Search
  • Follow NativePlanet
Share
» »హిమాచల్ ప్రదేశ్ లో పది టాప్ ఆనందాలు!

హిమాచల్ ప్రదేశ్ లో పది టాప్ ఆనందాలు!

ఇండియా లో శెలవుల రాజధాని గా పిలువబడే హిమాచల్ ప్రదేశ్ లో వింటర్ లో అధిక పర్యాటకులు వస్తారు. అధికమైన బ్రిటిష్ సంస్కృతి, మంచు తో కప్పబడిన పర్వతాలు, అందమైన నదులు, విశ్రాంతి పొందే యాక్ జంతువులు, అన్నిటికి మించి సంతోషకరమైన ప్రజలు తో హిమాచల్ ప్రదేశ్ ఒక మంచి విశ్రాంతి ప్రదేశం. పవిత్రమైన ధర్మశాల, సాహస క్రీడల షిమ్లా , రొమాన్స్ ప్రదేశం మనాలి పురాతన వైభవాల స్పితి, కాంగ్రా కవిత్వం వంటివి ఇక్కడ ఎన్నో కలవు. మీరు హిమాచల్ లో ఒక వంద ఆనందాలైనా సరే పొందవచ్చు. అయినప్పటికీ మేము ప్రధానమైన ఒక పది ఆనందించ దాగిన అంశాలు ఇస్తున్నాం. పరిశీలించండి.

హిమాచల్ ప్రదేశ్ లో పది టాప్ ఆనందాలు!
హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

ఒక పక్షి లా అయిపోండి. స్వేచ్చగా పారా గ్లైడింగ్ క్రీడను ఆడండి. బీర్, బిల్లింగ్ ప్రదేశాలు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తాయి. కాంగ్రా లో కల పారా గ్లైడింగ్ సైట్ ప్రతి సంవత్సరం అక్టోబర్ , నవంబర్ నెలలలో దీనికి సిద్ధపడుతుంది. మబ్బుల్లో దూసుకుపోవటం నీలాకాశంలో పక్షిలా విహరించటం, పచ్చటి ప్రదేశాలను ఆస్వాదిన్చాతమే పారా గ్లైడింగ్.

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

మరోసారి అటవీ తెగల సంస్కృతి ఆనందించండి. ఇండియా టిబెట్ రూట్ లో కల పురాతన కిన్నెర దేశ అందాలు చూడండి. ఇటివలి వరకూ ఇక్కడ ప్రవేశం నిషేదించారు. ఇపుడు ప్రభుత్వం కిన్నెరా మహోత్సవాలను నిర్వహిస్తూ ఈ ప్రదేశ పర్యటనకు అనుమతులు ఇస్తోంది. కిన్నెరా మహోత్సవం అక్టోబర్, నవంబర్ లలో జరుగుతుంది. ఈ ప్రదేశ అటవీ, కొండ తెగల ప్రజలు వారి వారి ప్రతిభలు ఈ మహోత్సవంలో ప్రదర్శిస్తారు.

 హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

హిమాచల్ రివర్ రాఫ్టింగ్ కు పేరు గాంచింది. ఇక్కడ తెల్లని నీటి రాఫ్టింగ్. ఈ క్రీడ సట్లేజ్ నది వద్ద కల షిమ్లా బియాస్ వద్ద కల కుళ్ళు, చంబా వద్ద కల రావి , లాహౌల్ వద్డకల చంద్రా నదులలో లో బాగుంటుంది. వాతావరణం కారణంగా, వేసవి, వింటర్ లలో దీనిని నిషేధిస్తారు.

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

ఈ వేసవి రాజధాని షిమ్లా లో ఒకప్పటి బ్రిటిష్ రాజ్ రాజధాని లో ఇప్పటికి అనేక వాహన రహిత రోడ్లను నడిచే వారి కొరకు నిర్వహిస్తున్నారు. నడక సాగించి సిమ్లా లోని అరుదైన ప్రదేశాల అందాలను చూసి ఆనందించండి. మీ పాదాలకు భూమి స్పర్శ తగిలించండి.
5. హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

నవంబర్ నెల వస్తే చాలు , సిమ్లా నుండి 130 కి. మీ. ల దూరంలో కల రాంపూర్ లో అంతర్జాతీయ లావి ఫెయిర్ జరుగుతుంది. ఇది ఒక అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్ దీనిలో డ్రై ఫ్రూట్స్ , హంది క్రాఫ్ట్స్ , హ్యాండ్ లూమ్స్ వంటివి లార్జ్ స్కేల్ లో అమ్ముతారు. ఈ స్థానిక రుచులను పర్యాటకులు పొందవచ్చు.

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

కలకా నుండి సిమ్లా వరకు గల పర్వత రైలు మార్గం లో ప్రయానించండి. ఈ ట్రైన్ మొత్తంగా 109 సొరంగాల లో నుండి ప్రయాణిస్తుంది. అన్నిటి కంటే అందమైన సొరంగం బారోగ్ సొరంగం.
.

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

పర్యావరణ స్నేహం. వేసవి, చలికాలు ఇక్కడ సాహస ప్రియులకు చక్కటి మౌంటెన్ బైకింగ్ అవకాశాలను ఇస్తుంది. ఉనా మరియు బిలాస్ పూర్ లు చక్కటి బైకింగ్ ప్రదేశాలు. పర్యావరణ స్నేహిత ఈ బైక్ లతో విదేశీయులు ఇక్కడ తిరిగి ఆనందిస్తారు.

 హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

పర్వతారోహణ పిల్లల ఆట కాదు. ఇది గొప్ప సవాలు తో కూడుకోనినది. ఒంటరగా వేల్లవలిసి వస్తుంది. ఈ పర్వతారోహణ కు హిమాచల్ ప్రదేశ ప్రభుత్వం కోర్సులను నిర్వహిస్తోంది. ఇవి మూడు స్థాయి లలో వుంటాయి. ఈ పర్వతారోహణ క్రీడలకు మనాలి ప్రదేశం పుట్టినిల్లు.

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

హిమాచల్ ప్రదేశ్ లో సాహసాలకు కొదువ లేదు. ఈ ప్రాంతం లోని సిమ్లా - కుళ్ళు వాలీ ల మధ్యగల మార్గాలు ట్రెక్కింగ్ ఆహ్లాదం ఇస్తాయి. ఉత్సాహం కల ప్రపంచ వ్యాప్త ట్రెక్కింగ్ ప్రియులు ఇక్కడి ప్రదేశాలలో ట్రెక్కింగ్ చేసి ఆనందిస్తారు.

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

హిమాచల్ ప్రదేశ్ లో పది ఆనందాలు

కాంగ్రా లో బ్రిటిష్ వారి స్టైల్ లో మంచి టీ తాగండి. ఇక్కడి పాలంపూర్, బిజీ నాథ్ లలో అందమైన టీ ఎస్టేట్ లు కలవు. కాంగ్రా టీ దాని సువాసనలకు , రంగుకు, రుచికి పేరు గాంచింది. ఈ టీ విందును మీ ఫ్రెండ్స్ లేదా బంధువులకు విందుగా ఇవ్వండి. లోకం మరచి టీ తాగండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X