Search
  • Follow NativePlanet
Share
» »స్వయంభువుగా తెల్లజిల్లేడు వేరు నుండి ఉద్భవించిన శ్వేతార్క మూలగణపతి దర్శిస్తే..

స్వయంభువుగా తెల్లజిల్లేడు వేరు నుండి ఉద్భవించిన శ్వేతార్క మూలగణపతి దర్శిస్తే..

సాధారణంగా దేవాలయాల్లో ఉండే దేవతా విగ్రహాలు శిల్పులు చెక్కినవి కాగా అరుదుగా కొన్ని స్వయంగా వెలసినవి ఉంటాయి. అలాంటి స్వయంభూ దేవాలయాల్లో తెలంగాణగణపతిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాలోని 29దేవతమూర్తులతో ప్రత్యేక దంపత్ వాహన సమేత నవగ్రహ క్షేత్ర నిలయంగా భాసిల్లుతోన్న కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్క గణపతి క్షేత్రం ఒకటి.

స్వయంభుగా వెలసి వేలాదిమంది భక్తుల కోర్కెలను క్షిప్ర ప్రసాదిగా నెరవేరుస్తూ, ఎంతోమంది భక్తుల ఇలవేల్పుగా ప్రసిద్ధి పొందుతున్న దేవాలయం శ్రీ శ్వేతార్క మూల గణపతి. ఈ గుడిలోని విగ్రహాన్ని ఏ శిల్పీ చెక్కలేదు. తెల్ల జిల్లేడు మొదలుపై స్వయంగా వెలసినప్పుడు దాన్ని ఇంకా పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. విచిత్రమేమిటంటే, కొన్ని స్వయంభూ దేవాలయాల్లా ఈ శ్వేతార్క గణపతిలో అస్పష్టత ఉండదు. ఖాజీపేట గణపతి తల, కళ్ళు, తొండము, ఒకటి పొడుగ్గా మరొకటి విరిగినట్టుగా ఉండే రెండు దంతాలు, ఆసన భంగిమ, పాదాలు, మూషిక వాహనం..ఇలా ప్రతిదీ స్పష్టంగా విఘ్నేశ్వరుని పోలి ఉంటుంది.

శ్వేతం అనగా తెలుపు, ఆర్కము అనగా జిల్లేడు, మూలము అనగా వేరు.

శ్వేతం అనగా తెలుపు, ఆర్కము అనగా జిల్లేడు, మూలము అనగా వేరు.

శ్వేతం అనగా తెలుపు, ఆర్కము అనగా జిల్లేడు, మూలము అనగా వేరు. నారదాది పురాణ గ్రంధాలలో తెల్లజిల్లేడు వృక్షం పరిపూర్ణంగా వందేళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత ఆ వృక్ష మూలంలో గణపతి ఆకృతి ఏర్పడుతుందని చెప్ప బడింది. శ్వేతార్క గణపతి గొప్పతనం, వైశిష్టం గణపతి ఉపనిషత్‌లో కూడా తెలియజేయబడింది.

PC: FACEBOOK

శ్వేతార్క లేదా తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు.

శ్వేతార్క లేదా తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు.

శ్వేతార్క లేదా తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. శ్వేతార్క మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి.

PC: FACEBOOK

ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే

ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే

కేవలం గరికతో మాత్రమే ప్రదక్షిణాలు చేస్తూ సంకల్ప సిద్ధిని పొందుతూ అనేకమంది భక్తలకు అభయమిస్తూ సకల కార్యసిద్ధి నొసగే స్వామిగా వెలుగొందుతున్న ఈ శ్వేతార్క మూల గణపతి సర్వావయవ సంపూర్ణుడిగా ఎలాంటి చెక్కడాలు, మలచడాలు లేకుండా స్పష్టంగా కళ్ళు, నుదురు, దంతాలు, జ్ఞానదంతం, కాళ్ళు, పాదాలు, చేతులు, తల్పం, సింహాసనం, మూషికం, మోదకాలతో అకృతిని పొంది దర్శనమిస్తున్నారు.ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదట.'

PC: FACEBOOK

ఈ శ్వేతార్క గణపతి తూర్పు ముఖంగా ఉండి

ఈ శ్వేతార్క గణపతి తూర్పు ముఖంగా ఉండి

ఈ శ్వేతార్క గణపతి తూర్పు ముఖంగా ఉండి ఈశాన్యం వైపుకు కైలాస స్థానాన్ని చూస్తున్నట్లుగా సమస్త వాస్తు దోష నివారకుడిగా ఉండటమే ఈ స్వామిలోని విశిష్టత. . ఈ శ్వేతార్క గణపతి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు తప్పక నెరవేరుతాయని ప్రశస్తి. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఆరోగ్య సమస్యలు, కాపురంలో కలతలు...ఇలా అనేక సమస్యలతో ఈ గుడికి వచ్చే భక్తులు తమకు వెంటనే సత్ఫలితాలు చేకూరినట్టు చెప్తారు.

PC: FACEBOOK

ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తం

ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తం

జాతకచక్రంలో సూర్యగ్రహ దోషాలున్నావారు జాతకచక్రంలో సూర్యుడు నీచలో ఉన్న వారు ఇంటికి నరద్రుష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్న వారు, సర్వకార్యసిద్ధికొరకు శ్వేతార్క గణపతిని ఇంట్లో ఉంచుకుని పూజిస్తే చాలా మంచిది. కానీ ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. పండితుల్ని పురోహితుల్ని సంప్రదించి, వారి సలహా మేరకు ముహోర్తం పెట్టించుకోవాలి.

PC: FACEBOOK

ప్రతి నెల మొదటి మంగళవారము ప్రత్యేక గణపతి హోమం, మరియు గరిక పూజలు

ప్రతి నెల మొదటి మంగళవారము ప్రత్యేక గణపతి హోమం, మరియు గరిక పూజలు

విదేశీయులు కూడా ఈ మూర్తిని దర్శించాలని వస్తుంటారు. ప్రతి నెల మొదటి మంగళవారము ప్రత్యేక గణపతి హోమం, మరియు గరిక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6.30 గం. అభిషేకం, 8.00 గం. మహానివేదన, రాత్రి 7.00 గం. పూజలు, జరుగుతున్నాయి.

PC: FACEBOOK

పద్దెనిమిదిన్నర కిలోల వెండితో కవచం

పద్దెనిమిదిన్నర కిలోల వెండితో కవచం

ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో కనిపించేలా ఈ స్వామివారికి దేవాలయ నిర్మాణం చేసి, ఐదుగురు పీఠాధిపతుల సమక్షంలో పద్దెనిమిదిన్నర కిలోల వెండితో కవచాన్ని తయారుచేసి స్థిరప్రతిష్ట నేర్పరచటం జరిగింది. మంగళవారం నాటి దర్శనం, ప్రదక్షణలు చేయటం ఇక్కడి విశేషం.. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ శ్వేతార్క గణపతి దేవాలయం మంగళ వారాల్లో మరీ కిక్కిరిసి ఉంటుంది. ప్రతి మంగళవారం గణపతి మూల మంత్రసహితంగా మోదకములతో గణపతి హోమం, రుద్రహవనమును విశేషించి జరుపుతారు.

PC: FACEBOOK

శ్వేతార్క గణపతి దేవాలయంతో పాటు సీతారామ లక్ష్మణ, ఆంజనేయ ఆలయం

శ్వేతార్క గణపతి దేవాలయంతో పాటు సీతారామ లక్ష్మణ, ఆంజనేయ ఆలయం

ఖాజీపేటలోని రైల్వే కాంప్లెక్స్ లో శ్వేతార్క గణపతి దేవాలయంతో పాటు సీతారామ లక్ష్మణ, ఆంజనేయ ఆలయం, పద్మావతీ వేంకటేశ్వరాలయం, అయ్యప్ప ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, సాయిబాబా గుడి కూడా ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ లో అడుగు పెట్టగానే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్లు ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది.

PC: FACEBOOK

విశిష్టత

విశిష్టత

విశిష్టత ప్రతి మంగళవారం దర్శనం, ప్రదక్షణలు చేయటం ఇక్కడి విశిష్టత. గణపతి తూర్పు ముఖంగా ఉండి ఈశాన్యం వైపు కైలాస స్థానాన్ని చూస్తున్నట్లు ఉండటం కూడా ఇక్కడ ఇంకో ప్రత్యేకత. చిత్రకృప : swetharka.org

ఎలా వెళ్లాలి ?.... .

ఎలా వెళ్లాలి ?.... .

ఎలా వెళ్లాలి ?.... .

శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయం హైదరాబాద్ కు 120 కి.మీ దూరంలో వరంగల్ జిల్లాలోని కాజీపేటలోని విష్ణపురిలో ఉన్నది. హైదరాబాద్ - విజయవాడ రైలుమార్గంలో కాజీపేట రైల్వే జంక్షన్ ఉన్నది.

శ్రీ శ్వేతార్క మూలగణపతి దేవాలయం వరంగల్ లోని కాజీపేట్ లో గల విష్ణుపురి లో ఉన్నది. ఇందులో దేవుడు స్వయంభూవుగా వెలిశాడు. భక్తుల కోర్కెలను తీర్చే దైవంగా, ఇంటి ఇలవేల్పుగా ఇక్కడి స్వామీ వారు ప్రసిద్ధి. ఇక్కడ స్వామివారు స్పష్టమైన ఆకృతిని పొంది దర్శనం ఇస్తుంటాడు.

చిత్రకృప : swetharka.org

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more