Search
  • Follow NativePlanet
Share
» »ప్రయాణపు భ్రమలు - వాస్తావాలు !

ప్రయాణపు భ్రమలు - వాస్తావాలు !

మనమంతా ఇంకా కొన్ని భ్రమలు కలిగి వాటికి అంటి పెట్టుకున్న వారి మధ్య నివసిస్తున్నాం. అదే రకంగా, ట్రావెల్ లో కూడా అనేక భ్రమలు కొంతమంది వెల్లడిస్తారు. మరి ట్రావెల్ గురించిన ఈ భ్రమలు , వాస్తవాల గురించి కొంత తెలుసుకుందాం.

1. సెల్ ఫోన్ తో ప్లేన్ క్రాష్

మీరు కనుక ఫ్లైట్ లో ప్రయాణిస్తూ వుంటే, సెల్ ఫోన్ వాడితే, దాని తరంగాలకు ప్లేన్ క్రాష్ అవుతుందని, అందుకనే, ఆ ప్లేన్ సిబ్బంది సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని అంటారని అనుకుంటాం. కాని అది సరి కాదు. ప్రతి విమాన సర్వీస్ కు కొన్ని నిబంధనలు వుంటాయి. వాటి మేరకు సిబ్బంది సెల్ ఫోన్ లను స్విచ్ ఆఫ్ చేయ వలసినదిగా కోరతారు. అంటే కానీ మీరు సెల్ ఫోన్ లో ఒక ఎస్ ఎం ఎస్ పంపినా కాల్ చేసినా ప్లేన్ క్రాష్ కాదు.

ప్రయాణపు భ్రమలు - వాస్తావాలు !

2. టూరిస్ట్ లు అంటే అధిక సొమ్ము వసూలు చేస్తారు.
ఈ అంశం, కొత్త ప్రదేశంలో మీ తీరు బట్టి వుంటుంది. అక్కడ కల వివరాలు మీకు తెలియకుంటే, మీరు తప్పక స్థానిక దుకాణాదారుల ఉచ్చు లో పడతారు. కనుక కొంత తెలివిగా వ్యవహరించి, మీకు కావలసిన వస్తువులు కొనుగోలు చేయండి. అంతే గానీ అమాయకంగా నమ్మకండి.

౩. డ్యూటీ ఫ్రీ వస్తువులు సొమ్ము ఆదా చేస్తాయి

చాలా మంది ఎయిర్ పోర్ట్ వంటి ప్రదేశాలలో డ్యూటీ ఫ్రీ వస్తువులు కొంటె సొమ్ము ఆదా అవుతుందని భావిస్తారు. తక్కువ ధరలలో అధిక వస్తువులు కొనవచ్చని భావిస్తారు. వాస్తవానికి అధిక పన్ను కల సిగరెట్ లేదా ఆల్కహాల్ వంటివి మీకు కొంత మొత్తం పొదుపు చేయవచ్చు. కానీ, సన్ గ్లాస్సెస్ లేదా ఇతర పెర్ఫ్యూమ్ లు బయటి షాపుల ధర కంటే , ఇక్కడ అధికంగానే వుంటాయి.

4. స్ట్రీట్ ఫుడ్ తినటం సురక్షితం కాదు
చాలా మంది టూరిస్ట్ లు వీధిలో బండ్లపై తయారు చేసే తిండి పదార్ధాల కంటే, ఏదైనా ఒక రెస్ట రెంట్ కు వెళ్లి తినటం మేలని భావిస్తారు. వాస్తవంలో ఆ రెస్ట రెంట్ లోని కిచెన్ ఎంత పరిశుభ్రంగా వుందనేది, ఏ రకమైన పదార్ధాలు వారు వాడుతున్నారనేది మీకు తెలియదు.
అయితే వీధి బండ్ల విషయంలో ఆ పరిశుభ్రత, వారు ఉపయోగించే పదార్ధాల నాణ్యతలు మీకు వెంటనే తెలుస్తాయి.

5. చివరి క్షణంలో బుక్ చేసే విమాన లేదా బస్సు టికెట్స్ చవక

చాలా మంది చివరి క్షణాలలో అమ్మే బస్సు లేదా, ఫ్లైట్ టికెట్ లు చవక అనుకుంటారు. కాని అది ఒక భ్రమ.ఏ రవాణా వ్యవస్థ కూడా సాధారణంగా తక్కువ రేట్లకు ఆముకోదు. అది వాస్తవమా కాదా అనేది, మీకు తర్వాత తెలుస్తుంది. కనుక, ముందుగా మీ టికెట్ లను రిజర్వు చేసుకొని, ప్రయాణించి ఆనందించండి.

6.అడ్వాన్సు బుకింగ్ లో సొమ్ము ఆదా!

టికెట్ లు ఆరు నెలల అడ్వాన్సు బుకింగ్ లో కొంటె సొమ్ము ఆదా అవుతుది. కొన్ని మార్లు ఎయిర్ లైన్స్ సంస్థలు అంత ముందుగా ఆఫర్ లు ప్రకటించక పోవచ్చు. కనుక టికెట్ లు ఎపుడూ రెండు లేదా మూడు వారాల ముంందు మాత్రమే సరైన రేట్ల లో కొనటం మంచిది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X