» »భీమ్‌బేట్కా శిలా గుహలు ప్రాచీన శిలా యుగం నాటి పురావస్తు గుహలు

భీమ్‌బేట్కా శిలా గుహలు ప్రాచీన శిలా యుగం నాటి పురావస్తు గుహలు

By: Venkata Karunasri Nalluru

భీంబేట్కా శిలా నివాసాలు భారత ఉపఖండంలో మానవ జీవితం యొక్క తొలి జాడలు రాతియుగ కాలానికి చెందిన ఒక పురావస్తుశాస్త్ర ప్రదేశానికి చెంది వున్నాయి. ఈ శిలా నివాసాలు రాతి యుగం యొక్క సాక్ష్యం. ఈ గుహలు భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైసేన్ జిల్లా అబ్దుల్లాగన్జ్ పట్టణానికి సమీపంలోని రతపాని వన్యప్రాణి అభయారణ్యంలో ఉన్నాయి. ఇందులో కొన్ని గుహలలో 1,00,000 (1 లక్ష) సంవత్సరాలకు పూర్వం హోమో ఎరక్టస్ అనే ఆది మానవ జాతి నివసించారు.

ఇక్కడ కనుగొన్న రాతి చిత్రలేఖనాలకు కొన్ని దాదాపు 30,000 సంవత్సరాల వయస్సు చెప్పబడింది. ఈ గుహలు 2003 వ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కోచే గుర్తించబడినది.

భీమ్ బేట్కా ప్రాచీన శిలా యుగం నాటి గుహలు

PC: wikimedia.org

భీంబేట్కా అనే పేరు పాండవులలో భీమునికి సంబంధించినది.

భీంబేట్కా అనే పదం భీంబైత్క అనే పదం నుండి వచ్చిందని చెప్తారు. భీంబైత్క అంటే భీముడు కూర్చుని వున్న స్థలం అని అర్థం.

సందర్శించుటకు గల ఉత్తమ సమయం

శీతాకాలం మరియు వర్షాకాలం సందర్శించడానికి ఉత్తమ సమయం. శీతాకాలం అక్టోబర్ నుండి మార్చి వరకు మరియు వర్షాకాలం జులై నుండి సెప్టెంబర్ వరకు వుంటుంది.

భీమ్ బేట్కా ప్రాచీన శిలా యుగం నాటి గుహలు

PC: wikimedia.org

పరిశోధనలు

భీంబేట్కాను స్థానిక తెగల నుంచి సమాచారాన్ని సేకరించడానికి బౌద్ధ సైట్ గా 1888 వ సంవత్సరంలో పురావస్తు రికార్డుల్లో నమోదు చేశారు.

కొద్దికాలం తర్వాత వి. యస్. వకంకర్ కు వారే వద్ద భూపాల్ రైలు ప్రయాణం చేయవలసి వచ్చింది. అక్కడ కొన్ని రాతి నిర్మాణాలు చూడటం జరిగింది. ఇవి స్పెయిన్ మరియు ఫ్రాన్స్ లో చూసిన రాతి నిర్మాణాలను పోలి వున్నాయి.

ఆ తర్వాత ఆయన 1957 వ సంవత్సరంలో పురావస్తు జట్టుతో ఈ ప్రాంతాన్ని సందర్శించి అనేక చరిత్ర పూర్వ శిలా నివాసాలు కనుగొన్నారు. వకంకర్ పరిశోధనల రికార్డు వెలువడ్డాక, 750 కన్నా ఎక్కువ షెల్టర్స్, భీంబేట్కా సమూహంలో 243 షెల్టర్స్, లఖ జార్ సమూహంలో 178 షెల్టర్స్ వున్నాయి.

పురాతత్వ అధ్యయనాలు రాతి యుగ సంస్కృతుల నిరంతర క్రమంలో ప్రపంచంలో అత్యంత పురాతనమైన రాతి గోడలు మరియు అంతస్తుల గూర్చి వివరించినది.

భీమ్ బేట్కా ప్రాచీన శిలా యుగం నాటి గుహలు

PC: wikimedia.org

రాక్ పెయింటింగ్ కళ

భీంబేట్కా వద్ద గల రాక్ ఆశ్రయాలలో మరియు గుహలలో పెద్ద సంఖ్యలో చిత్రాలు వున్నాయి. ఇవి సుమారు 30,000 సంవత్సరాల నాటివని భావిస్తారు. ఇక్కడ గల పెయింటింగ్స్ లో వాడిన రంగులు, డ్రాయింగ్లు, సాధారణంగా ఒక కుహరం లోపలి లేదా లోతైన లోపలి గోడలపై రూపొందించినవి కావడంతో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి. ఇది కూరగాయల రంగులని కలిగి వున్నాయి.

చిత్రలేఖనాలు మరియు చిత్రాలను ఏడు వేర్వేరు కాలాల క్రింద వర్గీకరించబడ్డాయి.

1. ఎగువ పురాతన యుగం

ఇది ముదురు ఎరుపు మరియు ఆకుపచ్చని రంగులలో గల సరళ వర్ణనలు కలిగి వుంటుంది. ఈ చిత్రాలు ప్రధానంగా పులులు, అడవిదున్న మరియు ఖడ్గమృగాలు వంటి జంతువులను కలిగి వుంటాయి.

2. రాతియుగం

ఈ చిత్రాలు మూర్తులు అలంకరణ శైలితో పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి. వారు ఉపయోగించే ఆయుధాల స్పష్టమైన అవగాహన ఇస్తున్న మానవులు మరియు జంతువులతో పాటు వేట దృశ్యాలు వున్నాయి.

భీమ్ బేట్కా ప్రాచీన శిలా యుగం నాటి గుహలు

PC: wikimedia.org

నృత్యాలు, పక్షులు, సంగీత సాధన, తల్లులు మరియు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, త్రాగుడు మరియు సమాధులు మొదలైన వర్ణనలు ఉన్నాయి.

3. సున్నపురాతి యుగం

ఈ కాలంలో ఈ ప్రాంత గుహ నివాసులు, మైదానాలు, వ్యవసాయ సంఘాలతో నిశ్చితార్థం, వస్తువుల మార్పిడి చేసేందుకు ఉపయోగించేవారు మొదలైన చిత్రాలు చూపిస్తున్నాయి.

4 & 5. ప్రారంభ చారిత్రక యుగం

ఈ సమూహంలో బొమ్మలు చాలా సాధారణమైన అలంకరణ శైలిని కలిగివుంటాయి. ప్రధానంగా ఎరుపు, తెలుపు మరియు పసుపు రంగులలో పెయింట్ చేయబడి వున్నాయి. ఇక్కడ ప్రయాణీక సంఘం మతపరమైన చిహ్నాలకు, దుస్తుల వర్ణనకు మరియు విభిన్న కాలాలకు సంబంధించిన లిఖిత పూర్వక ఆధారాలు వున్నాయి. మత విశ్వాసాలకు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చెట్టు దేవుళ్ళు, యక్షులు మరియు ఆకాశంలో రథాలు చూపించబడి వున్నాయి.

భీమ్ బేట్కా ప్రాచీన శిలా యుగం నాటి గుహలు

PC: wikimedia.org

6 & 7. మధ్యయుగం

ఈ కాలంలో రేఖాగణిత ఆకారాలను పోలిన చిత్రలేఖనాలు వున్నాయి. ఇవి కళాత్మక శైలిని కలిగి వున్నాయి. గుహ నివాసులు మాంగనీస్, హెమటైట్ మరియు బొగ్గు కాంబినేషన్ తో రంగులు తయారు చేశారు.

ఇక్కడ గల రాక్ ను ప్రముఖంగా జూ రాక్ అని పిలుస్తారు. ఏనుగులు, బరసింఘ, అడవిదున్న మరియు జింక వర్ణనలను కలిగి వున్నాయి.

మరొక రాక్ లో ఒక నెమలి, పాము, జింక మరియు సూర్యుడు చిత్రలేఖనాలు చూడవచ్చు. మరొక రాక్ లో దంతాలు మరియు వేటగాళ్ళు మోస్తున్న విల్లు, బాణాలు, కత్తులు మరియు షీల్డ్స్ తో రెండు ఏనుగులు పెయింటింగ్స్ చూడవచ్చును.

Please Wait while comments are loading...