Search
  • Follow NativePlanet
Share
» »ట్రావెల్ లో పాటించ కూడని సలహాలు !

ట్రావెల్ లో పాటించ కూడని సలహాలు !

ఎక్కడకైనా పర్యటన ప్లాన్ చేస్తే చాలు కుటుంబ సభ్యులు, లేదా ఇతర స్నేహితుల నుండి ఆ పర్యటనలకు సంబంధించిన సలహాలు కుప్ప తెప్పలుగా వస్తూంటాయి. అది చేయవద్దు ...ఇది చేయవద్దు ....జాగ్రత గా వ్యవహరించండి! వంటి మాటలు వింటూనే వుంటాం. అన్ని రంగాల లో వలెనె, ట్రావెల్ లో కూడా పైకి కనపడే అంశాలన్నీ మంచివే అనుకోవటానికి వీలు లేదు. మీ ఆహ్లాదకర పర్యటనలో కొన్ని సలహాలు వదిలేయాల్శినవి ఇక్కడ ఇస్తున్నాం పరిశీలించండి.

వదలవలసిన ట్రావెల్ సలహాలు !

ట్రావెల్ లో పాటించ కూడని సలహాలు !

1. 'ఖచ్చితమైన ప్రణాళిక ' - మీరు బయలుదేరే ముందే ఖచ్చితమైన ప్రణాళిక వేసుకోవడమనేది కుదర పని. మీరు ఒక కొత్తప్రదేశాన్ని సందర్శిస్తున్నట్లయి తే , అక్కడ ప్రతి ఆకర్షణీయ ప్రదేశం లేదా ప్రోగ్రాం వంటివి , మీ సౌకర్యం, మీ రవాణా, మీ హెల్త్ పరిస్థితి వంటివాటిపై కూడా ఆధారపడి వుంటాయి. అయితే, మీరు వెళ్ళే ప్లేస్ గురించిన ఒక మాదిరి సమాచారమైనా సరే పొందితే హాని కాదని గుర్తించండి.

2. 'సోషల్ సైట్స్ ' - ట్రావెల్ చేస్తున్నామంటే, ఆ ప్రదేశంలోని ఫోటోలు అన్నీ పేస్ బుక్ లేదా ఇతర సోషల్ మీడియా సైట్ లలో పెట్టమని, వారికి అన్ని ఫోటోలు పంపమని చాలా మంది సలహా ఇస్తారు. ఈ సలహా వదిలేయండి. మీరు సందర్శించే ప్రదేశ వివరాలు ఆ ప్రదేశంలో మీ విలువైన సమయాన్ని వెచ్చించి సోషల్ సైట్ లలో పెట్టనవసరంలేదు. మీ ట్రావెల్ మరికొందరికి బాధాకరంగా కూడా ఉండవచ్చు.

3. 'కొత్త వ్యక్తులతో జాగ్రత్త' - కొంత మేరకు ఈ సలహా పెడచెవిని పెట్టదగినదే. కొత్త వ్యక్తులు కూడా కొత్త ఫ్రెండ్స్ ని చేసుకొనటానికి ప్రయత్నిస్తూ వుంటారు. అందులోనూ, పర్యటనా ప్రదేశం లోని స్థానికులు మీ ట్రావెల్ అనుభవాలకు తోడై, మీకు ఆ కొత్త ప్రదేశం చూసేందుకు గైడ్ గా కూడా వ్యవహరిస్తారు.

4. 'పర్యటన లో లగేజ్ తక్కువ ' - సౌకర్యవంతమైన పర్యటనకు మీరు అవసరమైన వస్తువులు అన్నీ తీసుకు వెళ్ళాల్సిందే. తగినన్ని దుస్తులు, క్లైమేట్ బట్టి ఉన్ని దుస్తులు వంటివి, మెడిసిన్ లు వంటివి తప్పక తీసుకు వెళ్ళాల్సిందే. మీ ట్రిప్ కనుక అధిక రోజులదైతే, లగేజ్ మరి అధికంగానే వుంటుంది.

5. 'చూడవలసిన ప్రదేశాల జాబితా' - పర్యటన లో మీరు ముందే కనుక చూడవలసిన ప్రదేశాల జాబితా తయారు చేసుకొంటే, మీరు దానికే పరిమితమైపోతారు. ఆ ప్రదేశాలు వెళ్ళిన తర్వాత మీరు తెలిసికొన్న మరికొన్ని ఆకర్షణీయ ప్రదేశాలు చూడలేరు. సరదాగా ట్రావెల్ చేయాలనుకున్నపుడు, ప్రతి క్షణం ప్రదేశం ఏదైనా సరే ఆనందంగా గడిపేయండి. మీ మనస్సుకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళండి. అంతే గాని ముందస్తుగా రాసిన జాబితా ప్రదేశాలకే పరిమితం కాకండి.

6. 'ట్రావెల్ లో చదువుకునేందుకు పుస్తకాలు' - మనలో చాలా మంది మేగజైన్ చూసి సరి పెడతారు. అయితే, మంచి ట్రావెల్ పుస్తకం, ప్రదేశం గురించిన పూర్తి వివరణ ఇచ్చేది, మీ ఖాళీ సమయంలో తప్పక చదివి విలువైన మీ సమయం పొదుపు చేసుకోండి.

7. 'ఒంటరిగా ట్రావెల్ చేయకండి'- మనలో చాలా మంది గ్రూప్ లలో ట్రావెల్ చేయటానికి ఇష్టపడరు. కొంతమంది ఒంటరిగానే వారి ఇష్టం వచ్చినట్లు ట్రావెల్ చేస్తారు. మీరు కనుక గ్రూప్ లో కాకుండా ఒంటరిగా ట్రావెల్ చేసే వారైతే, ఈ సలహా పాటించకండి.

8. 'ఆప్రదేశ పర్యటనకు ఇది సీసన్ కాదు' - మీరు శ్రీనగర్ సైట్ సీఇంగ్ లేదా అక్కడి స్నోఫాల్ కొరకు వింటర్ లో కూడా వెళ్ళవచ్చు. కనుక అది ట్రావెల్ చేసే వారి ఇష్టం మేరకు ఆధారపడి వుంటుంది. కనుక ఈ సలహా పాటించకండి.

9. ' ఆ ప్రదేశంలో చూసేందుకు ఏమీ లేదు ' - అని మీ ఫ్రెండ్స్ లో కొంత మంది మిమ్మల్ని మిస్ గైడ్ చేస్తారు. వారు చెప్పినది విని మాని వేసే కంటే, మీ కై మీరు ఆ ప్రదేశానికి వెళ్లి మీకిష్టమైన అంశాలు ఆనందించి రావటం మేలు. కనుక మీరు ఈ ట్రాప్ లో పడకండి. ప్రతి ట్రావెల్లెర్ కు కొన్ని అభిరుచులు వుంటాయి.

10. 'ట్రావెల్ సైట్ ఏదైనా చూసి, దానిని ఫాలో అవండి' - అనే మాటను మీ ఫ్రెండ్స్ చెపుతూ వుంటారు. ఇక్కడ వాస్తవం ఏమంటే, చాలా సార్లు, ఆ ట్రావెల్ సైట్ 'మంచి ప్రదేశం 'గా రికమెండ్ చేసిన ప్రదేశాలు మీ ఎంపిక కాక పోవచ్చు. కనుక ఈ సలహా మీరు పాటించకపోవటం మంచిది. వెబ్ సైట్ లు సాధారణంగా వాస్తవ పర్యటనా అంశాలు తెలిపి నప్పటికీ, ఒక్క వెబ్ సైట్ ఆధారంగా మీ ట్రిప్ ప్లాన్ చేయటం సరి కాక పోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X