» »తిరుమల చుట్టుప్రక్కల చూడవలసిన ప్రసిద్ధ క్షేత్రాలు మీకు తెలుసా?

తిరుమల చుట్టుప్రక్కల చూడవలసిన ప్రసిద్ధ క్షేత్రాలు మీకు తెలుసా?

Posted By: Venkata Karunasri Nalluru

తిరుమల చుట్టుప్రక్కల చూడవలసిన ప్రసిద్ధ క్షేత్రాలు ఏమున్నాయ్?వాటిని చేరుకోవడం ఎలా?కొండపైన తిరుమల అంటాం.కొండ కింద తిరుపతి అంటాం.కొండపై నుంచి కొండకిందికొచ్చి చూడవలసిన టెంపుల్స్ ఏమున్నాయ్?అవుట్ సైడ్ అంటే సుమారు 1 గంట,3 గంటలు ప్రయాణిస్తే ఏవే క్షేత్రాలు మనం దర్శించవచ్చును.

వాటిలో ముఖ్యమైనవి ఏమున్నాయ్?ఎందుకంటే మన వాళ్ళు సంవత్సరమో లేదా రెండు సంవత్సరాలకొకసారి తిరుమల వెళ్లి దర్శనం చేసుకునివస్తూవుంటాం.కొండపైన దర్శనం అయిపోయిన తర్వాత కొండ కిందకు చేరుకున్నాం.ముందుగా కింద ఏం చూడాలో మనం చూద్దాం. బస్టాండ్ లోనే కాస్త బయటకొస్తే లోకల్ బస్సులు తిరుగుతూ వుంటాయి.

కొండపై నుంచి కొండకిందికొచ్చి చూడవలసిన టెంపుల్స్

1.అలిమేలుమంగాపురం

1.అలిమేలుమంగాపురం

అలిమేలుమంగాపురం అన్నా తిరుచానూరు పద్మావతి అమ్మవారన్నా రెండూ ఒకటే . అలిమేలుమంగాపురానికి మరియు గోవిందరాజుల స్వామి గుడికి లోకల్ సిటీ బస్సు తిరుగుతూ వుంటుంది.10రు టికెట్టు వుంటుంది.ఈ రెండూ చూసిరావచ్చును.రెండూ దగ్గరే.అలిమేలుమంగాపురం బస్టాండ్ కి 3కిమీల దూరం వుంటుంది.గోవిందరాజుల స్వామి గుడి రైల్వేస్టేషన్ నుంచి 1 కి.మీ కన్నా ఇంకా తక్కువే వుంటుంది.

pc:Malyadri

2. కపిలతీర్థం

2. కపిలతీర్థం

మరో క్షేత్రం మీరు చూడవససినది కపిలతీర్థం.కపిలతీర్థం వర్షాకాలంలో చాలా బాగా కన్పిస్తుంది.ఈ క్షేత్రం ఎక్కడుందంటే రైల్వేస్టేషన్ కి అవతలవుంటుందన్న మాట.తిరుచానూరుకి రైట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ కపిలతీర్థం కనిపిస్తుంది.ఆటోలో 10 రుఇస్తే తీసుకునివెళ్తారు.

pc:Adityamadhav83

3. శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం

3. శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం కాస్త దూరంగా వుండేదేమిటంటే శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం.దీనినే మనం శ్రీనివాస మంగాపురం అని పిలుస్తాం.ఈ శ్రీనివాస మంగాపురం చేరాలంటే మీకు కపిలతీర్థం నుంచి డైరెక్ట్ గా బస్సులుంటాయి.లేదా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కూడా బస్సులుంటాయి.

pc:Bhaskaranaidu

4.కాణిపాకం

4.కాణిపాకం

సుమారు గంటన్నరలో మీరు కాణిపాకం వెళ్లి రావచ్చును.వరసిద్ధి వినాయకస్వామి ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు స్వయంభు.కాణిపాకం నుంచి 15కి.మీ ల దూరంలో అర్ధగిరి వుంది.

pc:Adityamadhav83

5. అర్ధగిరి

5. అర్ధగిరి

ఈ అర్ధగిరి ఆంజనేయస్వామి టెంపుల్ వుంది ఇక్కడ.రామాయణ కాలంలో ఆంజనేయస్వామి సంజీవపర్వతం తీసుకొస్తున్న టైంలో కొంచెం కొండ పై నుంచి కింద పడుతుందన్నమాట. ఆ పడిన కొంచెం కొండనే ఇప్పుడు అర్ధగిరి అంటాం. వనమూలికలతో కూడిన తీర్థం స్వీకరించాలి ఇక్కడ.బాటిల్ తో తీర్థం తీసుకుని వెళ్ళొచ్చు.

pc:Bhanutpt

6.శ్రీపురం గోల్డెన్ టెంపుల్

6.శ్రీపురం గోల్డెన్ టెంపుల్

చిన్న జీపుల ద్వారా వెళ్ళొచ్చు.లేదా కొండపైనుంచి శ్రీపురానికి డైరెక్ట్ బస్సులుంటాయి.

pc:Ag1707

7.శ్రీకాళహస్తి

7.శ్రీకాళహస్తి

కాణిపాకం తిరపతికి లెఫ్ట్ సైడ్ వుంటుంది.కాళహస్తి రైట్ సైడ్ వుంటుంది.శ్రీకాళహస్తి టెంపుల్ కి ఫ్రీ బస్సులు కూడా వుంటాయి.దర్శనం చేసుకుని బయట రోడ్డు మీదికొస్తే తిరపతి బస్సులుంటాయి.

pc:wikimedia.org