Search
  • Follow NativePlanet
Share
» »వరంగల్ పర్యాటకం ఈ ప్రాంతాల వల్ల మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది

వరంగల్ పర్యాటకం ఈ ప్రాంతాల వల్ల మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది

వరంగల్ చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పర్యాటక ప్రాంతం వరంగల్. ఇక్కడ ప్రకతి సిద్ధమైన సరస్సులతో పాటు చరిత్రను మనకళ్ల ఎదుట నిలిపే ఎన్నో కట్టడాలు ఉన్నాయి. అందువల్ల అటు ప్రకతి సౌదర్యాధకులతో పాటు ఆధ్యాత్మిక, ధార్మిక పర్యాటకులకు ఒకప్పటి ఈ కాకతీయ సామ్రాజ్య రాజధాని ఈ వరంగల్ కచ్చితంగా నచ్చుతుంది.

అందువల్లే ప్రతి రోజూ ముఖ్యంగా వీకెండ్ రోజుల్లో ఎంతో మంది వరంగల్ తో పాటు చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలను చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కథనంలో వరంగల్ తో పాటు చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాల్లో ముఖ్యమైన వాటిని మీ కోసం అందిస్తున్నాం.

వరంగల్ కోట

వరంగల్ కోట

You Tube

వరంగల్ తో పాటు కాకతీయ సామాజ్ర చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఈ వరంగల్ కోట. అనేక దండయాత్రలను తట్టుకొని కూడా ఇప్పటికీ ఈ కోట చెక్కు చెదరకుండా ఉంది. దీని వాస్తు శైలి అప్పటి కాకతీయ రాజుల యుద్ధ నిరతికి నిదర్శనం. వారంలో అన్ని రోజులూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ వరంగల్ కోటను సందర్శించవచ్చు. ప్రవేశ రుసుం ఒక్కొక్కరికి రూ.15

వెయ్యి స్తంభాల గుడి

వెయ్యి స్తంభాల గుడి

You Tube

ఒక్క తెలుగు రాష్ట్రాలు, భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన పర్యాటక ప్రాంతాల్లో వరంగల్ లోని వెయ్యి స్తంభాల గుడి ఒకటి. ఈ వెయ్యి స్తంభాల గుడిలో ప్రధాన దైవం రుద్రేశ్వరస్వామి దేవాలయం. హనుమకొండ కొండ పై ఈ దేవాలయం ఉంది. రాతితో మలిచిన ఏనుగులు, పెద్ద నంది కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణ. వారంలో అన్ని రోజులూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ ఈ వెయ్యి స్తంభాల గుడిని సందర్శించుకోవచ్చు.

జైన్ దేవాలయం

జైన్ దేవాలయం

You Tube

జైనులకు ఈ దేవాలయం పరమ పవిత్రమైనది. ఎర్రని మార్బల్ రాయితో నిర్మించిన ఈ దేవాల వాస్తు శైలి పర్యాటకులను ఇట్టే ఆకట్టుకొంటుంది. కొలనుపాలక లోని ఈ జైనదేవాలయం వారంలో అన్ని రోజులూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ సందర్శనకు అనుకూలం. ప్రవేశ రుసుం లేదు.

పాకాల చెరువు

పాకాల చెరువు

You Tube

పాకాల చెరువు చూస్తే ప్రక`తిలోని అందమంతా ఇక్కడ ఉన్నట్లు అనిపించడం లేదంటే మీకు కళాపోషన లేదని అర్థం అని చెప్పవచ్చు. వరంగల్ కు 50 కిలోమీటర్ల దూరంలోని ఈ పాకాల చెరువు చుట్టూ ఎక్కడ చూసిన పచ్చదనం కనిపింస్తుంది. వారంలో అన్ని రోజులూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఈ చెరువును చూడటానికి సందర్శకులకు అనుమతి ఉంటుంది.

భద్రకాళీ దేవాలయం

భద్రకాళీ దేవాలయం

You Tube

వరంగల్, హనుమకొండ మధ్య ఉన్న భద్రకాళీ దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. కాకతీయులతో పాటు ఎంతో మంది రాజులకు ఈ దేవాలయంలోని భద్రకాళీ కులదైవత. ముఖ్యంగా యుద్ధాలకు వెళ్లే సమయంలో రాజులు ఈ మాతకు ప్రత్యేక పూజలు చేసేవారు. ఈ దేవాలయానికి ఆనుకొనే భద్రకాళీ సరస్సు ఉంది. ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ అదే విధంగా మధ్యాహ్యం 3 గంటల నుంచి 8 గంటల వరకూ ఈ దేవాలయాన్ని సందర్శించవచ్చు.

ఏటూరు నాగారాం అభయారణ్యం

ఏటూరు నాగారాం అభయారణ్యం

You Tube

తెలంగాణాలోని అతి ప్రాచీన, అత్యంత అరుదైన వన్యప్రాణులు కలిగిన అభయారణ్యం ఏటూరు నాగారాం అభయారణ్యం. ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులకు, ఫొటోగ్రాఫర్లకు ఏటూరు నాగారాం అభయారణ్యం స్వర్గధామం. వారంలో అన్ని రోజులూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ అభయారణ్యంలోకి సందర్శకులను అనుమతిస్తారు. ప్రవేశరుసుం ఒక్కొక్కరికి రూ.10.

వీరనారాయణ దేవాలయం

వీరనారాయణ దేవాలయం

You Tube

వరంగల్ పర్యాటకంలో వీరనారాయణ దేవాలయానికి ప్రత్యేక స్థానం అన్నడంలో అతిశయోక్తి లేదు. కొలనుపాకలోని ఈ దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ దేవాలయం వాస్తు శైలితో పాటు శిల్ప సంపద మనకు కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతుంది. వరంలో అన్ని రోజులు సందర్శనకు అనుమతి ఉంటుంది.

రామప్ప దేవాలయం

రామప్ప దేవాలయం

You Tube

వరంగల్ పట్టణానికి 77 కిలోమీటర్ల దూరంలోని రామప్ప దేవాలయాన్ని రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. క్రీస్తుశకం 1213లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడి వాస్తు, శిల్పకళ పై అధ్యయనం చేయడానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రతి రోజూ ఇక్కడికి వస్తుంటారు. ఈ రామప్ప దేవాలయాన్ని వారంలో ఎప్పుడైనా ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సందర్శించవచ్చు.

భీముని పాదం జలపాతం

భీముని పాదం జలపాతం

You Tube

వరంగల్ పర్యాటకం ఈ భీముని పాదం జలపాతాన్ని చూడకుండా ముగియదు. వరంగల్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ అందమైన జలపాతం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ భీముని పాదం జలపాతం అందాలు చూడాల్సిందే కాని వర్ణించడానికి మాటలు చాలవు.

లక్నవరం సరస్సు

లక్నవరం సరస్సు

You Tube

వరంగల్ చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాల్లో లక్నవరం సరస్సు కూడా ఒకటి. ఇక్కడ సూర్యాస్తమయం చూడటానికి చాలా అందంగా కనబడుతుంది. ఈ సరస్సు పై కట్టిన చిన్న వంతన పై నడవడం మనలను బాల్య స్మ`తిల్లోకి తీసుకువెలుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X