Search
  • Follow NativePlanet
Share
» »భారత దేశంలో ప్రసిద్ధ రైలు వంతెనలు !!

భారత దేశంలో ప్రసిద్ధ రైలు వంతెనలు !!

By Mohammad

వంతెన (బ్రిడ్జ్) వివిధ అవసరాల కోసం మనిషి నిర్మించిన కట్టడం. వంతెనను సంస్కృతం లో 'సేతువు' అంటారు. వంతెనలు ఎక్కువగా నదులు, రహదారి, లోయలు మొదలైన అడ్డంకుల్ని అధిగమించడానికి ఉపయోగిస్తాం. రహదార్లను ఎంత చక్కగా నిర్మించినా అవి నదుల దగ్గర ఠపీమని ఆగిపోతే ప్రయోజనముండదు. రోడ్లు ఎంత ముఖ్యమో వంతెనలు కూడా అంతే అవసరం అని గ్రహించాలి మనం.

మన దేశంలో నదుల మీద, చెరువుల మీద ఎన్నో రైలు వంతెనలు ఉన్నాయి. అయితే పొడవులో, ప్రత్యేకతలో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రైలు వంతెనలు కొన్నే ఉన్నాయి. అవి ప్రస్తుతం పర్యాటకుల చేత విశేషంగా ఆకర్షించబడుతున్నాయి. ఇప్పుడు మీకు తెలపబోయే దేశంలోని రైలు వంతెనలు అతి పొడవైనవి మరియు ప్రత్యేకత గలవి. మరి ఆ వివరాలేమిటో ఒకసారి చూసెద్దామా !!

వెంబనాడ్‌ వంతెన

వెంబనాడ్‌ వంతెన

దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జిగా పేరుగాంచిన వెంబనాడ్‌ బ్రిడ్జి (దీనిని వల్లార్‌పాదం బ్రిడ్జి అని కూడా పిలుస్తారు) ని కొచ్చి (కేరళ) వద్ద ఎడపల్లి - వల్లార్‌పాదం ఏరియాలను కలుపుతూ వెంబనాడ్‌ లేక్‌పై నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణ వ్యయం 350 కోట్ల రూపాయలు. పొడవు నాలుగున్నర కిలోమీటర్లు. అత్యాధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థతో అద్భుత ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఈ వంతెనకు మరో రికార్డు కూడా ఉంది. అదేంటంటే.. అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తయిన విశేషం దీని సొంతం. కేవలం ఒకటిన్నరేళ్లలో దీన్ని పూర్తి చేశారు. మొత్తం 231 పిల్లర్లపై ఈ వంతెన నిర్మాణం జరిగింది. జూన్‌ 2007లో నిర్మాణం ప్రారంభించబడి 31 మార్చి 2010లో పూర్తయింది. 11 ఫిబ్రవరి 2011న ఈ బ్రిడ్జిని అధికారికంగా జాతికి అంకితం చేశారు.

Photo Courtesy: VIMLESH CHANDRA RAILWAY WRITER

నెహ్రూ సేతు వంతెన

నెహ్రూ సేతు వంతెన

వెంబనాడ్‌ బ్రిడ్జి మొదటిస్థానం కైవసం చేసుకునేంతవరకు నెహ్రూ సేతుదే మొదటిస్థానం. ప్రస్తుతం రెండవస్థానంలో కొనసాగుతున్న ఈ బ్రిడ్జి 1900 సంవత్సరంలో బ్రిటీష్‌ వారిచే నిర్మించబడింది. బిహార్‌లోని డెహ్రి - సోన్‌ టౌన్లను కలుపుతూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెన పొడవు మూడున్నర కిలోమీటర్లు. మొత్తం 93 పిల్లర్లపై నిర్మించిన ఈ బ్రిడ్జి నిర్మించినపుడు దేశంలో అత్యంత పొడవైన రైలు వంతెనగా, ప్రపంచంలో రెండవ అత్యతం పొడవైన రైలు వంతెనగా గుర్తింపు కలిగివుంది.

Photo Courtesy: leo spee

హేవ్‌లాక్‌ బ్రిడ్జ్‌

హేవ్‌లాక్‌ బ్రిడ్జ్‌

రాజమండ్రి నుండి కొవ్వూరు వైపు రైళ్ళ రాకపోకలకు అప్పటి మద్రాసు గవర్నరు హేవలాక్‌చే ప్రారంభింపబడింది. ఇంతటి పెద్ద వంతెనను సాంకేతిక పరిజ్ణానం అంతగా లేని ఆ రోజుల్లోనే కేవలం మూడు సంవత్సరాలలోపే (1897 నవంబరు 11వ తేది నిర్మాణం మొదలై 1900 ఆగష్టు 6వ తేదీ నాటికి) నిర్మించడం ఒక విశేషమైతే అనుకొన్నదానికంటే తక్కువ ఖర్ఛు అవటం మరో విశేషం. నిర్మాణానికి 50,40,457 రూపాయలు అంచనా వేస్తే ఖర్చయింది 46,89,849 రూపాయలట! ఈ బ్రిడ్జ్‌ పై చిట్ట చివరగా కోరమాండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ 1997 మార్చి 12న వెళ్ళిన తరువాత రాకపోకలను శాశ్వతంగా ఆపివేసారు. పాత బ్రిడ్జికి సమీపంలో మరో కొత్త బ్రిడ్జిని అర్ధవలయాకారపు డిజైన్‌తో ప్రస్తు ఆర్చి బ్రిడ్జి నిర్మాణం జరిగింది.

Photo Courtesy: Dilse_Shiva

గోదావరి ఆర్చి బ్రిడ్జి

గోదావరి ఆర్చి బ్రిడ్జి

ప్రస్తుతం దేశంలో మూడవ అతిపెద్ద రైలు వంతెనగా, ఆసియాలోనే రెండవ అతిపెద్ద రైలు-రోడ్డు బ్రిడ్జిగా కొనసాగుతున్న గోదావరి ఆర్చి బ్రిడ్జి... ఇక్కడ ఇప్పటివరకు నిర్మించిన మూడు బ్రిడ్జిలలో కొత్త వంతెన. 1997 నుండి వాడుకలోకి వచ్చిన ఈ వంతెన అంతకుముందు ‘గోదావరి బ్రిడ్జి'గా పేరుతో ఉండేది. తొలిసారిగా 1897లో ‘హేవ్‌లాక్‌ బ్రిడ్జ్‌' పేరుతో ఆంగ్లేయుల కాలంలో గోదావరి పై వంతెన నిర్మాణం జరిగింది. అయితే కొత్త ఆర్చి వంతెన అందుబాటులోకి వచ్చిన తరువాత 1997లో దీనిని మూసివేశారు. ఈ వంతెన పొడవు రెండన్నర కిలోమీటర్లు. రాజమండ్రి నుండి కొవ్వూరు వరకు గోదావరి నదిపై ఈ వంతెన నిర్మించారు.

Photo Courtesy:itinerantobserver

నరనారాయణ సేతు వంతెన

నరనారాయణ సేతు వంతెన

బ్రహ్మపుత్ర నదిపై నిర్మించి ఈ వంతెన దేశంలో నాలుగో అది పొడవైన వంతనెగా గుర్తింపు పొందింది. అస్సాంలోని జోఘిగోపా - పంచరత్నల మధ్య నిర్మించిన ఈ వంతెన పొడవు రెండు కిలోమీటర్లు. 15 ఏప్రిల్‌ 1998లో అప్పటి భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఈ వంతెనను ప్రారంభించారు. ‘కోచ్‌' రాజ్యవంశానికి చెందని నర నారాయణ్‌ పేరుమీదుగా ఈ వంతెనకు నరనారాయణ సేతుగా నామకరణం చేశారు. డబుల్‌ డెక్‌ మోడల్‌లో నిర్మించిన ఈ వంతెన నిర్మాణానికి 300 కోట్ల రూపాయలు ఖర్చయింది.

Photo Courtesy: Apurba Rabha

పంబన్‌ బ్రిడ్జి

పంబన్‌ బ్రిడ్జి

భారత దేశపు తొలి సముద్రపు వంతెన అయిన పంబన్‌ బ్రిడ్జికి దేశంలో ఏ బ్రిడ్జికీ లేనన్ని ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తమిళనాడులోని రామేశ్వరానికి వెళ్ళేదారిలో కనిపిస్తుంది ఈ పంబన్‌ రైలు మరియు రోడ్‌ బ్రిడ్జి. ఈ వంతెన రామేశ్వరం ద్వీపాన్ని - భారత ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది. ఈ పంబన్‌ బ్రిడ్జి భారతదేశపు తొలి సముద్రపు వంతెన, దీని నిర్మాణం బ్రిటీ ష్‌ వారికాలంలో 1887లో మొదలయి 1912లో పూర్తయింది. భారతదేశం లో ఉన్న సముద్రపు వంతెనలలో ఇది రెండవ అతి పెద్ద సముద్రపు వంతెన. ఈ వంతెన దాదాపు 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది సముద్రం మీద జలసంధి మీద నిర్మించారు కాబట్టి ఓడల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జి మ ధ్య భాగం రెండుగా విడివడి పైకి లేవడం ఈ వంతెన ప్రత్యేకత. ఈ బ్రిడ్జికి 143 స్థంబాలున్నాయి. మీకొక విషయం తెలుసా ?? ఈ వంతెన ప్రవేశం వద్ద ఒక వ్యక్తి ఏడుస్తూ కొన్ని శరీర అవయవాలు పట్టుకుని నిలబడ్డట్లు ఉంటుందట.

Photo Courtesy:James A

మహానది రైల్వే వంతెన

మహానది రైల్వే వంతెన

మహానది రైల్వే వంతెన మహానది నదిపై సుమారుగా 2.100 కి. మీ .పొడవున నిర్మించినారు. ఈ బ్రిడ్జ్ కటక్ సమీపాన ఒరిస్సా రాష్ట్రములో ఉన్నది. మహానది పై మొదటి బ్రిడ్జ్ భూత్ముండై సమీపాన కలదు. ఈ బ్రిడ్జ్ రెండవది. భారత దేశంలో కెల్ల పొడవైన రైలు వంతెనలలో ఈ వంతెన కూడా ఒకటి మరియు ఒరిస్సా రాష్ట్రంలో కెల్ల పెద్ద వంతెన. వేగంగా వెళ్లే రైలులో ఈ నదిపై నిర్మించిన వంతెన మీద వెళితే భలే థ్రిల్లింగా ఉంటుంది. ఈ నది పైనే నిర్మించిన దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన హీరాకూడ్ డ్యామ్ సంబల్ పూర్ జిల్లాలో చూడవచ్చు.

Photo Courtesy: Kamalakanta777

శరావతి రైలు వంతెన

శరావతి రైలు వంతెన

శరావతి నది కర్నాటక రాష్ట్రం నందలి ప్రవహిస్తుంది. ఇది పశ్చిమాన ఉన్న అరేబియా సముద్రంలో ఉత్తర కర్నాటక జిల్లాలలోని హొన్నవర్ సమీపాన కలుస్తుంది. ఈ వంతెన పొడవు 2.060 కి. మీ. పశ్చిమాన పుట్టి పశ్చిమాన నే సముద్రంలో కలిసే నదిగా ఖ్యాతి గడించింది. ఈ నది పై సాగర తాలూకాలో ఉన్న లింగనమక్కి ఆనకట్ట కట్టినారు. ఈ నది 253 మీటర్ల ఎత్తునుంచి దూకుతుంది. దేనినే జోగ్ జలపాతంగా పిలుస్తాము. ఇక్కడ వృక్ష సంపద అధికంగా ఉంటుంది. ఈ జలపాతం వద్దనే ఎన్నో సినిమా షూటింగ్‌లు జరుగుతుంటాయి.

Photo Courtesy: Pasad

కొనార్క్ రైల్వే వంతెన

కొనార్క్ రైల్వే వంతెన

కొనార్క్ రైల్వే వంతెన జువారి నదిపై నిర్మించినారు. ఈ వంతెన పొడవు 1.319 కి. మీ. ఉంటుంది. ఈ రైల్వే వంతెన చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది. ఈ వారధి మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాలను కలుపుతుంది. కార్బుడే అనే టన్నెల్ ఇక్కడ అదికూడా మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో ఉంది. ఈ టన్నెల్ దేశంలోని పొడవాటి రైల్వే టన్నెల్ గా ప్రసిద్ధి చెందింది.

Photo Courtesy: Para

విద్యాసాగర్ సేతు

విద్యాసాగర్ సేతు

ప్రముఖంగా దీనిని రెండవ హౌరా వంతెన అని పిలుస్తారు. ఇది కొత్త టోల్ వంతెన కేబుల్ ఉండి ఆసియాలోనే పెద్దదిగా ఉన్నది. వంతెన యొక్క పరిపూర్ణ మహత్వము స్పూర్తినిస్తూ విస్మయం మరియు రాత్రి దీపాల వెలుగులో అద్భుతంగా ఉంటుంది. విద్యాసాగర్ సేతు చూడటానికి వెళ్ళినప్పుడు వంతెన మరియు నది యొక్క మంత్రముగ్దులను చేసే వీక్షణను నదిలో పరావర్తనం ద్వారా చూడవచ్చు.

Photo Courtesy:Anirban Biswas

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X