» »కొండ చరియలలో దెయ్యాలు తిరిగే అతి భయంకర ప్రదేశాలు మీకు తెలుసా ?

కొండ చరియలలో దెయ్యాలు తిరిగే అతి భయంకర ప్రదేశాలు మీకు తెలుసా ?

Posted By: Venkata Karunasri Nalluru

భారతదేశంలో అనేక కొండ ప్రాంతాలలో అటవీ ప్రదేశాలలో జరిగిన దెయ్యాల కథలను మీరు వినే వుంటారు ! కానీ కుర్సియాంగ్ కొండ చరియలలో పూర్తి భిన్నంగా జరిగింది. రహస్యమైన అడవులలో, భవనాలలో, చెడు పర్వతారోహణలో చనిపోయిన ఎర్రని కళ్ళు కలిగిన శవం యొక్క మరణరహస్యాలు వెంటాడుతూ వుండే ప్రాంతం పేరు కుర్సియాంగ్. ఇది ఒక దెయ్యం పట్టణం అని తెలుస్తోంది.

మనం నివసించే భూగోళంలో మనకు తెలియని ఎన్నో వింతలూ విశేషాలు ఉన్నాయి. భయాన్ని కలిగించే ప్రదేశాలు ఉన్నాయి. అందమైన, అరుదైన ప్రదేశాలు ఉన్నాయి. అన్నింటిని కలిగి ఉన్నదే భూగోళం. అందమైన ప్రదేశాల గురించి, వింతలూ విశేషాల గురించి ఇప్పటివరకు మనం చూసే ఉన్నాం. అయితే, భూగోళంలో భయాన్ని కలిగించే ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో, అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఎక్కడో వేరే దేశాలలో మనకెందుకు !! స్వయానా మనదేశంలోనే చెప్పలేనన్ని గుండె దడ పుట్టించే అతి భయంకర ప్రదేశాలున్నాయి. అతీంద్రియ శక్తుల విషయానికి వస్తే, భారతదేశంలో చాలా ప్రదేశాలు దయ్యాలతో ముడిపడి ఉన్నాయి. భారతదేశంలో చాలా ప్రదేశాలను దాని చరిత్ర మరియు కొన్ని సంఘటనల ఆధారంగా ఒక 'హాంటెడ్ ప్రదేశం'గా లెక్కిస్తారు. పారానార్మల్ నిపుణులు కూడా భారతదేశంలో కొన్ని హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయని అంగీకరించారు.

గుండె దడ పుట్టించే అతి భయంకర ప్రదేశాలు !

కుర్సియాంగ్ సుందరమైన ప్రకృతి దృశ్యాలు, వృక్షాలతో నిండిన పర్వతాలు, పచ్చని టీ తోటలు మందపాటి అడవులతో నిండి వున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక పర్వత కేంద్రం. దీని యొక్క మారు పేరు 'ఆర్కిడ్లు భూమి'. అది ఒక చీకటి ప్రాంతం. భారతదేశంలో ఇది అత్యంత భయకరమైన ప్రదేశాలలో ఒకటి అని నమ్మవచ్చును. భారతదేశంలో అత్యంత రహస్యమైన ప్రాంతాలలో ఒకటైన కుర్సియాంగ్ కొండ యొక్క పారానార్మల్ కార్యకలాపాలు పరిశీలిద్దామా! డౌ హిల్ - పశ్చిమ బెంగాల్ కుర్సియాంగ్ దగ్గర ఉన్న పాఠశాల మరియు అడవి ఒక హాంటెడ్ ప్రదేశంగా భావించబడుతుంది. చాలా మంది మధ్య హత్యలు మరియు భయానక అతీంద్రియ కార్యకలాపాలు ఒక వింత అనుభూతి కలిగిస్తాయి. మరణ వీధులు, తల లేని శవం మరియు ఇంకా చాలా విషయాలు కుర్సియాంగ్ డౌ యొక్క భయంకరమైన కొండ ప్రదేశాలు! ఇక్కడ అనేక పారానార్మల్ కార్యకలాపాలు జరుగుతాయి. డార్జిలింగ్ దగ్గర గల ఒక అందమైన హిల్ స్టేషన్ లో ఒక రహస్యమైన ప్రదేశంలో ఒక నీడ పర్యాటకులను ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి అనేక దెయ్యం కథలు వున్నాయి.

భయంకరమైన అడవులు మరియు ఒక మరణ రహదారి!

గుండె దడ పుట్టించే అతి భయంకర ప్రదేశాలు !

డౌ కొండ రోడ్డుకు అటవీ కార్యాలయానికి మధ్యన ఒక చిన్న స్ట్రెచ్ రోడ్ వస్తుంది. దీనిని మరణ రహదారి అంటారు. ఇక్కడ వుండే వుడ్ కట్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రక్తం కారుతూ వున్న ఒక తల లేని యువకుడు తరచూ రోడ్డు మీద నడుస్తూ అడవుల్లోకి వెళ్లి కనుమరుగావుతుంటాడని అంటారు. అంతేకాకుండా ఇక్కడ ప్రజలు కూడా మచ్చలతో బూడిద బట్టలతో ఎరుపు కన్ను కలిగిన ఒక మహిళ చుట్టూ తిరుగుతూ ఒక క్షణం వుండి మాయమవుతుందని చెప్తారు. ఈ అడవులలో ఒక్క క్షణం కనిపించి మాయమైన భావన చూసి పిచ్చి వాళ్లయిపోయారు. మరికొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు.

అడవుల సమీపంలో సందర్శించగల్గే భయంకరమైన పాఠశాల!

గుండె దడ పుట్టించే అతి భయంకర ప్రదేశాలు !

కుర్సియాంగ్ దగ్గర ఉన్న పాఠశాల మరియు అడవి ఒక హాంటెడ్ ప్రదేశంగా భావించబడుతుంది. చాలా మంది మధ్య హత్యలు మరియు భయానక అతీంద్రియ కార్యకలాపాలు ఒక వింత అనుభూతి కలిగిస్తాయి. డిశంబర్ మార్చి నెలల్లో ఈ పాఠశాలలో అడుగుల శబ్దం వినిపిస్తుంది. అడవులలో జరిగిన ఈ దెయ్యం కథలు ఎంతో గగుర్పాటు కలిగిస్తుంది.

భారతదేశంలో రియల్ గా జరిగిన దెయ్యాల కథలకు, ఇతర మిస్టీరియస్ ప్రదేశాల గురించి చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.