Search
  • Follow NativePlanet
Share
» »కొలకత్తాలోని ఈ సుందర ప్రదేశాలను సందర్శించారా?

కొలకత్తాలోని ఈ సుందర ప్రదేశాలను సందర్శించారా?

కొలకత్తాలో చూడదగిన ప్రాంతాలకు సంబంధించిన కథనం.

కొలకొత్తా రాజకీయంగా, చారిత్రాత్మకంగా ఎంతో పేరుగాంచిన నగరం. భారత దేశాన్ని కొన్ని వందల ఏళ్ల పాటు తమ గుపెట్లో పెట్టుకొన్న బ్రిటీష్ వారు ఒక రకంగా ఈ నగరం నుంచే తమ పరిపాలనసాగించేవారు. ఇందుకు అవసరమైన ఎన్నో భవంతులను నిర్మింపజేసుకొన్నారు. అయితే భారత దేశానికి గణతంత్ర హోదా ఇచ్చి తమ దేశానికి వెళ్లి పోయే సమయంలో ఆ భవంతులను అలాగే వదిలి వెళ్లిపోయారు. వందల ఎకరాల విస్తీర్ణంలో పూర్తిగా గ్రానైట్ నిర్మితమైన ఈ భవనాలు ప్రస్తుతం పర్యాటక కేంద్రాలుగా మారిపోయాయి. అదే విధంగా గంగానదితో పాటు మరొకొన్ని నదులు ఈ నగరం గుండా ప్రవహిస్తూ ప్రకృతి రమణీయతను ఇముడింపజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటువంటి భవనాలతో పాటు అక్కడ ఉన్న మరికొన్ని పర్యాటక కేంద్రాల క్లుప్త సమాచారం మీ కోసం...

విక్టోరియా మెమోరియల్

విక్టోరియా మెమోరియల్

P.C: You Tube

క్వీన్ విక్టోరియా సంస్మరణార్థం ఈ విక్టోరియా మెమోరియల్ భవనాన్ని నిర్మించారు. పూర్తిగా తెల్లటి మార్బుల్ తో నిర్మితమైన ఈ భవనం విస్తీర్ణం 57 ఎకరాలు. ఇందులో దాదాపు 20 వేల వరకూ వివిధ రకాల పెయింటింగ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఉద్యానవనాల్లో వివిధ ఆకారాల్లోని చెట్లు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

సందర్శనా సమయం....ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ

మార్బుల్ ప్యాలెస్

మార్బుల్ ప్యాలెస్

P.C: You Tube

అత్యంత పురాతన మార్బుల్ ప్యాలెస్ కలకత్తాలో చూడదగిన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. అప్పట్లో బ్రిటీష్ రాచ కుటుంబ సభ్యలు ఇక్కడే నివశించేవారు. ఇక్కడ నిలువెత్తని గ్రానైట్ విగ్రహాలు, అందమైన గాజుపాత్రలు, అంతేకాకుండా అత్యంత అరుదైన పెయింటింగ్స్ ను మనం ఇక్కడ చూడవచ్చు. కొలకత్తా లో చూడవలసిన పర్యాటక కేంద్రాల్లో ఇది తప్పక ఉంటుంది.

సందర్శన సమయం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ

హౌరా బ్రిడ్జ్

హౌరా బ్రిడ్జ్

P.C: You Tube

కొలకత్తా నగర పర్యాటన హౌరా బ్రిడ్జ్ చూడకుండా ముగియదు. కొలకత్తా, హౌరా నగరాలను కలుపుతూ హుగ్లీ నది పై దీనిని నిర్మించారు. ఈ బ్రిడ్జికి అత్యంత పురాతనమైనదే అయినా చాలా రద్దీగా ఉండే బ్రిడ్జిగా దీనికి పేరు. రోజు మొత్తం ఈ బ్రిడ్జి పై రాకపోకలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ బ్రిడ్జి పై నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలు చాలా అందంగా కనిపిస్తాయి.

సందర్శన సమయం రోజులో 24 గంటలూ సందర్శించడానికి అవకాశం ఉంటుంది.

సుందర్ బన్స్

సుందర్ బన్స్

P.C: You Tube

ప్రక`తి అందాలంటే ఇష్టపడే వారు కొలకత్త టూర్ లో తప్పకుండా సుందర్ బన్స్ ను తప్పక చూస్తారు. యునెస్కో వారి పరిరక్షించబడే జాబితాలో సుందర్ బన్స్ చోటు సంపాదించుకొన్నాయి. ప్రపంచంలో అత్యంత విస్తీర్ణంలో ఏర్పడిన డెల్టా ప్రాంతమే సుందర్ బన్స్. గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా నదుల కలయిక చోట సుందర్ బన్స్ ఉన్నాయి. ఇది రాయల్ బెంగాల్ టైగర్స్ అభయారణ్యం కూడా. ఇక్కడ కేవలం పులులే కాకుండా వివిధ రకాల జంతువులను చూడవచ్చు.

సందర్శనా సమయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ

బొటానికల్ గార్డెన్

బొటానికల్ గార్డెన్

P.C: You Tube

కొలకత్తాకు అనుకొని గంగా నదీతీరం వెంబడి పశ్చిమ భాగంలో ఉన్న బొటానికల్ గార్డెన్ విస్తీర్ణం దాదాపు 273 ఎకరాలు. ఇక్కడ దాదాపు 12 వేల వివిధ జాతులకు చెందిన చెట్లు వివిధ ఆకారాల్లో మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వీకెండ్ లో నే కాకుండా ఉదయం, సాయంత్రం పూట కూడా ఈ కొలకత్తా బొటానికల్ గార్డెన్ ను చూడటానికి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

సందర్శనా సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X