Search
  • Follow NativePlanet
Share
» » మనదేశంలోనూ స్కైవాక్ బ్రిడ్జ్లు ఉన్నాయండోయ్

మనదేశంలోనూ స్కైవాక్ బ్రిడ్జ్లు ఉన్నాయండోయ్

మనదేశంలోనూ స్కైవాక్ బ్రిడ్జ్లు ఉన్నాయండోయ్

https://pixabay.com/photos/the-trail-in-the-clouds-doln%c3%ad-morava-4404241/

వేగంగా వీచే గాలులను తట్టుకుని కొండలపై నడవాలంటే కాస్త ఆలోచిస్తాం. మరి అలాంటిది అంత ఎత్తైన ప్రదేశంలో గాజుతో నిర్మించిన వంతెనపై నడవాలంటే పై ప్రాణాలు పైనే పోతాయి అనిపిస్తుంది ఎవ్వరికైనా. అలాంటి నిర్మాణాలను స్కైవాక్ బ్రిడ్జ్ అంటారు. విదేశాలలో మంచి ప్రాచుర్యం పొందిన ఇలాంటి వంతెనలు మన దేశంలోనూ ఉన్నాయని మీకు తెలుసా? పర్యాటకులకు మరింత ఆసక్తి పెంచేందుకు స్వాగతం పలుకుతోన్న మన దేశంలోని గాజు వంతెనల (స్కైవాక్ బ్రిడ్జి) గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హిమాలయాల అందాలు చూడాలంటే

https://pixabay.com/photos/the-trail-in-the-clouds-doln%c3%ad-morava-4404241/

సిక్కిం రాష్ట్రంలోని పెల్లింగ్ నగరంలో నిర్మించిన గ్లాస్ స్కైవాక్ దేశంలోనే మొదటిది. చుట్టూ కొండలతో పచ్చదనం కమ్మేసిన ఈ ప్రాంతం చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. అలాంటి అందాలను మనసారా ఆస్వాదించేందుకు స్కైవాక్ బ్రిడ్జ్ ను 2018లో ప్రారంభించారు. సముద్ర మట్టానికి ఏకంగా 7200 అడుగుల ఎత్తులో 137 అడుగుల ఎత్తైన చెన్రెజిగ్ విగ్రహానికి కుడివైపున ఈ గాజువంతెన నిర్మాణాన్ని చేపట్టారు. ఎటుచూసినా అద్భుతమైన హిమాలయాల మధ్య గ్లాస్ స్కైవాక్పై నడిస్తే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించడం కాస్త కష్టమే అనుకోండి. వారాంతాల్లో కుటుంబ సమేతంగా ప్రశాంతంగా గడిపేందుకు సుదూర ప్రాంతాలనుంచి సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. దీనిపైనుంచి కిందకు చూస్తే నదీపాయలో తేలియాడుతూ ప్రయాణం చేసే పడవలు చూపరులను కనువిందు చేస్తాయి. ఇలాంటి అద్భుత దృశ్యాన్ని చూడాలంటే పెల్లింగ్ నగరానికి వెళ్లాల్సిందే.

రెండో స్కైవాక్ బ్రిడ్జ్ కు రాజ్గిర్ వేదికైంది

https://pixabay.com/photos/the-trail-in-the-clouds-doln%c3%ad-morava-4404241/

ఇక దేశంలో రెండో స్కైవాక్ బ్రిడ్జ్ కు బిహార్లోని రాజ్గిర్ వేదికైంది. భూమికి 250 అడుగుల ఎత్తులో 85 అడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పుతో ఈ గాజువంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జి ఇంకొక వైపు కనెక్ట్ లేకుండా చివరన 360 డిగ్రీల వ్యూ చూసే విధంగా రూపొందించారు. అదే దీని ప్రత్యేకత. 360 డిగ్రీల కోణంలో ప్రకృతిని ఆస్వాదించడానికి సందర్శకులు మొగ్గుచూపుతారు. దీనిపైనుంచి చూస్తే భూమి చివరి అంచున ఉన్నామనే భావన కలుగుతుందని పర్యాటకులు అభిప్రాయపడుంటారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైనా నేచర్ పార్క్, జూ సఫారీ వంటి వాటితో పాటు స్కైవాక్ బ్రిడ్జి కూడా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీనిని సందర్శించడానికి విదేశీ పర్యాటకులూ వస్తుంటారు.

మన కాకినాడలోనూ

https://pixabay.com/photos/the-trail-in-the-clouds-doln%c3%ad-morava-4404241/

మన కాకినాడలోనూ గాజు వంతెన పరిచయమైంది. పైన చెప్పుకునేంత పెద్ద పరిమాణంలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో 45 అడుగుల పొడవుతో చిన్నపాటి స్కైవాక్ బ్రిడ్జి ఉంది. దీన్ని చిన్న వాగును దాటడానికి రెండు కోట్ల రూపాయల వ్యయంతో అత్యద్భుతంగా నిర్మించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X