెప్పులు) బేతాళుడికి కానుకగా అందజేస్తారు.

బేతాళ దేవాలయం

బేతాళ దేవాలయం

P.C: You Tube

ఇలా ఇచ్చిన చెప్పులను స్వామి ముందు ఆరోజు రాత్రి ఉంచుతారు. మరుసటి రోజు ఉదయం చూస్తే ఆ చెప్పులు ఎవరో ధరించి తిరిగినట్లు కనిపించడం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం.

బేతాళ దేవాలయం

బేతాళ దేవాలయం

P.C: You Tube

ఇలా భక్తులు సమర్పించిన పాదరక్షలు స్వామివారు ధరించి ఆరోజు రాత్రి ఆ గ్రామం కాపాలాకు వెలుతాడని అందువల్లే ఆ పాదరక్షలు వినియోగించినట్లు అనిపిస్తాయని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X