Search
  • Follow NativePlanet
Share
» »అక్కడికి వెళితే ఆ సామర్థ్యం పెరుగుతుందా?

అక్కడికి వెళితే ఆ సామర్థ్యం పెరుగుతుందా?

By Beldaru Sajjendrakishore

ఇండియా లో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే క్షేత్రం ఖజురాహో .''ఇండో ఆర్యన్ కళకు'' అద్దం పట్టే శిల్ప వైభవం ఇక్కడే చూస్తాం .దేవాలయ శిల్పకళకు అపూర్వ శిల్పాలకు ప్రపంచం లోనే గొప్ప ప్రదేశం ఖజురహో .తొమ్మిదో శతాబ్దం నుండి పదకొండవ శతాబ్ది లోపు నిర్మితమైన దేవాలయ సముదాయం ఇది .చండేలా రాజ వంశీకుల అద్వితీయ కళా తృష్ణ కు శిల్పుల కళా సృష్టికి దర్పణం .85దేవాలయాలలో ఇప్పుడు మిగిలింది కేవలం 25మాత్రమె .

పురుషాంగ రూపంలో 'లింగ'మయ్య

ఇక ఇక్కడకు వెళితే శృంగార పరమైన కోరికలు పెరిగి ఆ సామర్థ్యం కూడా పెరుగుతుందని చెబుతారు. ఇందుకు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఖజురహో శిల్పాలను గాంధీ అసహించుకుంటే మన విశ్వకవి ఠాగూర్ ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ ఖజురహో దేవాలయాలు ఓ కుమారుడికి తల్లి పై ఉన్న గౌరవానికి ప్రతీకగా నిర్మించినవని ఎంతమందికి తెలుసు. ఈ వివరాలన్నింటితో కూడిన కథనం నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. వారసత్వ సంపద

1. వారసత్వ సంపద

Image Source:

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తర్ పూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఢిల్లీకు 620 కి.మీ. దూరంలో గల ప్రాంతం. ఇక్కడి నిర్మాణ సమూహాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి. ఈ దేవాలయాలు, హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు సంస్కృతం భాషనుండి మూలంగా వచ్చింది. సంస్కృతంలో ఖజూర్ అనగా ఖర్జూరము.

2. ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించేది

2. ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించేది

Image Source:

ఇండియా లో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే క్షేత్రం ఖజురాహో. చండేలా రాజ వంశీకుల అద్వితీయ కళా తృష్ణ కు శిల్పుల కళా సృష్టికి దర్పణం .85దేవాలయాలలో ఇప్పుడు మిగిలింది కేవలం 25మాత్రమే. ఖజురహో సాగర్ ఒడ్డున ఖజురహో గ్రామం ఎనిమిది వేల జనాభా తో ఉంది .మధ్యప్రదేశ్ లో చట్టర్పూర్ జిల్లాలో ఖజురహో ఉంది. నర్మదా, చంబల్ నదుల పరివాహక ప్రాంతం .

3. ఖర్జుర వనం అని అర్థం

3. ఖర్జుర వనం అని అర్థం

Image Source:

అలేక్సాందర్ కన్నింగ్ హాం ఖజురాహో అంటే ‘ఖర్జూర వనం' అని అర్ధం. ' దీనిని ఆ రోజుల్లో ‘ఖర్జూర వాటిక'అనే వారు. అది ఉచ్చస్తితి లో ఉన్నప్పుడు ఇక్కడ ఖర్జూరం విపరీతం గా పండేది .దీనికి సాక్ష్యం గా రెండు బంగారు ఖర్జూరాలు సిటీ గేట్ల వద్ద త్రవ్వకాలలో లభించాయి .ఈ ఆలయాలపై బూతు బొమ్మలు అధికం. వాటిని విడి గా చూడకుండా మొత్తం ఒకే ద్రుష్టి తో చూడాలని చరిత్రకారులన్నారు .

4. గాంధికి నచ్చనిది...ఠాగూర్ మెచ్చినది

4. గాంధికి నచ్చనిది...ఠాగూర్ మెచ్చినది

Image Source:

మహాత్మా గాంధి ఈ ఆలయాలను చూసి ‘చాలా జుగుప్సా కరమైన శిల్పాలనీ వీటిని వెంటనే తొలగించేయాలని' హితవు పలికాడు. దానికి స్పందించిన గురుదేవులు రవీంద్ర నాద టాగూర్ ‘ఖజురహో జాతీయ నిధి అని దాన్ని కూల్చేయ మనటం అవివేకమని ,అలా చేస్తే మన పూర్వీకులు మరీ శృంగార జీవులు అనే అభిప్రాయం ఏర్పడుతుంద అని గాంధీకే సమాధానం ఇవ్వడంతో ఆ వివాదం అంతటితో ముగిసిపోయింది.

5. చండేలా హిందూ రాజుల రాజధాని

5. చండేలా హిందూ రాజుల రాజధాని

Image Source:

10 నుండి 12వ శతాబ్ద కాలం వరకు భారత దేశములో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చండేలా అనే హిందూ రాజపుత్ర వంశస్థుల రాజధానిగా వర్థిల్లినది. ఈ దేవాలయాల సమూహాలు 950 నుండి 1050 మధ్య సుమారు నూరు సంవత్సరాల మధ్య కాలంలో నిర్మింపబడినవి. తరువాతి కాలంలో చందేల రాజధాని మహోబాకు మార్చబడింది. అయినా మరి కొంత కాలం పాటు ఖజురాహో వెలుగొందినది.

6. 80కు పైగా హిందూ దేవాలయాలు...

6. 80కు పైగా హిందూ దేవాలయాలు...

Image Source:

దీని చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉంది. ప్రతి ద్వారము రెండు బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉంది. సుమారు 8 చదరపు మైళ్ళ అంటే 21 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో 80 కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి. కాని ప్రస్తుతం 22 మాత్రమే చెప్పుకోదగినంత వరకు పునరుద్ధరించబడినాయి.

7. బ్రిటీష్ వారి చొరవతో

7. బ్రిటీష్ వారి చొరవతో

Image Source:

ఉత్తర భారతంలో ఇతర సాంస్కృతిక స్థానాల వలె ఖజురాహో దేవాలయాలు క్రీ.శ.1100-1400 ల మధ్య ముస్లిం చొరబాటు దారుల చేత నేలమట్టం కాలేదు. 16వ శతాబ్దికి ఖజురహో వైభవం అంతా హారతి కర్పూరం అయి పోయింది .1838వరకు దీని గురించి బయటి ప్రపంచానికి తెలియ లేదు. తరువాత 19 వ శతాబ్దంలో బ్రిటీష్ వారు ఖజురహోను వెలుగులోకి తీసుకువచ్చారు.

8. ఖజురహో వృత్తాంతం

8. ఖజురహో వృత్తాంతం

Image Source:

ఖజురహో గురించి అనేక కథనాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది..చండేలా రాజులు రాజపుత్ర వంశానికి చెందిన చంద్ర వంశ రాజులు. చండేలా రాజులు మధ్య భారతాన్ని చాలా కాలం ఏలారు .తొమ్మిదో శతాబ్ది నుండి పద్నాలుగో శతాబ్ది వరకు వీరి పాలన సాగింది .వీరిని ‘జేజక భుక్తి'రాజులు లేదా ‘బుందేల్ ఖండ్'రాజులంటారు .చాంద్ బర్డాయి అనే ప్రాచీన కవి ధిల్లీ అజ్మీర్ ల పాలకుడైన పృధ్వీరాజుచౌహాన్ ఆస్థాన కవి గా ఉండేవాడు .ఆయన రాచనల్లో ఖజురహో ప్రస్థావన కనిపిస్తుంది.

9. అందాల రాసి హేమావతి

9. అందాల రాసి హేమావతి

Image Source:

ఆయన రాసిన దాని ప్రకారం కాశీకి చెందిన గాహద్వారా రాజు ఇంద్ర జిత్ ఆస్థాన పురోహితుడి కూతురు హేమవతి.హేమావతి గొప్ప అంద గత్తే .ఇంద్రుడే ఆమె సౌందర్యానికి నీరైపోయాడు. అతన్ని పెళ్లి చేసుకొనంది. ఇంద్రుడి శాపం వలన విధవ రాలైంది .అప్పటికి ఆమె వయసు పదహారే .ఒక రాత్రి విరహ వేదన భరించలేక ‘రతి తాలిబ్ 'అనే సరస్సులో నగ్నం గా స్నానం చేస్తుంటే చంద్రుడు ఆమెను మోహించి ఆమెను చేరి సల్లాపాలాడాడు .

10. కన్యత్వం కోల్పోయింది.

10. కన్యత్వం కోల్పోయింది.

Image Source:

ఆమె కన్యత్వం కోల్పోయింది .ఈ పరాభవాన్ని దాచుకోవటానికి ఎంతో ప్రయత్నించింది .చంద్రుడు ఆమెనుకర్ణావతి నదీ తీరం లోని ఖజూర వాటిక లో తల దాచుకోమని సలహా ఇచ్చాడు .ఆమెకు పుట్టబోయే కుమారుడు అద్వితీయ బల సంపన్నుడై పదహారవ ఏట రాజు అవుతాడని రాజ్య విస్తరణ చేస్తాడని అనునయింఛి అదృశ్యమైనాడు చంద్రుడు. కొన్ని రోజుల తర్వాత ఆమె కాశీలోని తండ్రి ఇంటికి చేరుతుంది.

11. పరుస వేది

11. పరుస వేది

Image Source:

అక్కడే ఆమెకు పండంటి బిడ్డ పుట్టాడు. చంద్ర వర్మ అనే పేరు పెట్టింది. అతడు పెరిగి పెద్దవాడై బల పరాక్రమ సంపన్నుడైనాడు .పదహారో ఏట ఒక సింహాన్ని పులిని సునాయాసం గా పోరాడి చంపాడు .సంతోషించిన తల్లి హేమావతి చంద్రుని ప్రార్ధించింది .చంద్రుడు దిగి వచ్చి తన కొడుకైన చంద్ర వర్మకు ఒక ‘పరుస వేది' అనే వస్తువును నిచ్చాడు. అది దేన్నీ తాకితే అది బంగారం అవుతుంది.

12. తల్లికి కానుకగా

12. తల్లికి కానుకగా

Image Source:

క్రమంగా ధనమూ పెరిగి చంద్రవర్మ ‘మహోబా 'కు రాజై రాజ్య విస్తరణ చేశాడు. అటు పై చంద్ర వర్మ. వివాహం చేసుకొని రాణీ తో ఖజురాహో చేరి ‘భంద్య యజ్ఞం'చేసి తల్లి పై పడిన మచ్చను అవమానాన్ని తొలగించాడు . తల్లి కోరిన వన్నీ తీర్చాడు. విశ్వ కర్మ ను ఆహ్వానించి ఖజురహో లో 85దేవాలయాలను నిర్మించి తల్లి హేమావతికి కానుక గా సమర్పించాడు.

13. చంద్రుడి సూచన మేరకు...

13. చంద్రుడి సూచన మేరకు...

Image Source:

అందుకే ఇక్కడ ఏ దేవాలయం లో చూసినా ఆలయం ముందు సింహం తో పోరాడే బాలుడి శిల్పం కని పిస్తుంది . ఆ బాలుడే చంద్ర వర్మ. ఇక తల్లి కోరికతో ప్రజల్లో ప్రేమ భావాన్ని పెంచాలన్న ఉద్దేశంతో చంద్రుని సూచన మేరకు తల్లి ఆదేశానుసారం చంద్రవర్మ ఈ దేవాలయాల పై శృంగార ప్రధాన శిల్పాలను ఏర్పాటు చేశాడని చెబుతారు. దేవాలయ నిర్మాణంలో ప్రత్యేక సాంకేతికతను వినియగించారని ఇది ఇప్పటికీ రహస్యమని తెలుస్తోంది.

14. అందుకే ఆ సామర్థ్యం పెరుగుతుంది

14. అందుకే ఆ సామర్థ్యం పెరుగుతుంది

Image Source:

ఇక శృంగార పరమైన కోరికలను పెంచే చంద్రుడి వరం మేరకు... ఈ ఖజురహోను సందర్శించిన వారి సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని చాలా మంది నమ్ముతున్నారు. ఆలయాల నిర్మాణ విధానం, అందుకు వినియోగించిన పదార్థాల పై పున్నమి రోజుల్లో కాంతి పడి...ఆ కాంతి పరావర్తనం చెంది మానవ శరీరల పై పడటం వల్ల అటు పురుషుల్లో కాని ఇటు మహిళల్లో కాని శృంగార పరమైన కోరికలు సామర్థ్యం పెరుగుతుందనేది స్థానికుల కథనం

15. నిర్మాణ శైలి ఎక్కడా కనిపించదు...

15. నిర్మాణ శైలి ఎక్కడా కనిపించదు...

Image Source:

నిర్మాణ శైలి భూమి,పై శిఖరం లోను ,సూచీ అగ్రం గాను చుట్టూ విస్తరించి ఉండటం విశేషం. ఇటు వంటి నిర్మాణ శైలి మనకు ఎక్కడా కనిపించదు. చౌన్స్ నాద దేవాలయం తప్ప మిగిలిన ఖజురహో ఆలయాలన్నీ అత్యంత నాణ్యమైన శుద్ధి చేసిన ఇసుక రాయి తో నిర్మితమైనాయి .లేత పసుపు రంగు కొద్ది పాటి ఊదారంగు రాయి తూర్పు తాటాక తీరం లోని ‘పన్నా 'నుండి తెచ్చారు .పెద్ద రాళ్ళను క్వారీల వద్దనే శిల్పాలుగా మలిచి ఇక్కడికి రవాణా చేశారు.

16. మూడు రోజులైనా పడుతుంది

16. మూడు రోజులైనా పడుతుంది

Image Source:

వాటిని దేవాలయ ప్రాంతం లో ఒకదానితో ఒకటి అంటించి ఆలయాలన్నిటినీ నిర్మించారు .చౌశాత్ యోగిని దేవాలయాన్ని మాత్రం గ్రానైట్ రాయితో కట్టారు .స్థానికం గా దొరికే గ్రానైట్ ముతకగా ఉండటం తో పన్నా వెళ్లిఇసుక రాతిని తేవాల్సివచ్చింది. ఈ దేవాలయాలు అన్నీ అందంగా ఉంటాయి. ప్రస్తుతం దేవాలయాలను నిషితంగా పరిశీలించడానికి కనీసం మూడు రోజులైన పడుతుందని ఇక్కడి వారు చెబుతారు.

17. పంచాయతన దేవాలయాలు

17. పంచాయతన దేవాలయాలు

Image Source:

ముఖ్యంగా లక్ష్మణ ,కందరీయ ,విశ్వనాధ దేవాలయాలను ‘పంచాయతన దేవాలయాలు 'అంటారు .పంచాయతన దేవాలయం అంటే గర్భ గుడిలో ఆ దేవాలయానికి చెందినా పెద్దదేవతా విగ్రహంతో బాటు నాలుగు చిన్న విగ్రహాలు నాలుగు మూలలా ఉండటం . ఈ దేవాలయ నిర్మాణం అయిదు సోపానాల్లో ఉంటుంది .అర్ధమండపం ,మండపం అనే హాలు ,అంతరాలయం లేక గర్భాలయం ,మహా మండపం ,ప్రదక్షిణ సౌకర్యం కల దారి కలిగి ఉంటాయి .

18. దేనికదే భిన్నం

18. దేనికదే భిన్నం

Image Source:

ఇందులో ప్రతి దాని శైలి భిన్నం గా నేఉండి శిల్ప శోభగల పైకప్పు ఉంటుంది .ప్రతి ఆలయం సంపూర్ణ కళా విలాసమై ఒకే తరహాలో కని పిస్తుంది తప్ప దేనికది ప్రత్యేకం. ఈ దేవాలయాల్లో దాదాపు 872విగ్రహాలున్నాయని ,అందులో గోడలకు వెలుపల 646ఉన్నాయని చరిత్ర కారులు చెబుతున్నారు. ఇవన్నీ శృంగార పరమైన కోరికలను పెంచే విధంగా ఉండటమే కాకుండా నూతన విధానాలను ప్రజాలకు తెలియజెప్పేలా ఉంటాయి.

19. పున్నమి రోజు, శివరాత్రి

19. పున్నమి రోజు, శివరాత్రి

Image Source:

పున్నమి రోజులతో పాటు శివరాత్రి నాడు వేలాది భక్తులు వచ్చి దర్శించి తరిస్తారు .అప్పుడు గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు .ఖజురహో వచ్చిన వారు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘లైట్ అండ్ సౌండ్ 'ప్రోగ్రాం తప్పక చూసి అనుభూతి పొందాలి .ఇక్కడ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుతున్నారు. భారతీయ సర్వకళా ప్రదర్శన నిర్వహిస్తారు .ఖజురహో సంప్రదాయాన్ని ఇప్పటికీ గౌరవించి కొనసాగిస్తారు .

20. ప్రపంచానికంతటికీ ఆకర్షణీయమే

20. ప్రపంచానికంతటికీ ఆకర్షణీయమే

Image Source:

ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ మినార్లు జరుగుతాయి .స్థానికం గా తయారైన అనేక కళాత్మక వస్తువులను విశాలమైన ప్రాంతం లో ప్రదర్శించి అమ్ముతారు .ఈ ఉత్సవం భారత దేశానికే కాదు ప్రపంచమంతటికీ ఆకర్షణీయమే . అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడకు యాత్రికులు ఎక్కువ మంది వస్తుంటారు. వారికి తగ్గ అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తోంది.

21. ఏటా నృత్యోత్సవాలు

21. ఏటా నృత్యోత్సవాలు

Image Source:

ఖజురహో లోని శిలలపై చెక్కిన శిల్పాలు ప్రదర్శించే నృత్యభంగిమలు అన్నీ ఇన్నీకావు. అలా నాట్యాలాడే శిల్పాలను తలదన్నే రీతిలో ఖజురహో నృత్యోత్సవాలు ఏటా కన్నుల పండువగా జరుగుతాయి. భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారులకు ఈ ఉత్సవాలు ప్రధాన వేదికగా నిలుస్తాయి. ఇవి ఏటా మార్చిలో జరుగుతాయి. వారం రోజుల పాటు జరుగే ఈ ఉత్సవాలకు దేశవిదేశాల నుండి పర్యాటకులు విశేషంగా తరలివస్తారు.

22. దగ్గర్లో అనేక పర్యాటక ప్రాంతాలు

22. దగ్గర్లో అనేక పర్యాటక ప్రాంతాలు

Image Source:

ఖజురహో నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్నా నేషనల్‌ పార్క్‌ ఇక్క డ ముఖ్యమైన విహారకేంద్రం. ఖజురహో నుండి అరగంట ప్రయాణం. చిరుత పులి, పులి, చింకారా, తదితర వన్యమృగాలకు ఈ పార్క్‌ ఎంతో ప్రసిద్ధి. నేషనల్‌ పార్క్‌కు వెళ్లే దారిలో ఉన్న పాండవ జలపాతాలు పర్యాటకుల మదిని ఇట్టే ఆకట్టుకుంటాయి. ఖజురహోను చూసిన వారు ఈ పర్యాటక ప్రాంతాలను చూడటం మరిచి పోకండి.

23.అజయ్ గడ్ కోట

23.అజయ్ గడ్ కోట

Image Source:

ఇవే కాకుండా చుట్టుప్రక్కల వేణీసాగర్‌ డ్యాం, రాణె జలపాతాలు, రాంగ్వన్‌ సరస్సు, దూబెల మ్యూజియం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన పర్యా టక ప్రదేశాలు. అంతేకాకుండా ఇక్కడి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ య్‌గఢ్‌ కోట కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతంలో కొండపైనున్న అ తిపెద్ద కోట ఇది. మరో అత్యంత పురాతన కోట కలింజర్‌. ఇది ఖజు రహో నుండి ఉత్తరదిశగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

24. రవాణా ఇలా...

24. రవాణా ఇలా...

Image Source:

విమానసదుపాయం : ఖజురహో లో విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి సర్వీసులు నడుస్తాయి.

రోడ్డు మార్గం: సాత్నా, హర్పలూర్‌, ఝాన్సీ, మహోబా నుంచి ఖజురహోకు బస్సులు ఉన్నాయి.

రైలు మార్గం: ఖజురహో నుంచి 94 కిలోమీటర్ల దూరంలో హర్పలూర్‌, 61 కిలోమీటర్ల దూరంలో మహోబా నుంచి రైళ్లు ఉన్నాయి. ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చే యాత్రీకులకు ఝ్సానీ నుంచి రైలు సదుపాయాలు ఉన్నాయి. ముంబై, కోల్‌కతా, వారణాసిల నుంచి వచ్చే వారు ముంబై అలహాబాద్‌ మార్గం ద్వారా సాత్నా నుంచి ఉన్నాయి.

25. స్థానిక రవాణా మార్గాలు..

25. స్థానిక రవాణా మార్గాలు..

Image Source:

స్థానిక రవాణా మార్గాలు: ఖజురహోలోని దేవాలయాన్ని సందర్శించాలంటే స్థానికంగా ఉండే రవాణా మార్గాలపై ఆధారపడక తప్పదు. ఇక్కడ ప్రధా నంగా సైకిళ్లపై స్థానిక ప్రాంతాల్ని సందర్శించే పర్యాటకులు ఎక్కువ. కాబట్టి సైకిల్‌ రిక్షాలు, సైకిళ్లు అద్దెకు దొరకుతాయి. డీజిల్, పెట్రోలుతో పోలిస్తే ఈ పర్యవారణ హితకారిని అయిన ఈ వాహనాల పై వెళ్లడం మంచిది కాదంటారా చెప్పండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more