» »టూర్‌ వెళుతుంటే ఇవి తప్పనిసరి !

టూర్‌ వెళుతుంటే ఇవి తప్పనిసరి !

Posted By: Venkata Karunasri Nalluru

మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తున్నారా.. చాలా దూరం ప్రయాణిస్తున్నారా..అయితే మీరు ఆ హడావుడిలో ఏదో ఒకటి మరచిపోవడం సహజం. ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు మీరు మరచిపోతారు. ఆ తరువాత తీరిగ్గా మరచిపోయామని భాదపడుతుంటారు. ఇక అవి మరచిపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కునే అవకాశం కూడా ఉంది. అయితే మీరు ట్రావెలింగ్ సమయంలో గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన టెక్నాలజీ వస్తువులను మీకు పరిచయం చేస్తున్నాం. ఓ సారి వాటిని చెక్ చేసుకుంటే మీకు ఏ బాధ ఉండదు.

పారిస్ చూడటానికి ప్లాన్ చేసుకున్నా,రాజస్థాన్ వెళుతున్నా ట్రావెలింగ్ లో కొన్ని వస్తువులను తప్పకుండా వెంట వుంచుకోవాలి. వెళుతున్న ప్రదేశంతో సంబంధం లేకుండా వీటిని తీసికెళ్ళటం మరువద్దు.

టూర్‌ వెళుతుంటే ఇవి తప్పనిసరి !

1. సౌకర్యవంతమైన షూస్

1. సౌకర్యవంతమైన షూస్

టూర్ కు వెళుతున్నప్పుడు మైళ్ళ దూరం నడవాల్సిరావచ్చు.కాబట్టి తప్పకుండా ఒక జత సౌకర్యవంతమైన షూస్ ఉండేలా చూసుకోవాలి.

pc:youtube

2. మ్యాప్

2. మ్యాప్

స్మార్ట్ ఫోనుంది. ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ల అప్లికేషన్లున్నాయి. జిపిఎస్ ట్రాకింగ్ ఫీచర్ కూడా వుంది. ఇంకా భయమేంటి.అనుకోకండి. మీరు వెళ్తున్న ప్రదేశంలో నెట్వర్క్ వుండకపోవచ్చు.కాబట్టి మ్యాప్ ను వెంట తీసికెళ్ళటం తప్పనిసరి.విజిట్ చేస్తున్న ప్రదేశానికి సంబంధించిన మ్యాప్ లేదా గైడ్ బుక్ వుంటే మంచిది.

pc:youtube

3. పోర్టబుల్ ట్రావెల్ చార్జర్

3. పోర్టబుల్ ట్రావెల్ చార్జర్

మీరు మీ స్మార్ట్‌ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా అలాగే ఐ ప్యాడ్ కు ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా ఛార్జర్ చాలా ముఖ్యం. ఇది మరిచిపోతే మీరు తరువాత చాలా చింతించాల్సి వస్తుంది. సెల్ ఫోన్, ఐప్యాడ్ లేకుండా కాలు బయటపెట్టని రోజులివి. టూర్కి వెళ్తున్నప్పుడు సెల్ఫోన్, ఐప్యాడ్ వినియోగం కాస్త ఎక్కువే వుంటుంది. అయితే పోర్టబుల్ చార్జర్ పెట్టుకోవటం మరచిపోవద్దు. టూర్లో మొబైల్ ఫోన్ లో ఫోటోలు తీయటం అందరూ చేసేదే. దీని వల్ల బ్యాటరీ త్వరగా తగ్గిపోతుంది.కాబట్టి పోర్టబుల్ చార్జర్ తప్పనిసరి.

pc:wikimedia.org

4.డూప్లికేట్ డాక్యుమెంట్లు

4.డూప్లికేట్ డాక్యుమెంట్లు

ఒకవేళ విదేశాలకు టూర్ వెళ్తున్నట్లయితే ముఖ్యమైన డాక్యుమెంట్లను ఒక సెట్ డూప్లికేట్స్ తీసిపెట్టుకోండి.పాస్ పోర్ట్, వీసా,ఐడి ప్రూఫ్ వంటి వాటిని జెరాక్స్ తీసిపెట్టుకోవటం మరువద్దు.

pc:youtube

5. ఇంటర్నేషనల్ రోమింగ్

5. ఇంటర్నేషనల్ రోమింగ్

మీరు ఇతర దేశాలకు వెళుతున్నప్పుడు ముందుగానే అక్కడి రోమింగ్ రేట్లు తెలుసుకోండి. మీరు మీ సిమ్ కార్డును ఇతర దేశాల్లో వాడుతున్నప్పుడు రోమింగ్ రేట్స్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. కాబట్టి దానిపై లుక్ వేయడం మంచింది.

6.బ్యాంకింగ్

6.బ్యాంకింగ్

మీరు మీ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు విదేశాల్లో డెబిట్ కార్డులు అలాగే క్రెడిట్ కార్డులు వినియోగిస్తుంటే అవి అక్కడ పనిచేస్తాయా లేదా అన్నది ఓ సారి చెక్ చేసుకోండి.

7.వైఫై

7.వైఫై

మీరు ఎక్కడైనా వైఫై అందుబాటులో ఉంటే వెంటనే యూజ్ చేయకండి. అలా యూజ్ చేయడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. పబ్లిక్ వైఫైలలో హాట్‌స్పాట్ అనేది చాలా ప్రమాదకరమైనది. మీ స్మార్ట్‌ఫోన్ కాని అలాగే ల్యాప్‌టాప్ కాని హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

9.ట్రావెల్ డాక్యుమెంట్

9.ట్రావెల్ డాక్యుమెంట్

మీరు మీ ట్రావెల్ బ్యాగులు సర్దుకునే సమయంలో ఇది చాలా ముఖ్యం. మీరు ఇతరదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇది మీ చేతిలో తప్పనిసరిగా ఉండాల్సిందే.అలాగే వాటి సాఫ్ట్ కాపీలు కూడా మీరు మీ ఫోన్‌లో కాని ల్యాప్‌టాప్‌లో కాని పెట్టుకోవడం మర్చిపోకండి.

10.మనీ

10.మనీ

మీరు ఇతర దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు వీలయినంత ఎక్కువ మనీ ఉండేలా చూసుకోవాలి. అక్కడ మీకు డాలర్లు లేకుంటే ఆ దేశ కరెన్సీ నోట్లు అవసరమవుతాయి. అటువంటి సమయంలో వాటి విలువ మనకు తెలియదు. వీటిపై దృష్టి పెట్టడం చాలామంచిది.