Search
  • Follow NativePlanet
Share
» »అక్షరధామ్ ఆలయం, న్యూ ఢిల్లీ !!

అక్షరధామ్ ఆలయం, న్యూ ఢిల్లీ !!

వేలాది టన్నుల కెంపువన్నె ఇసుకరాళ్ళు, పాలరాళ్ళతో నిర్మించబడినటువంటి ఈ కట్టడంలో ఒక అంగుళం మేరకైనా ఉక్కు వాడకపోవడం పెద్ద విచిత్రం.

By Mohammad

అక్షరధామ్ భారతదేశ రాజధాని నగరమైన కొత్త ఢిల్లీలో, దాదాపు వంద ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం. దీనిని అప్పటి భారత రాష్ట్రపతి ఏ. పి. జె. అబ్దుల్ కలాం ఆవిష్కరించడం గమనార్షం. నవంబర్ 7, 2005 న ఆవిష్కరించబడిన ఈ ధామము నవంబర్ 8 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది (ప్రజలను అనుమతించారు).

ఈ భవనం నిజాముద్దీన్ వంతెనకు కొంత దూరంలో "నొయిడా క్రాసింగ్" వద్ద యమునా నది తీరాన మహొన్నంతంగా వెలసి, పర్యాటకుల్ని, ఆధ్యాత్మికవాదులను, ప్రాచీన సంస్కృతీ వారసత్వారాధకులను సమంగా అలరిస్తోంది. అక్షరధాంలో ఆలయంతో పాటుగా, ఒక స్మారక భవన సముదాయం, ఒక విద్యా ప్రభోధ కేంద్రం, జ్ఞాన ప్రకాశ నిలయం ఉన్నాయి. అక్షరధామ్ సంప్రదాయక కళ, భవన నిర్మాణ పరిజ్ఞానం, భారతీయ సంస్కృతీ నాగరికతలు, ప్రాచీన నైతిక విలువలు, విజ్ఞానాల్ని ఉత్తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సృజనాత్మంకంగా మేళవించిన తీరుకు ప్రతీక.

అక్షరధామ్ సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయం. వేదాలలో, ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు, శాశ్వత సుగుణాలకు నెలవు. ఆ స్మారక భవన సముదాయం యొక్క పూర్తిపేరు "స్వామి నారాయణ్ అక్షరధామ్".

నిర్మాణ కళాశైలి

నిర్మాణ కళాశైలి

వేలాది టన్నుల కెంపువన్నె ఇసుకరాళ్ళు, పాలరాళ్ళతో నిర్మించబడినటువంటి ఈ కట్టడంలో ఒక అంగుళం మేరకైనా ఉక్కు వాడకపోవడం పెద్ద విచిత్రం. మొదటిదైన అక్షరధామ్ గుజరాత్ ‍కు చెందిన గాంధీనగర్‌లో వెలువగా, ఢిల్లీలోని ఈ అక్షరధామ్ రెండవది.

చిత్రకృప : Kapil.xerox

గిన్నిస్ బుక్

గిన్నిస్ బుక్

అక్షరధామ్ వంద ఎకరాల భూభాగం హృదయస్థానంలో భక్తిద్వార్, మయూర్ ద్వార్ అనే రెండు పెద్ద గేట్ల రక్షణతో బృహత్ సౌధంలా విరాజిల్లుతుంటుంది. అక్షరధామ్ స్మారక భవనం, పలు గుమ్మటాలతో, 141 అడుగుల ఎత్తు, 316 అడుగుల వెడల్పుతో, 370 అడుగుల నిడివితో చూపరులను దిగ్ర్భాంతికి లోనుచేస్తుంది.

చిత్రకృప : Swaminarayan Sanstha

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్

ఎర్రటి ఇసుకరాళ్ళతో నిర్మించబడి, 1660 స్తంభాలతో అలరారే రెండస్తుల "పరిక్రమ" స్మారక భవనాన్ని కంఠాభరణంలా చుట్టివుంటుంది. దాని నిడివి దాదాపు రెండు కిలోమీటర్లు. 145 కిటికీలతో, 154 శిఖరాలతో అది అలరారుతుంటుంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూదేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.

చిత్రకృప : Juthani1

నారాయణ్ మూర్తి

నారాయణ్ మూర్తి

141 అడుగుల ఎత్తుతో అలరారే అక్షర్ ధామ్ ఆలయం పురాతన నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. ఆలయం గర్భగుడిలో 11 అడుగుల స్వామి నారాయణ్ మూర్తి. చెప్పుకోదగింది. ఆలయం మొత్తం రాజస్థానీ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించబడింది.

చిత్రకృప : Mohitmongia99

జాతికి అంకితం

జాతికి అంకితం

ఆలయంలో నర్తకీమణులు, సంగీత విద్వాంసులు, కవులు, శిల్పకారుల చిత్తరువులు చూపరుల్ని కట్టిపడేస్తాయి. ఈ స్వామి నారాయణ్ అక్షర్ ధామ్ ని ప్రముఖ్ మహరాజ్ నిర్మించారు. న్యూఢిల్లీలోని ఈ ఆలయాన్ని 2005 లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాని మన్మోహన్ సింగ్ జాతికి అంకితం చేశారు.

చిత్రకృప : Daniel Echeverri

గజారూఢ భవనం

గజారూఢ భవనం

148 ఏనుగులు భారత పురాణాలకు, పంచతంత్రానికి చెందిన గాథల ప్రతిరూపాలు, కాంగ్రా చిత్తరువులు, 20, 000 దేవతా విగ్రహాలు, పురాణ, ఇతిహాసాల కథలు, గాథలతో ఈ భవనం లోని ప్రతి చదరపు అంగుళం, కళాత్మకంగా కనువిందు చేస్తుంది. భవనం గర్భభాగంలో 11 అడుగుల ఎత్తుతో బంగారం తాపడం చేసిన స్వామి నారాయణ్ పంచలోహ విగ్రహం దర్శనమిస్తుంది.

చిత్రకృప : Dr Murali Mohan Gurram

మహోన్నతం ... ఊహాతీతం

మహోన్నతం ... ఊహాతీతం

కెంపు రంగులో వున్న ప్రహరీ గోడలు చాలా ఎత్తైనవి. దాటరానివి, ఈ బృహన్మందిర నిర్మాణానికి రాళ్ళెత్తిన వారి సంఖ్య 11, 000 అయితే, వ్యయం దాదాపు రెండువందల కోట్లు. ప్రపంచమంతటా విస్తరించివున్న స్వామి నారాయణ్ అనుయాయుల నుంచి లభించిన విరాళాలే అందుకుపకరించాయంటే దాని వైభవం, విస్తృతి, శిల్ప శోభ ఎంత మహొన్నతమైనవో ఊహాతీతం.

చిత్రకృప : Juthani1

యజ్ఞపురుష్ ‍కుండ్

యజ్ఞపురుష్ ‍కుండ్

ప్రధాన మందిరం పక్కనే "యజ్ఞపురుష్ ‍కుండ్" అనే జలాశయం తారసపడుతుంది. మతాచార కర్మకాండల నిమిత్తం నిర్మించిన ఈ జలాశయం 2870 మెట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద యజ్ఞకుండమని చెబుతారు.

చిత్రకృప : Dr Murali Mohan Gurram

భారత్ ఉపవన్

భారత్ ఉపవన్

ఢిల్లీ నుండి యమునా నది మీదుగా అక్షరధాం వస్తే మొట్టమొదటగా ఈ విశాలమైన ఉద్యానవనం. ఈ ఉద్యానవనంలో పొదలు, ఫౌంటెయిన్లతో పాటుగా బోలెడన్ని కంచు విగ్రహాలు కూడా ఉన్నాయి. స్వాతంత్ర్యోద్యమంలో అమరులైన వీరుల, జాతీయ నాయకుల, శాస్త్రజ్ఞుల మరియు పురాణాలలోని పిల్లల, స్త్రీపురుషులలు కంచు విగ్రహాలు ఈ ఉద్యానవనంలో ఉన్నాయి. వనంలో ధ్యానం చేస్తారు.

చిత్రకృప : World

సినిమా ప్రదర్శనశాలలు

సినిమా ప్రదర్శనశాలలు

సినిమా ప్రదర్శనశాలల్లో అత్యాధునికమైనది "ఐమాక్స్" భవన సముదాయంలోని మూడు ప్రదర్శనశాలల్లో ఒకటైన "నీలకంఠ్ దర్శన్" లో ఈ ఐమాక్స్ ధియేటర్ నెలకొల్పబడివుంది. ఈ ధియేటర్‍లో స్వామి నారాయణ్ 11 ఏళ్ళ బాలయోగి బాల్యం 45 నిమిషాల సినిమా గా అవిష్కృతమౌతుంది.

చిత్రకృప : Honza Soukup

సహజానంద దర్శన్

సహజానంద దర్శన్

రెండు తటాకాల చూట్టూన్మించబడిన ఈ మూడు ప్రదర్శనశాలల్లో రెండవది "సహజానంద దర్శన్". సజీవ భ్రాంతి కలిగించేటటువంటి మట్టి ప్రతిమలతో, చాకచక్యంగా వెలుగు శబ్దాల వినియోగంతో, స్వామి నారాయణ్ భగవాన్ జీవితాన్ని అక్కడి ప్రదర్శన అవిష్కరిస్తుంది.

చిత్రకృప : Os Rúpias

సంస్కృతి విహార్

సంస్కృతి విహార్

మూడవ ప్రదర్శనశాల " సంస్కృతి విహార్ " భూగర్బంలో ఏర్పాటైన ఒక కృత్రిమ నదిలో ఒక పడవలో మీరు ప్రయాణించవలసివుంటుంది. ఆ పడవ షికారు ద్వారా పదివేల సంవత్సరాల భారతీయ సంస్కృతీ నాగరికతలు మీకు ఆనదీ తీరాన పరిచయమవుతాయి. పన్నెండు నిమిషాల పాటు సాగే ఆ శ్రవ్య-దృశ్య ప్రదర్శన మిమ్మల్ని ఊహాలోకంలోకి తీసుకువెళ్తుంది.

చిత్రకృప : rundnd

టికెట్ ధరలు

టికెట్ ధరలు

చూడటానికి పట్టే సమయం : 3 నుండి 4 గంటలు

టికెట్ ధరలు :

ఎగ్జిబిషన్

పెద్దలకు - రూ. 170
పిల్లలకు - రూ. 100
సీనియర్ సిటిజన్స్ - రూ.125


మ్యూజికల్ ఫౌంటైన్

పెద్దలకు - రూ. 80
పిల్లలకు - రూ. 50
సీనియర్ సిటిజన్స్ - రూ. 80

చిత్రకృప : Pranavdadhich

సందర్శన వేళలు

సందర్శన వేళలు

సందర్శన వేళలు : వారంలో అన్ని రోజులు ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు (సోమవారం తప్ప)

టికెట్ కౌంటర్ సాయంత్రం 6 గంటలకు మూసేస్తారు. ఢిల్లీ తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఈ దేవాలయం 6 వ ర్యాంక్.

చిత్రకృప : ArishG

అక్షరధామ్ ఎలా చేరుకోవాలి ?

అక్షరధామ్ ఎలా చేరుకోవాలి ?

అక్షర్ ధామ్ కు సమీపాన అక్షర్ ధామ్ మెట్రో స్టేషన్ కలదు. న్యూఢిల్లీ చేరుకోవడం ఎలా ?

చిత్రకృప : Juthani1

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X