Search
  • Follow NativePlanet
Share
» »నోరూరించే ఈ ఒడిశా వంట‌కాల‌ను ఓ ప‌ట్టుప‌ట్టండి!

నోరూరించే ఈ ఒడిశా వంట‌కాల‌ను ఓ ప‌ట్టుప‌ట్టండి!

నోరూరించే ఈ ఒడిశా వంట‌కాల‌ను ఓ ప‌ట్టుప‌ట్టండి!

మ‌న దేశంలోని తూర్పు తీరం ఒడిశా అంటే అద్భుత వాస్తుశిల్పం, అందమైన కళాఖండాలు, సంగీతం, నృత్యం, గొప్ప చరిత్ర, తీర్థయాత్రల సంస్కృతితో అలంకరించబడిన ఒక అందమైన రాష్ట్రం గుర్తుకు వ‌స్తుంది. ఈ ఆకర్షణలు కాకుండా, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూపించే మరో అంశం ఇక్క‌డి రుచికరమైన ఒడియా వంటకాలు. ఆహార ప్రియులు ఇక్కడి రుచులను ఇష్టపడతారు.

ఒడియా వంటకాలలో అనేక రకాల శాఖాహార, మాంసాహార వంటకాలు ఉన్నాయి. ఇవి రుచికరమైనవి మరియు ఆరోగ్యకరమైనవి. మీరు ఒడిశా సందర్శించినప్పుడల్లా ఈ నోరూరించే రుచికరమైన వంటకాలను ఇక్కడ రుచి చూడటం మర్చిపోవ‌ద్దు.

బెసర స్పెషల్ రెస‌పీ..

బెసర స్పెషల్ రెస‌పీ..

బెసర అనేది ఒడిశా రుచులను నిర్వచించే ఒక వంటకం. ఈ ఒడియా వంటకం శుభ్ర‌మైన‌ ఆవాలు పేస్ట్‌తోపాటు వెల్లుల్లి, జీలకర్ర, మిరపకాయ మొదలైన ఇత‌ర ప‌దార్థ‌ల‌తో గ్రైండ్ చేయడం ద్వారా స‌రికొత్త రుచుల‌ను సిద్ధం చేస్తారు. బేసర, ఫిష్ బేసర, చికెన్ బేసర వంటి ఇతర వంటకాలను తయారు చేయడానికి ప్రజలు ఈ సిద్ధం చేసిన పేస్ట్/చట్నీని ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా, మహాప్రసాదంగా ప్రసిద్ధి చెందిన అభాదలో బేసర ఓ భాగం. ఇది పూరీ జగన్నాథ ఆలయానికి పంపిణీ చేయబడుతుంది.

పఖాలా

పఖాలా

పఖాలా వంటకం వేసవిలో ఎక్కువగా తింటారు. ఒడిశా ప్రజలు వేడిని తట్టుకోవడానికి ఈ వంటకం చేస్తారు. ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సాంప్రదాయ ఆహారాన్ని గుర్తు చేసుకుంటూ పఖాలా డే జరుపుకొంటారు. తూర్పు భారతదేశం యొక్క ఆహారంలో పఖాలా ఎప్పుడు ప్రవేశించిందో నేటి స్ప‌ష్టంగా చెప్ప‌లేరు. కానీ 10వ శతాబ్దంలో పూరి చిర్కాలోని జగన్నాథ ఆలయంలో ఇది ఆహారంగా చేర్చబడింది.

పఖాలా తొలుత ఒడిశాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒడియాలో వండిన అన్నాన్ని పఖాలా అంటారు. ఇది రాత్రిపూట నీటిలో పులియబెట్టబడుతుంది. ఈ వంటకంలో సగం నీరు/మిగిలిన ద్రవాన్ని త‌ర్వాణీ అంటారు. ఇది చాలా ఆరోగ్యకరమైనది. ఈ సాంప్రదాయ వంటకాన్ని మరింత రుచిగా చేయడానికి, పెరుగు, దోసకాయ, కరివేపాకు, జీలకర్రను పులియబెట్టిన అన్నంలో కలుపుతారు. పఖాలా వేయించిన చేపలు, మెత్తని బంగాళదుంపలు, వేయించిన వంకాయ వంటి ఇతర సైడ్ డిష్‌లతో వడ్డిస్తారు.

దాల్మా

దాల్మా

చాలా మంది భారతీయుల ఇష్టమైన ఆహారంలో దాల్-రైస్ చేర్చబడుతుంది. దేశంలోని ఒక నగరం నుండి మ‌రో నగరానికి వ‌చ్చేస‌రికి పప్పు రుచి మారుతూ ఉంటుంది. ఒడియా స్పెషల్ దాల్మాను పసుపు పప్పులు మరియు కూరగాయలతో ఒక కుండలో వండుతారు. తరువాత జీలకర్ర, ఇంగువ, అల్లం, ఎర్ర మిరపకాయలు, నెయ్యి మొదలైన అత్యంత పోషకమైన పదార్థాలతో తయారు చేస్తారు. ఇది అన్నంతో వేడిగా వడ్డిస్తారు. ఈ సంప్రదాయ వంటకం జగన్నాథ దేవాలయంలో కూడా వడ్డిస్తారు. దాల్మా పురాతన ఒడిశాలోని బలమైన తెగ అయిన సవరల వంట‌కం. నిజానికి, పురావస్తు రికార్డుల ప్రకారం సవరలు ఒడిశాలోని ఆర్యన్యేతర తెగ. వారు సామాజిక సామరస్యానికి ప్రసిద్ధి చెందారు.

మాన్సా ఝోలా

మాన్సా ఝోలా

సాంప్రదాయ ఒడియా వంటకాలలో మటన్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారం. మేక మాంసం, బంగాళదుంపలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, మిరపకాయలు, యాలకులు మొదలైన వాటిని గ్రైండ్ చేయడం ద్వారా ఇంట్లో తయారుచేసిన సుగంధ ద్రవ్యాలతో ఒడియా స్పెషల్ మాన్సా ఝోలా తయారు చేయబడుతుంది. ఝోలా అంటే సూప్ లేదా జ్యూస్. కాబట్టి ఈ వంటకం గ్రేవీగా ఉంటుంది.

Read more about: odisha cuisine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X