Search
  • Follow NativePlanet
Share
» » వింటర్ సీజన్లో మున్నార్ పర్యటన !

వింటర్ సీజన్లో మున్నార్ పర్యటన !

కేరళ పర్యటనకు ఏ కాలం అయినా పరవాలేదు. నిస్సందేహంగా ఈ ప్రాంతం ఇండియా లో ఒక మంచి పర్యాటక ప్రదేశం. కేరళ రాష్ట్రం నిండా ఎన్నో ఆకర్షణలు. రాష్ట్ర వాతావరణం ఏ కాలంలో అయినా సరే పర్యటనకు అనుకూలిస్తుంది. కేరళ రాష్ట్ర పర్యటనలో చాలామంది మొదటగా ఏ ప్రదేశం చూడాలి ? అనే సందేహంలో వుంటారు. అందుకు గాను సమాధానంగా ఈ వ్యాసం కేరళ రాష్ట్రంలో మున్నార్ ప్రదేశం 'అత్యుత్తమైనది' అని సిఫార్సు చేస్తోంది. మున్నార్ కు ఇండియాలో ఎంతో ప్రాధాన్యత కలదు. మున్నార్ ప్రాంతం మూడు పర్వత ప్రవాహాలు కలసే సంగం ప్రదేశంలో కలదు. ముద్రపుజ, క్లుందల మరియు నల్లథాన్ని అనే మూడు ప్రవాహాలు ఇక్కడ కలవు. ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందిన 12 సంవత్సరాలకు ఒకసారి విరబూచే పూవులు అయిన నీలకురింజిలకు కూడా ప్రసిద్ధి. ఈ పూవులు మరల 2018 లో వికసిస్తాయి. ఆ సమయంలో ఈ పర్వత ప్రాంతం అంతా నీలి వర్ణపు పూవుల రంగుతో కప్పబడి ఆకర్షణీయంగా వుంటుంది.

మరి ప్రకృతి దృశ్యాలతో పాటు ఎన్నో సాహస క్రీడలు కూడా అందించే మున్నార్ ప్రాంతంలో ఏ ఏ ఆకర్షణలు కలవో పరిశీలిద్దాం.

మున్నార్ సందర్శన

దేవికులం

దేవికులం

దేవికులం ఒక హిల్ స్టేషన్. ఇది మున్నార్ కు 7 కి. మీ. ల దూరంలో కలదు. మున్నార్ వెళ్ళిన పర్యాటకులు దేవికులం తప్పక చూడాలి. దేవికులం ప్రాంత అందాలు, మున్నార్ లోని పచ్చటి కొండలతో పోటీ పడుతున్నాయా అనేలా వుంటాయి. దేవికులం ఒక ట్రెక్కింగ్ ప్రాంతం. ఇక్కడ కల ఎర్ర బంక వృక్షాలు, దట్టమైన పచ్చటి తేయాకు తోటల మధ్య ట్రెక్కింగ్ ఒక మరువ లేని అనుభూతిగా వుంటుంది. Photo Courtesy: BoyGoku

మట్టుపెట్టి

మట్టుపెట్టి

మట్టుపెట్టి సముద్ర మట్టానికి 1700 మీ. ల ఎత్తున కలదు. ఇది మున్నార్ కు 13 కి. మీ. ల దూరం. మున్నార్ వెళితే ఈ సారి మట్టుపెట్టి తప్పక చూడండి. ఈ ప్రదేశంలో మట్టుపెట్టి డాం మరియు ఒక సరస్సు ప్రధాన పర్యాటక ఆకర్షణలు
Photo Courtesy: Liji Jinaraj

రాజమాల

రాజమాల

రాజమాల మున్నార్ కు 15 కి. మీ. ల దూరం. ఈ ప్రదేశంలో ప్రపంచంలోని థార్ జంతువుల సంఖ్యలో సగం ఇక్కడే కలదు. ఇక్కడ మీరు నీలగిరి ప్రసిద్ధ థార్ జంతువులను చూడటమే కాక ప్రదేశం లోని ప్రకృతి దృశ్యాలు కూడా చూసి ఆనందించవచ్చు.

Photo Courtesy: Aditya

 ఎరావికులం

ఎరావికులం

ఎరావికులంలో ఒక నేషనల్ పార్క్ కలదు. ఎరావికులం నేషనల్ పార్క్ మున్నార్ కు 15 కి. మీ. ల దూరం. ఈ నేషనల్ పార్క్ కు దక్షిణంగా అందమైన అనముడి పర్వత శిఖరాలు కనపడతాయి. సుమారు 97 చదరపు కి. మీ. ల విస్తీర్ణంలో కల ఈ నేషనల్ పార్క్ ఇండియాలోని అత్యధిక జీవ వైవిధ్యం కల పార్క్ లలో ఒకటి. ఈ పార్క్ నీలగిరి థార్ కు ఒక నివాసంగా కూడా వున్నది.

Photo Courtesy: Jiths

 ఎకో పాయింట్

ఎకో పాయింట్

ఎకో పాయింట్ మున్నార్ నుండి 15 కి. మీ. ల దూరం. ఈ ప్రదేశంలో చేసే శబ్దాలు తరంగాలుగా వ్యాపించి ప్రతిధ్వని ఇస్తాయి. పర్యాటకులు ఇక్కడకు పెద్ద గుంపులలో వచ్చి తమ స్వరధ్వనులను తామే విని ఆనందిస్తారు. ఇంకనూ మున్నార్ లో అనేక ఆకర్షణలు కలవు. Photo Courtesy: Sreerajcochin

 అనయిరంకాల్

అనయిరంకాల్

అనయిరంకాల్ మున్నార్ కు 22 కి. మీ. ల దూరంలో కలదు. ఈ ప్రాంతంలో విశాలమైన తేయాకు తోటలు కలవు. ఈ తోటల విహారం మీకు పూర్తి రిలాక్సేషన్ కలిగిస్తుంది. ఈ ప్రదేశ విహారం కలల లోకంలోకి అడుగుపెట్టినట్లు వుంటుంది. ఈ ప్రాంతంలో కల అనయిరంకాల్ డాం ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.
Photo Courtesy: Ramesh NG

మున్నార్ లో ట్రెక్కింగ్ మార్గాలు

మున్నార్ లో ట్రెక్కింగ్ మార్గాలు

మున్నార్ ప్రకృతి ద్రుస్యాలకే కాదు. సాహస ట్రెక్కింగ్ కు కూడా పేరు పొందినది. మున్నార్ నుండి సుమారు పది కి. మీ. ల దూరంలో కల అత్తుకాల్ ఒక మంచి ట్రెక్కింగ్ ప్రాంతం. అత్తుకాల్ ప్రదేశం మున్నార్ కు మరియు పల్లి వాసాల్ కు మధ్యన వుంటుంది.

పోతమేడు -
పోతమేడు ఇక్కడ మరొక ట్రెక్కింగ్ ప్రదేశం. మున్నార్ నుండి పది కి. మీ. ల దూరంలో కలదు.

లాక్ హార్ట్ గ్యాప్
లాక్ హార్ట్ గ్యాప్ మున్నార్ నుండి 13 కి. మీ. ల దూరంలో కలదు. ఇది కూడా ఒక మంచి ట్రెక్కింగ్ ప్రదేశం.
Photo Courtesy: Bimal KC

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X