» »వేసవి సెలవులకి ఛలో ఢిల్లీ

వేసవి సెలవులకి ఛలో ఢిల్లీ

By: Venkata Karunasri Nalluru

పిల్లలకు వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. హాయిగా ఎంజాయ్ చేస్తూ హాలిడేస్ లో అన్నీ మర్చిపోయి ఎక్కడికైనా విహారయాత్ర వెళ్ళాలని వుంది కదూ ! మరెందుకాలస్యం మీరు మీ పిల్లలు సెలవులు చక్కగా ఎంజాయ్ చేయటానికి భారత దేశ రాజధాని అయిన ఢిల్లీకి వెళ్ళొదామా! చలో.. ఢిల్లీ!

భారత దేశ పర్యటన ఒక మరచి పోలేని అనుభవనం అనుకుంటే, భారత దేశ రాజధాని ఢిల్లీ పర్యటన సందర్శకులకు మరింత అద్భుతంగా వుంటుంది. ప్రతి పర్యాటకుడు జీవితం లో మరచిపోలేని పర్యటన అనుభవాలను కలిగిస్తుంది. ఢిల్లీ నగరం దేశంలోని పెద్ద నగరాలలో ఒకటి మాత్రమే కాదు, దాని వెలుగు జిలుగులతో ఆధునికత మరియు, సాంప్ర దాయకతలకు ప్రతీకగా నిలిచి సందర్శకులకు చెరగని మధురానుభూతులను కలిగిస్తుంది.

ఢిల్లీ పేరును హిందీ లో 'దిల్లి ' అని కూడా వ్యవహరిస్తారు. అధికారికంగా, ఈ నగరం దేశానికి రాజధాని నగరం. ముంబై నగరం తర్వాత అత్యధిక జనాభా కల రెండవ నగరం గా పేరొందింది.

పురాతన ఢిల్లీ మరియు కొత్త ఢిల్లీ అనే పేర్ల తో ఢిల్లీ లోని రెండు ప్రదేశాలు వాటి వాటి చరిత్ర, సంస్కృతి, ఎన్నో రకరకాల అద్భుత ప్రదేశాలతో ప్రతి సందర్శకుడిని మంత్రముగ్ధులను చేస్తాయి. అంతే కాదు, దేశ రాజధాని అయిన కారణంగా, దేశం లో జరిగే ప్రతి ఒక్క రాజకీయ కార్యకలాపానికి కేంద్ర బిందువుగా వుండి ప్రతి వారు తప్పక చూడవలసిన ప్రదేశంగా వుంటుంది.

1. కుతుబ్ మీనార్

1. కుతుబ్ మీనార్

ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల మీనార్, మరియు ఇండో-ఇస్లామీయ నిర్మాణాలకు ఒక అపురాపమైన ఉదాహరణ. ఇది ఢిల్లీ లోని మెహ్రౌలీ వద్ద గల కుతుబ్ కాంప్లెక్స్ లో గలదు. యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో 'కుతుబ్ మీనార్'ను నమోదు చేశారు. కుతుబ్ అనగా ధృవం, మీనార్ అనగా స్తంభం, కుతుబ్ మీనార్ అనగా "ధృవపుస్తంభం". ఇంకనూ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు గనక అతని పేరు మీదుగానూ దీనికి కుతుబ్ మీనార్ అనే పేరొచ్చిందని ప్రతీతి. కుతుబ్ మీనార్ ఎత్తు 72.5 మీటర్లు లేదా 237.8 అడుగులు. దీనిలో 399 మెట్లు పైవరకూ గలవు. పునాది వద్ద దీని వ్యాసం 14.3 మీటర్లు, పైన దీని వ్యాసం 2.75 మీ. ఇది మొత్తం ఐదు అంతస్తుల నిర్మాణం. దీనిని 1193 లో నిర్మించారు. కుతుబుద్దీన్ ఐబక్ దీని నిర్మాణం ప్రారంభించగా, అల్తమష్ పూర్తిగావించాడు.దీని ప్రాంగణం లో ఢిల్లీ ఇనుప స్థంబం, ఖువ్వతుల్ ఇస్లాం మస్జిద్.

టైమింగ్స్: ఉదయం 7 గం ల నుండి సాయంత్రం 5 గం.ల వరకు తెరిచి వుంటుంది.
PC :chopr

2. అక్షరధామం టెంపుల్

2. అక్షరధామం టెంపుల్

న్యూఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ భారతీయ సంస్కృతికి ఒక ఉదాహరణ. ఇది సుమారు 10,000 సంవత్సరాల కాలం నాటిది. భగవాన్ స్వామి నారాయణ్ కొలువైన ఈ సంప్రదాయ మందిరం భారతదేశం యొక్క పురాతన కళ, సంస్కృతి మరియు నిర్మాణ శైలి యొక్క ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. నీలకంఠ వర్ణి అభిషేక్ : ఇక్కడ 151 పవిత్ర నదులు, సరస్సులు మరియు చెరువులు కలిగిన ప్రశాంతమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం.

టైమింగ్స్: ఉదయం 9:30 గం ల నుండి రాత్రి 6:30 గం.ల వరకు తెరిచి వుంటుంది.
PC : Mohitmongia99

3. ఆజాద్ హింద్ గ్రామ్

3. ఆజాద్ హింద్ గ్రామ్

భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జ్ఞాపకార్థంగా టిక్రి కలాన్ వద్ద ఆజాద్ హింద్ గ్రామ్ పర్యాటక కాంప్లెక్స్ స్థాపించబడినది. అంతేకాకుండా పౌరులకు సదుపాయాలు కల్పించటానికి ఢిల్లీ పర్యాటక అభివృద్ధి ఒక ప్రాజెక్ట్ ను ఏర్పరచింది. ఢిల్లీ, హర్యానా సరిహద్దు యొక్క రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాజెక్టు నిర్మాణం ఉత్తర భారత నిర్మాణ శైలి మరియు భారతీయ కళా సాంప్రదాయాలకు స్పూర్తిని కలిగిస్తుంది.

టైమింగ్స్: ఉదయం 6 గం ల నుండి రాత్రి10 గం.ల వరకు తెరిచి వుంటుంది.

4. లోటస్ టెంపుల్

4. లోటస్ టెంపుల్

లోటస్ టెంపుల్ భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న ఒక బహాయి ప్రార్ధనా మందిరం, ఇది 1986లో పూర్తయింది. దీని పుష్పం వంటి ఆకారం బాగా గుర్తింపు పొందింది, ఇది భారత ఉపఖండంలో మదర్ టెంపుల్ గా సేవలందిస్తోంది మరియు నగరంలో ఇది ఒక ప్రముఖ ఆకర్షణ అయ్యింది. లోటస్ టెంపుల్ అనేక నిర్మాణ అవార్డులు గెలుచుకుంది మరియు వార్తాపత్రికలలో మరియు మేగజైన్ లలో విశేష వ్యాసంగా అనేకసార్లు ప్రచురించబడింది.

సోమవారం టెంపుల్ మూసివేయబడి వుంటుంది.

టైమింగ్స్: ఉదయం 6 గం ల నుండి సాయంత్రం 5:30 వరకు

PC : Nilesh1711

5. ఇండియా గేట్

5. ఇండియా గేట్

ఇండియా గేట్, భారతదేశ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. ఇది దేశ రాజధానైనా న్యూ ఢిల్లీ లో కలదు. ఇది ఒక అపురూప కట్టడం. దీని ఎత్తు 42 మీటర్లు. ఇండియా గేట్, భారతదేశ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. ఇది దేశ రాజధానైనా న్యూ ఢిల్లీ లో కలదు. రాష్ట్రపతి భవన్ కు కూడా వేటు దూరంలో ఇండియా గేట్ ఉన్నది. న్యూ ఢిల్లీ లో చూడవలసిన అతి కొద్ది పర్యాటక స్థలాలలో ఇది ఒకటి. దీనిని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మరియు ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో అమరులైన 90 వేల మంది జవాన్ల జ్ఞాపకార్థం ఈ స్మృతి చిహ్నాన్ని కట్టించారు. ఇది ఒక అపురూప కట్టడం. దీని ఎత్తు 42 మీటర్లు. ఈ కట్టడం భరత్ పూర్ నుండి తెప్పించిన ఎర్రరాయితో కట్టించారు. 1971 వ సంవత్సరం నుంచి ఇక్కడ అమర్‌ జవాన్ జ్యోతి కూడా వెలుగుతోంది. ఇండియా గేట్ పరిసరాలు చూడటానికి ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. పరిసరాలలో పచ్చిక బయళ్ళు, చిన్నారులు ఆడుకోవడానికి సుందరమైన పార్కు, బోట్‌ క్లబ్ ఉండటమే కాకుండా ఇక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ చూడడం మరుపురాని అనుభూతినిస్తుంది.

టైమింగ్స్: ఉదయం నుండి రాత్రి వరకు
PC : Ramakrishna Reddy Y

6. రాష్ట్రపతి భవన్

6. రాష్ట్రపతి భవన్

రాష్ట్రపతి కుటుంబానికి, అక్కడికి వచ్చే అతిధులకు అవసరమైన వంటకాలను తయారు చేయడానికి 18 మంది వంట మనుషులు, వడ్డించ డానికి 10 మంది బట్లర్లు వుంటారు. గదులను ఊడ్చడానికి శుభ్రంగా వుంచడానికి 110 మంది పని వాళ్లుంటారు. అంతేగాక 10 మంది డ్రైవర్లు, ఐదుగురు మెకానిక్కులు, 180 మంది అంగ రక్షకులు, ఇంకా డాక్టర్లు, సెక్రెటరీలు, క్లర్కులు, మొదలగు వారందరూ కలిపి 1000 మంది పైగానె పనిచేస్తుంటారు. ఈ రాష్ట్ర పతి భవన ఆవరణములో అందమైన వుద్యాన వనాలున్నాయి. అవి మొఘల్ గార్డెన్, హెర్బెల్ గార్డెన్, న్యూట్రిషన్ గార్డెన్, స్పిరిచ్యుల్ గార్డెన్ వంటివి ఉన్నాయి.
PC : Anupom sarmah

7. కుతుబ్ మినార్

7. కుతుబ్ మినార్

ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల మీనార్, మరియు ఇండో-ఇస్లామీయ నిర్మాణాలకు ఒక అపురాపమైన ఉదాహరణ. ఇది ఢిల్లీ లోని మెహ్రౌలీ వద్ద గల కుతుబ్ కాంప్లెక్స్ లో గలదు. యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో 'కుతుబ్ మీనార్'ను నమోదు చేశారు.

కుతుబ్ అనగా ధృవం, మీనార్ అనగా స్తంభం, కుతుబ్ మీనార్ అనగా "ధృవపుస్తంభం". ఇంకనూ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు గనక అతని పేరు మీదుగానూ దీనికి కుతుబ్ మీనార్ అనే పేరొచ్చిందని ప్రతీతి. కుతుబ్ మీనార్ ఎత్తు 72.5 మీటర్లు లేదా 237.8 అడుగులు. దీనిలో 399 మెట్లు పైవరకూ గలవు. పునాది వద్ద దీని వ్యాసం 14.3 మీటర్లు, పైన దీని వ్యాసం 2.75 మీ. ఇది మొత్తం ఐదు అంతస్తుల నిర్మాణం. దీనిని 1193 లో నిర్మించారు. కుతుబుద్దీన్ ఐబక్ దీని నిర్మాణం ప్రారంభించగా, అల్తమష్ పూర్తిగావించాడు.
PC : commons.wikimedia.org

8. హుమయూన్ సమాధి

8. హుమయూన్ సమాధి

మొఘల్ చక్రవర్తులలో మంచి పేరు సంపాదించిన హుమయూన్ రాజు సమాధి ఇందులో పొందుపరిచారు. ఈ సమాధిని విధవరాలు అయిన హాజీ బేగమ్ 1572వ సంవత్సరంలో నిర్మించింది. అప్పట్లో ఢిల్లీలో హుమయూన్, హిందువుల రాజు హేము మధ్య జరిగిన యుద్ధంలో హుమయూన్ మరణించాడు. 1556వ సంవత్సరంలో హుమయూన్ మరణించగా అతని భార్య బేగా బేగమ్ అతని సమాధిని నిర్మించాల్సింది ఆదేశాలు జారీ చేసింది. దాంతో నిర్మాణం చేపట్టిన అనంతరం దీనిని 1572లో పూర్తి చేశారు.
PC : Dennis Jarvis

9. చాందిని చౌక్

9. చాందిని చౌక్

ఢిల్లీలో వున్న పర్యాటక ప్రాంతాలలో చాందిని చౌక్ ముఖ్యమైనది. ఇక్కడ గౌరీ శంకర్ టెంపుల్, దిగంబర జైన్ టెంపుల్, సీష్ గంజ్ గురుద్వారా, ఫతేపూర్ మసీద్, జామా మసీద్, సలీం ఘడ్ ఫోర్ట్ చూడదగినవి. వీటిని చూచుటకు మన దేశంలోనే కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తారు. ఇది ఎల్లో లైన్ లో వుంటుంది.
PC: Mathanki Kodavasal

10. జోర్ బాగ్

10. జోర్ బాగ్

జోర్ బాగ్ దగ్గర చూడదగిన ప్రదేశాలు హుమయూన్ టూంబ్, సఫ్దర్ జంగ్ టూంబ్, లోడి గార్డెన్, హజరత్ నిజాముద్దీన్ దర్గా, ఇండియా హబిటాట్ సెంటర్ చూడదగ్గవి. అనునిత్యం ఇవి పర్యాటకులతో నిండి వుంటుంది.

Please Wait while comments are loading...