Search
  • Follow NativePlanet
Share
» »కాంచీపురం ... పట్టు వస్త్రాల నగరం !

కాంచీపురం ... పట్టు వస్త్రాల నగరం !

తమిళనాడు లోని కాంచీపురం పట్టణం అక్కడ తయారయ్యే పట్టు చీరలకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. దక్షిణ భారత దేశంలో కుటుంబం లో పెండ్లి అంటే చాలు పట్టు చీరాల కొనుగోలుకు వధువు కంచి పురం వెళ్ళాల్సిందే. కాంచీపురం మీకు అందించే పట్టు మాత్రమే కాదు అనేక దేవాలయాలు కూడా కలిగి పర్యాటకులకు అనేక ఆకర్షణలు అందిస్తుంది. ఇక్కడ కల దేవాలయాలు ద్రావిడ శిల్ప శైలి కలిగి వివిధ శిల్ప శైలులు కలిగి వుంటాయి. ఇక్కడి దేవాలయాలు, సంస్కృతి భక్తులను, పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. ఇక్కడి దేవతల ఆశీస్సులు పొందేందుకు కాంచీపురం తప్పక చూడవలసిన పట్టణం.

వరదరాజ పెరుమాళ్ దేవాలయం

వరదరాజ పెరుమాళ్ దేవాలయం

కాంచీపురా పట్టణం రెండు అంశాలకు ప్రసిద్ధి. ఒకటి అక్కడ కల అందమైన దేవాలయాలు కాగా, రెండెవది అక్కడ తయారయ్యే కాంచీపురం పట్టు చీరలు. కంచిపురంలో సందర్శించాల్సిన దేవాలయాలలో వరదరాజ పేరుమల్ టెంపుల్ ఒకట. విష్ణుమూర్తి అవతారమైన వరద రాజుని విగ్రహం కల ఈ దేవాలయం
108 దివ్య దేశాలలో ఒకటి. ఈ దేవాలయం ఒక పెద్ద సముదాయంలో కలదు. ద్రావిడ దేవాలయ శిల్ప శైలి కి చక్కని ఉదాహరణ. దేవాలా స్తంభాలపై అనేక శిల్పాలు చెక్కబడి వుంటాయి. ఈ దేవాలయ రాజగోపురం సుమారు 130 అడుగుల పొడవు కలదు. ఈ దేవాలయంలో సుమారు 32 పుణ్య ప్రదేశాలు కలవు. వాటిలో మహాభారత, రామాయణ కావ్యాల నుండి కొన్ని చిత్రాలను సమ కూర్చిన సుమారు నూరు స్తంభాల హాలు ఒకటి తప్పక చూడదగినది. Photo Courtesy: Rathishkrishnan

కంచి కైలాష నాతార్ దేవాలయం

కంచి కైలాష నాతార్ దేవాలయం

కాంచీపురం లోని దేవాలయాలలో కంచి కైలాసనాతార్ దేవాలం అతిపురాతనమైనది. పల్లవుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం ఇసుక రాతితో నిర్మించ బడి, శివుడిని ప్రధాన దేవుడు గా కలిగి వుంటుంది. ఇసుక రాతి నిర్మాణం ను బలపరచేందుకు ఇక్కడ గ్రానైట్ పునాదులు నిర్మించటం మరొక విశేషం.ప్రధాన గుడి 18 కొనాల శివలింగం నల్లటి గ్రానైట్ తో చేయబడి వుంటుంది. టెంపుల్ లోపలి భాగాలలో అనేక అందమైన శిల్పాలు కలవు. వీటిలో ద్రావిడ శిల్ప శైలి కల సగం జంతువుల చెక్కడాలు అధికంగా కనపడతాయి.
Photo Courtesy: Keshav Mukund Kandhadai

కామాక్షి అమ్మవారి గుడి

కామాక్షి అమ్మవారి గుడి

కాంచిపురంలో కల కామాక్షి మాత దేవాలయం తప్పక చూడదగినది. ఈమె పార్వతి దేవి అవతారం గా చెపుతారు. ఈ గుడి పల్లవుల కాలంలో నిర్మించారు. పద్మాసనం లో కూర్చుని వున్నా మాత కామాక్షి విగ్రహం ఈ టెంపుల్ లో ప్రధాన ఆకర్షణ. తన నాలుగు చేతులతో హుందాగా కూర్చుని వున్నా మాత భక్తులకు చక్కని అనుభూతి కలిగిస్తుంది. ఈ దేవాలయంలో సంవత్సరం పొడవునా అనేక పండుగలు జరుగుతాయి.

Photo Courtesy: Will De Freitas

కామాక్షి అమ్మవారి గుడి

కామాక్షి అమ్మవారి గుడి

కాంచిపురంలో కల కామాక్షి మాత దేవాలయం తప్పక చూడదగినది. ఈమె పార్వతి దేవి అవతారం గా చెపుతారు. ఈ గుడి పల్లవుల కాలంలో నిర్మించారు. పద్మాసనం లో కూర్చుని వున్న మాత కామాక్షి విగ్రహం ఈ టెంపుల్ లో ప్రధాన ఆకర్షణ. తన నాలుగు చేతులతో హుందాగా కూర్చుని వున్నా మాత భక్తులకు చక్కని అనుభూతి కలిగిస్తుంది. ఈ దేవాలయంలో సంవత్సరం పొడవునా అనేక పండుగలు జరుగుతాయి.

Photo Courtesy: Will De Freitas

కంచి కుదిల్

కంచి కుదిల్

కాంచిపురం నగరం లో పుష్కలమైన చరిత్ర మరియు సంస్కృతి కలవు. ఇక్కడకు వచ్చిన పర్యాటకులకు నగరం గురించి మరింత అవగాహన కలిగేన్చేందుకు 90 సంవత్సరాల పురాతనమైన కంచి కుదిల్ లేదా కంచి నివాసాన్ని పునరుద్ధరించారు. ఇక్కడ జరిగే సాంస్కృతిక ప్రోగ్రాం లు ఆనందం కలిగిస్తాయి. స్థానిక ఆహారాలు రుచికరమైనవి లభిస్తాయి. కంచి భవనం ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా రూపు చెందినది. Photo Courtesy: Destination8infinity

 వేదాన్తగల్ బర్డ్ సాన్క్చురి

వేదాన్తగల్ బర్డ్ సాన్క్చురి

కంచి పురం లో వేదంతగల్ బర్డ్ సాన్క్చురి పర్యాటకులకు ఒక మంచి విహార ప్రదేశం. ఇది కంచి నగరానికి సుమారు 48 కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడ అనేక జాతుల పక్షులు చూడవచ్చు. ఈ సాన్క్చురి ఇండియా లోని పురాతన సాన్చురీలలో ఒకటి. సుమారు 7 4 ఎకరాలలో విస్తరించి వుంది. ఇది పక్షుల స్వర్గం వలె వుంటుంది. ఇక్కడకు వెళ్ళేటపుడు మీ కెమెరా తీసుకు వెళ్ళటం మరువకండి. Photo Courtesy: Shravantamaskar

కచాపెస్వరార్ దేవాలయం

కచాపెస్వరార్ దేవాలయం

చిన్నదైన ఈ కచాపెస్వరార్ దేవాలయాన్ని ఏకాంబ రేస్వరార్ టెంపుల్ కు వెళ్ళే మార్గంలో చూడవచ్చు. ఇది ఒక దాగి వున్నా రత్నం వంటిది. టెంపుల్ చిన్నడైనప్పటికి, దీని చుట్టూ అందమైన సరస్సు, అనేక వృక్షాలు కలవు. ప్రశాంత వాతావరణానికి దోహదం చేస్తుంది. Photo Courtesy: Giles Clark

సిల్క్ టూరిజం

సిల్క్ టూరిజం

నగరంలో కల సిల్క్ వస్త్రాల తయారీ చూడకుంటే మీ కంచిపుర యాత్ర పూర్తి కానట్లే. కాంచీపురం సిల్క్ చీరలు కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఇష్టపడతారు. ప్రతి సంవత్సరం ఇక్కడ సిల్క్ టూరిజం ఫెస్టివల్ జరుగుతుంది. షాపింగ్ కంటే కూడా ఈ ఫెస్టివల్ మరింత ఆనందాలు పంచుతుంది.

Photo Courtesy: Kamal Venkit

ఫుడ్ మరియు షాపింగ్

ఫుడ్ మరియు షాపింగ్

కాంచిపురంలో మీకు దక్షిణ భారత దేశ వంటకాలు ఇడ్లి నుండి ప్రసిద్ధ మసాల దోసె మరియు రుచికర భోజనం వరకు రెస్ట రెంట్ లలో లభిస్తాయి.
ఇక మీరు సిల్క్ చీరెలు కొనుగోలు చేయాలంటే, నేరుగా గాంధీ రోడ్ లోకి వెళ్లి వివిధ రకాల రంగు రంగుల చీరేలను కొనుగోలు చేయవచ్చు. ఇక్కడే మీరు వివిధ రకాల హస్త కళా వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు.

Photo Courtesy: McKay Savage

కాంచీపురం ఎలా చేరాలి ?

కాంచీపురం ఎలా చేరాలి ?

చెన్నై నుండి మీరు స్వంత వాహనంలో చేరాలంటే, జాతీయ రహదారి 4 పై ప్రయానించండి. జాతీయ రహదారి నుండి సుమారు 72 కి. మీ. ల దూరంలో మీరు నగరం చేరవచ్చు. దేశంలోని ప్రధాన నగరాల నుండి అనేక ప్రభుత్వ, మరిఉ ప్రైవేట్ బస్సు లు కన్చిపురానికి నడుస్తాయి.

రైలు ప్రయాణం
కాంచీపురం రైల్వే స్టేషన్ నుండి చెన్నై, తిరుపతి, నగర్ కోయల్, చెంగల్పట్టు, బెంగుళూరు మోదలకు నగరాలకు రైళ్ళు కలవు.

విమాన ప్రయాణం
కన్చీపురానికి 75 కి. మీ. ల దూరంలో కల చెన్నై లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడ నుండి స్థానిక మరిఉ విదేశీ విమానాలు అన్ని ప్రధాన నగరాలకు కలవు. Photo Courtesy: Simply CVR


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X