Search
  • Follow NativePlanet
Share
» »ఇండియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు (పార్ట్ I) !!

ఇండియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు (పార్ట్ I) !!

సహజ అందాలు, సాంస్కృతిక వైభవ ప్రదేశాలలో ఇండియా అద్వితీయం. ఇండియా లో విదేశీ పర్యటన నానాటికి దిన దినాభివృద్ధి చెందుతోంది. ఇంకుకు కారణం ఇండియా లో అనేక గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉండటమే. ఈ ప్రదేశాలను ఐక్యరాజ్య సమితి లోని ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ సంస్థ (యునెస్కో) గుర్తింపు నిచ్చింది.

కాజి రంగ వైల్డ్ లైఫ్ సాన్క్చువరి

కాజి రంగ వైల్డ్ లైఫ్ సాన్క్చువరి

కాజి రంగ వైల్డ్ లైఫ్ సాన్క్చువరి బారత దేశ ఈశాన్య రాష్ట్రమైన అస్సాం లో కలదు. దీనిని యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ గా 1985 లో ఈ ప్రదేశంలో కల సహజ వాతావరణం కారణంగా గుర్తింపు నిచ్చింది. ఒకే కొమ్ము కల దుప్పి లు ఇక్కడ మీరు అనేకం చూడవచ్చు. ఈ ప్రదేశం ఇండియాలోనే అత్యధిక సంఖ్యకల దుప్పుల ప్రదేశంగా గుర్తించబడింది. ఇక్కడ అనేక ఇతర జంతువులు, పక్షి జాతులు కూడా చూడవచ్చు.
Pic credit: Subharnab

 మానస్ వైల్డ్ లైఫ్ సాన్క్చ్లువరి, అస్సాం

మానస్ వైల్డ్ లైఫ్ సాన్క్చ్లువరి, అస్సాం

మానస్ వైల్డ్ లైఫ్ సాన్క్చువరి అస్సాం లో కలదు. హిమాలయాల దిగువన కల మైదాన భూమిలో వుంది మానస నది పరివాహక ప్రాంతంలో భూటాన్ దేశ సరిహద్దు లో కలదు. ఈ సాన్క్చువరి లో అనేక రకాల మొక్కలు, జంతువులు కలవు. వాటిలో పులి, పిగ్మీ హాగ్, చిరుత, స్లాత్ బేర్, ఇండియన్ రీనో, వైల్డ్ బఫ్ఫెలో, ఇండియన్ ఎలెఫంత్స్, గోల్డెన్ లంగూర్ మరియు బెంగాల్ ఫ్లోరికాన్ వంటివి కలవు. ఇది ఒక టైగర్ రిజర్వు కాగా, 1985 లో దీనికి యునెస్కో గుర్తింపు లభించినది.

 మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ , బుద్ధ గయా

మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ , బుద్ధ గయా

క్రీ పూ. ౩ వ శతాబ్దంలో మహాబోధి టెంపుల్ ను గయలో అశోక చక్రవర్తి నిర్మించాడు. అయితే ఇపుడు కనపడే ఈ టెంపుల్ మాత్రం క్రీ.శ 5 - 6 శతాబ్దాల నాటిది. ఈ ప్రదేశంలో గౌతమ బుద్ధుడు దివ్యత్వం పొంది నట్లు చెపుతారు. ఇక్కడ నుండి బౌద్ధమత వ్యాప్తి మొదలయింది. ప్రధాన దేవాలయం ప్రపంచ దేవాలయాలన్నిటి లోకి అతి పురాతన మైనదిగా చెప్పబడుతుంది.

తాజ్ మహల్

తాజ్ మహల్

మొగల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ పై గల ప్రేమకు చిహ్నంగా నిర్మించిన తాజ్ మహల్ ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ కళా ఖండం నిర్మించేందుకు సుమారు 16 సంవత్సరాల కాలం పట్టింది. దీనిని 1983 లో యునెస్కో సైట్ గా ప్రకటీంచారు.
Pic credit: Christian Haugen

 హుమాయూన్ సమాధి

హుమాయూన్ సమాధి

హుమాయూన్ సమాధిని క్రీ. శ. 1570 సంవత్సరం లో ఢిల్లీ లో నిర్మించారు. ఈ స్మారక చిహ్నానికి యునెస్కో గుర్తింపు 1993 లో లభించినది. ఈ స్మారక ప్రదేశంలో మొగలాయీ కుటుంబానికి చెందిన ఇతర సభ్యుల సమాధులు 150 వరకూ కూడా కలవు.

Pic credit: Arian Zwegers

 గోవా లోని చర్చి లు, మరియు కాన్వెంట్ లు

గోవా లోని చర్చి లు, మరియు కాన్వెంట్ లు

క్రీ. శ. 16 మరియు 18 శతాబ్దాల మధ్య పోర్చుగీస్ పాలకులచే నిర్మించబడిన గోవా లోని అనేక చర్చిలకు, కాన్వెంట్ లకు 1986 లో యునెస్కో గుర్తింపు లభించింది. ఈ స్మారకాలు వేల్హా గోవా యొక్క పూర్వపు రాజధానిలో కలవు. ఈ స్మారకాలలో సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ అస్థికలు కల బాసిలికా అఫ్ బం జీసస్ ప్రధానమైనది.

Pic credit: Wiki Commons

 రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్

రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్

రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ ను లాల్ కిలా అని కూడా అంటారు. దీనిని షాజహాన్ చక్రవర్తి 17 వ శతాబ్దంలో తన కొత్త రాజధాని శాహజహానాబాద్ లో భాగంగా నిర్మించాడు. దీని నిర్మాణంలో అద్భుతమైన మొగల శిల్ప శైలి కనపడుతుంది. ఇది యునెస్కో గుర్తింపు కల ప్రదేశం.

Pic credit: Wiki Commons

కుతుబ్ మినార్ మరియు చుట్టుపట్ల స్మారకాలు, ఢిల్లీ

కుతుబ్ మినార్ మరియు చుట్టుపట్ల స్మారకాలు, ఢిల్లీ

ఎరుపు ఇసుక రాయితో నిర్మించబడిన ఈ కుతుబ్ మినార్ టవర్ మరియు దాని చుట్టుపట్లకల స్మారకాలను 13 వ శతాబ్దంలో నిర్మించారు. ఇస్లాం మత శిల్ప, కళల ఉన్నతికి గుర్తింపుగా యునెస్కో సంస్థ దీనిని వరల్డ్ హెరిటేజ్ ప్రదేశంగా గుర్తించినది.

Pic credit: Dimitry B

చంపానేర్ - పవగడ్ అర్కేలాజికల్ పార్క్

చంపానేర్ - పవగడ్ అర్కేలాజికల్ పార్క్

చంపానేర్ అర్కేలాజికల్ పార్క్ గుజరాత్ లోని పంచమహల్ జిల్లా లో కలదు. ఈ సైట్ చాలావరకు తవ్వబడని పురావస్తు, చారిత్రక, మరియు ప్రస్తుత కల్చరల్ హెరిటేజ్ ఆస్తిగా కలదు. ఈ ప్రదేశం లో ఒక కోట కూడా కలదు. ఇది 8 - 14 శతాబ్దాల మధ్య కల చారిత్రక తవ్వ కాలను చూపుతుంది. ఈ ప్రదేశం ఒకప్పుడు గుజరాత్ రాష్ట్ర కేపిటల్ గా వుండేది.

Pic Credit: Wiki Commons

 హంపి, కర్ణాటక

హంపి, కర్ణాటక

కర్నాటక రాష్ట్రంలోని హంపిలో ఒకప్పటి ప్రాధాన్యత కల విజయనగర సామ్రాజ్య కాలం నాటి అవశేషాలు కలవు. ఈ ప్రదేశం విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది.
Pic credit: Arian Zwegers

 పట్టదక్కాల్ స్మారక చిహ్నాల సమూహం

పట్టదక్కాల్ స్మారక చిహ్నాల సమూహం

కర్నాటక లోని ఉత్తర భాగంలో కల పట్టదక్కాల్ లో అతి ప్రధానమైన తొమ్మిది హిందూ టెంపుల్స్ మరియు ఒక జైన్ సాన్క్చువరి కలవు.
ఈ దేవాలయ సముదాయాలలో కల విరూపాక్ష టెంపుల్ క్రీ.శ. 740 లో రాణి, లోక మహాదేవి తన భర్త రెండవ విక్రమాదిత్య దక్షిణాదిన కల పల్లవ రాజులపై సాధించిన విజయానికి చిహ్నంగా నిర్మించింది. ఇది ఒక అద్భుత కళా ఖండంగా వుంది. (ఈ విరూపాక్ష టెంపుల్, హంపి లోని విరూపాక్ష టెంపుల్ కాదని గుర్తించాలి). ఈ నిర్మాణాలకు యునెస్కో గుర్తింపు కలదు. Pic credit: Wiki Commons

సాంచి లోని బౌద్ధ ఆరామాలు, మధ్య ప్రదేశ్

సాంచి లోని బౌద్ధ ఆరామాలు, మధ్య ప్రదేశ్

మధ్య ప్రదేశ్ లోని సాంచి లో క ల బౌద్ధ స్మారకాలు సుమారు క్రీ.పూ 200 నుండి క్రీ.పూ.100 సంవత్సరాల కాలం నాటివి. వీటిని 1818 సంవత్సరంలో కనిపెట్టారు. వీటికి 1989 సంవత్సరంలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించింది. ఈ సాన్క్చువరి లో ఏక శిలా స్తంభాలు, పాలస్ లు, టెంపుల్స్, బౌద్ధ ఆరామాలు వివిధ రకాల సంరక్షణా స్థితి లో కలవు.

భింబెట్కా లోని రాతి నివాసాలు.

భింబెట్కా లోని రాతి నివాసాలు.

మధ్య ప్రదేశ్ లోని వింధ్య పర్వత శ్రేణుల దిగువ భాగంలో కల భింబెట్కా లో వెల్లడైన రాతి నివాసాలలో కల అద్భుత పెయింటింగ్ లు, రాతి నివాసాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందాయి. ఇక్కడ అయిదు రాక్ నివాసాలు కలవు. వీటిలో వివిధ యుగాలనాటి పెయింటింగ్ లను చూడవచ్చు.

Pic credit: Wiki Commons

ఖజురాహో టెంపుల్స్

ఖజురాహో టెంపుల్స్

మధ్య ప్రదేశ్ లోని ఖజురాహో టెంపుల్స్ మొత్తంగా 85 ఉండేవి. అయితే ఇపుడు 22 మాత్రమే మంచి స్థితి లో కలవు. ఈ టెంపుల్స్ హిందూ, జైన సంస్కృతుల శిల్ప తీరు కలిగి వున్నాయి. వీటిని చండేలా వంశ రాజులు నిర్మించగా, తర్వాత వచ్చిన ప్రతీహార్లు అభివృద్ధి చేసారు. వీటికి యునెస్కో గుర్తింపు కలదు.

Pic credit: dalbera

 అజంతా గుహలు

అజంతా గుహలు

మహారాష్ట్ర లోని తవ్వకాలలో బయటపడిన అజంతా బౌద్ధ గుహలు సుమారు క్రీ. పూ. 2 వ శతాబ్దం నుండి క్రీ. శ. 6 వ శతాబ్దం నాటివి గా కూడా తవ్వకాలలో వెల్లడైంది. ఇవి మొత్తంగా 31 రాతి గుహలు. అద్భుత శిల్ప కళ కల కుడ్య చిత్రాలు కలిగి వున్నాయి. వీటిలో ఒకప్పుడు బౌద్ధ సన్యాసులు వుండేవారు. వీటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సంస్థ గుర్తింపు కలదు.
Pic credit: kawanet

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X