Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో పచ్చటి నగరాలు !

ఇండియాలో పచ్చటి నగరాలు !

భారత దేశం ఎన్నో సహజ అందాలకు ప్రకృతి దృశ్యాలకు నిలయంగా పేరు పడింది. ఈ భూమిపై అనేక అడవులు, నదులు, సరస్సులు, పర్వతాలు దేసీయులనే కాదు, విదేశీయులను సైతం అచ్చేరువొందిస్తాయి. అయితే, ఆధునిక కాలంలో భారత దేశం సాంకేతిక పరంగా కూడా ముందంజ వేసింది. ఫలితంగా పర్యావరణ పరిస్తిలులలో కూడా మార్పు వచ్చింది. ప్రత్యేకించి నగరాలలోని పచ్చదనం నిర్వహణ విషయంలో వెనుక పది పోతున్నాము. మౌలిక వసతుల సదుపాయాల పేరుతో ఇండియా తన పచ్చటి పరిసరాలను కోల్పోతోంది.

అయినప్పటికీ, ఇండియాలో నేటికీ చక్కగా ప్రణాళిక చేయబడి పచ్చదనం కాపాడుకుంటున్న నగరాలు కొన్ని కలవు. ఈ నగరాలు తమకు గల ఉత్తమ పర్యావరణం గురించి గర్వపడతాయి. వీటిలోని పార్కులు, సాన్క్చురి లు, సరస్సులు తో ఈ నగరాలు పచ్చటి ప్రదేశాలతో కను విందు చేస్తాయి. తాజా అనుభూతులనిచ్చే చల్లటి గాలులు అందమైన దృశ్యాలు ఈ నగరాలను టూరిస్ట్ ఆకర్షణలుగా కూడా చేస్తున్నాయి.
అటువంటి పచ్చటి నగరాలను కొన్నింటిని మీకు పరిచయం చేస్తున్నాం... పరిశీలించండి.

బెంగుళూరు, కర్నాటక
ప్రపంచ వ్యాప్తంగా బెంగుళూరు నగరాన్ని 'గార్డెన్ సిటీ అఫ్ ఇండియా' అని అంటారు. ఈ నగరం కర్నాటక రాష్ట్రానికి కేపిటల్ గా వుంది. ఈ నగర సాంకేతిక అభివృద్ధికి గాను దీనిని 'సిలికాన్ వాలీ అఫ్ ఇండియా' అని కూడా అంటారు. నగరంలో కల పచ్చటి పార్కులు, గార్డెన్ లు, సరస్సులు, పర్యాటకులకు గొప్ప ఆకర్షణగా నిలుస్తాయి.

లాల్ బాగ్, కబ్బన్ పార్క్ వంటి గార్డెన్ లను విదేశీ టూరిస్ట్ లు కూడా తరచుగా సందర్శిస్తారు. వీటి నిర్వహణ చాలా బాగుంటుంది. కంటికి ఇంపైన సరస్సులు అల్సూర్ సరస్సు, హీసరఘట్ట సరస్సు మొదలైనవి కలవు. వీటి అందాలు పర్యాటకులకు బెంగుళూరు నగర విలువలు చాటుతాయి.

గాంధీనగర్, గుజరాత్

గుజరాత్ లోని గాంధీనగర్ మరొక పచ్చటి నగరం. ఇక్కడ సుమారు 32 లక్షల చెట్లు కలవు. పర్యాటకులకు ఈ ప్రదేశం ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుడి. ఇక్కడ కల పచ్చటి, పరిశుభ్రమైన వాతావరణం ఈ సిటీ ని ఒక ప్రాధాన్యత కలదిగా చేసింది. సబర్మతి నది ఒడ్డున కల ఈ నగరం అక్కడి సబర్మతి ఆశ్రం మరియు అక్షరధాం టెంపుల్ ల కారణంగా కూడా ప్రసిద్ధి చెందినది.

చండీఘర్, పంజాబ్ మరియు హర్యానా
చండీఘర్ నగరం ఇండియా లో మొట్ట మొదటి ప్రణాలికా బద్ధ నగరంగా పేరు గాంచినది. ఇది కేంద్ర పాలిత ప్రాంతం మరియు పంజాబ్, హర్యానాలకు రాజధాని.

ఇక్కడ కల రాక్ గార్డెన్, సుహానా సరస్సు, వంటివి నగరానికి ఆకర్షణ. ఈ నగర ప్రణాళిక ఫ్రెంచ్ శిల్పకారుడు లీ కార్బూసిఎర్ రూపొందించాడు. చండీఘర్ ను ఇండియాలోనే పరిశుభ్రమైన, మరియు పచ్చటి నగరం గా చెపుతారు. ఇక్కడి పర్యావరణం, పరిసరాలు స్నేహపూరితంగా వుంటాయి. అందరూ మెచ్చే అనేక తోటలు, పార్కులు, సరస్సులు, అడవీ ప్రదేశాలు ఈ నగరాన్ని ఒక పచ్చటి అందాల నగరంగా తీర్చి దిద్దాయి.

నాగపూర్ , మహారాష్ట్ర
ఇండియా లో ఈ నగరం పడవ పెద్ద నగరం. విస్తారమైన మౌలిక వసతులు కలిగి, సుందర ప్రదేశాలతో నిండి వుంది. అనేక సహజ మరియు మానవ నిర్మిత సరస్సులు ఇక్కడ కలవు. ఇక్కడి సరస్సులలో అమ్బజారి సరస్సు పెద్దది. ఇండియా లో గొప్ప పర్యాటక ప్రదేశంగా కూడా పేరు పడింది. నగరం పరిశుభ్రతకు, చక్కని పర్యావరణానికి పేరు పడింది. ఎన్నో పార్కులు, చెట్లు, వైల్డ్ లైఫ్ సంక్చురి లు , హిల్ స్టేషన్ లు ఇక్కడ కలవు.

పచ్చదనం పరిశుభ్రత !

తిరువనంతపురం, కేరళ
పచ్చటి ప్రదేశాలు, అందమైన బీచ్ లు, కల కేరళ రాష్ట్రాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ గా పేర్కొంటారు. ఈ రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురం కేరళ తో పోటీ పడుతూ మరింత అందంగా కూడా వుంటుంది.

తిరువనంతపురంలో అందమైన బీచ్ లు శంఘుముఘం బీచ్, కోవలం బీచ్, ఆజిమాల బీచ్ లు కలవు. ఎపుడూ పచ్చగా వుండే ఈ నగరం అదనంగా అనేక అటవీ ప్రదేశాలు, వన్య జీవుల నిలయాలు, అద్భుతం అనిపించే బ్యాక్ వాటర్స్ కలిగి ఇండియా లోని మరొక గ్రీన్ సిటీ గా పెర్కొనబడుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X