• Follow NativePlanet
Share
» »సౌత్ ఇండియాలో 2018 ప్రసిద్ధ న్యూ ఇయర్ ప్రదేశాలు !

సౌత్ ఇండియాలో 2018 ప్రసిద్ధ న్యూ ఇయర్ ప్రదేశాలు !

Written By:

కొత్త సంవత్సరం వచ్చిందంటే మనలో ఎవరం లేజీ గా కూర్చోనము. క్రిస్టమస్ పండుగ ముగియటం ఆలస్యం, కొత్త సంవత్సర వేడుకలు మొదలవుతాయి. వివిధ ప్రదేశాలకు వెళ్ళడం, పూర్తిగా ఆనందించటం చేస్తారు. నూతన సంవత్సరానికి ఆయా ప్రదేశాలలో స్వాగతం చెపుతారు. ఒక స్టూడెంట్, లేదా ఒక ప్రొఫెషనల్, లేదా ఒక హోం మేకర్ లేదా ఏ పనీ లేకుండా తిరిగే వారైనా సరే, ఈ న్యూ ఇయర్ వేడుకలను ఒక వినూత్న రీతిలో చేసుకోవాలని ఆశిస్తారు. మరి ప్రదేశ ఎంపిక మీకు గల ట్రావెల్ ఇంట్రెస్ట్ ల పై ఆధారపడి వుంటుంది. మీలో కొంతమంది అడ్వెంచర్ ఇష్టపడగా, మరి కొందరు ఎక్కడకు వెళ్ళినా సరే, కాటేజ్ నుండి బయటకు రాకనే ప్రకృతి అందాలు ఆనందిస్తారు. మరి ఈ న్యూ ఇయర్ సందర్భంగా మన సౌత్ ఇండియా లో కల కొన్ని టాప్ పర్యాటక ప్రదేశాలు సూచిస్తున్నాం పరిశీలించండి.

గోవా బీచ్ విహారం

గోవా బీచ్ విహారం

మీరు కనుక పరిశుభ్రమైన బీచ్ విహారాలు ఇష్టపడే వారైతే, అక్కడి అలల సాహసాలను ఆనందించే వారైతే, ఈ న్యూ ఇయర్ కు గోవా బీచ్ లలో విహరించండి. ఇక్కడ పలోలిం, బాగా, కాలాన్ గూటే వంటి అందమైన ప్రసిద్ధ బీచ్ లే కాక, ఇప్పటి వరకూ మీరు చూడని బీచ్ లు కూడా కలవు. ఈ బీచ్ లలో అనేక సాహస క్రీడలు కూడా ఆచరించవచ్చు.

Photo Courtesy: Shahnawaz Sid

మధురానుభూతుల ఊటీ

మధురానుభూతుల ఊటీ

ఒకసారి ఊటీ చూసిన వారు ఎవరైనా సరే, అక్కడ కల ప్రకృతి దృశ్యాలు ఎప్పటికి మదిలో గుర్తుచేసుకుంటూనే వుంటారు. అది ఊటీ యొక్క గొప్పతనం. డిసెంబర్ మరియు జనవరి నెలలలో ఈ ప్రదేశం అంతటా పూర్తి చలి. కనిష్ట్ర ఉష్ణోగ్రత 5 డిగ్రీలు గా వుంటుంది. ఊటీ పర్యటనకు అక్కడ పడే పొగమంచు, ప్రకృతి అందాల ఆస్వాదనకు ఇది సరైన సమయం.

వావ్ అద్భుతం అనిపించే రామేశ్వరం

వావ్ అద్భుతం అనిపించే రామేశ్వరం

మనలో అందరం అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇష్టపడం. మనలో కొంతమంది శిల్ప కళలు, వారసత్వ ప్రదేశాలు కూడా అన్వేషించాలని ఆసక్తి కలిగి వుంటారు. ఆ ప్రదేశాల చరిత్ర తెలుసుకోవాలని భావిస్తారు. మీరు కనుక ఈ కేటగిరీ కి చెందిన వారైతే , తమిళ్ నాడు లోని రామేశ్వరం మీకు అనేక అందమైన టెంపుల్స్, ప్రకృతి దృశ్యాలు కూడా చూపుతుంది.

Photo Courtesy: Wishvam

కన్యాకుమారి సందర్శన

కన్యాకుమారి సందర్శన

ప్రకృతి దృశ్యాల సమారోహం. మీరు ఇంతవరకూ సన్ రైస్ మరియు సన్ సెట్ లు వివిధ రంగులలో చూసారా ? ఈ రంగులన్నీ కొద్ది నిమిషాలలో మాయం అయిపోతాయి. మరి కన్యాకుమారిలో మీరు ఈ రకమైన సూర్యోదయ, సూర్యాస్తమయాలను చూసి ఆనందించవచ్చు. ఈ అద్భుతం నిమిషాలలో మాయం అయిపోతుంది. ఈ ప్రకృతి దృశ్యాలే కాక, ఇక్కడ మీరు చూసేందుకు అనేక ఆకర్షణలు కూడా కలవు.
Photo Courtesy: Saad Faruque

మదుర మీనాక్షి దేవాలయ సందర్శన

మదుర మీనాక్షి దేవాలయ సందర్శన

మదుర మీనాక్షి టెంపుల్ తమిళ్ నాడులో కలదు. అద్భుత శిల్ప కళ ల కు, ఎన్నో మహిమలకు ప్రసిద్ధి గాంచి, ఎంతో పురాతన చరిత్ర కలిగి వుంది. ఒక కొత్త సంవత్సరం మొదటి రోజు మదురై లో గడిపేయటం అక్కడి టెంపుల్ వైభవాన్ని ఆనందించటం తప్పక సూచించ దగినది.

Photo Courtesy: Immanuel DYAN

బెంగుళూరు డ్రీం సిటీ

బెంగుళూరు డ్రీం సిటీ

సౌత్ ఇండియా లో ఈ నగరం ఒక డ్రీం సిటీ. ఈ డ్రీం సిటీ అందాలను చూసేందుకు, ఇక్కడి వాతావరణం అనుభ విన్చేందుకు టూరిస్ట్ లు ఈ న్యూ ఇయర్ సమయంలో అధిక సంఖ్యలో వస్తారు. బెంగుళూరు లో కల ఆకర్షణలు, దేశీయ పర్యాట కులనే కాక విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షిస్తాయి. బెంగుళూరు వాసులు సైతం ఇక్కడ జరిగే న్యూ ఇయర్ వేడుకలను ఎంతో గొప్పగా భావిస్తారు.

పాండిచేరి

పాండిచేరి

పాండిచేరి లో అద్భుత బీచ్ లు కలవు. ఈ బీచ్ లు సందర్శించండి. మీలోని కొత్త వుత్సాహాలను వెలికి తీయండి. పాండిచేరి లో బీచ్ లే కాక, ఆరోవిల్లె వంటి ప్రశాంత మందిరాలు, ఇతర ఆకర్షణలు కూడా కలవు.

మున్నార్

మున్నార్

మున్నార్ రొమాన్స్ కు సరైన ప్రదేశం. సౌత్ ఇండియా లోని ఉత్తమ రొమాన్స్ ప్రదేశాలలో ఒకటిగా మున్నార్ ను తప్పక చెప్పి తీరాలి. కేరళ లో ఇది ఒక బెస్ట్ పర్యాటక ఆకర్షణ. అక్కడ కల తేయాకు తోటలు, పచ్చటి కొండలు, మున్నార్ ను ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా చేసాయి. మీ కొత్త సంవత్సర మొదలుకు ఇది ఒక మంచి ప్రదేశం. Photo Courtesy: Manu M G

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి