Search
  • Follow NativePlanet
Share
» »మున్నార్ లో ప్రత్యేక పర్యాటక ఆకర్షణలు!

మున్నార్ లో ప్రత్యేక పర్యాటక ఆకర్షణలు!

మున్నార్ ఒక అందమైన హిల్ స్టేషన్ ఇది ప్రకృతి అందాలకు పేరెన్నిక గన్న కేరళ రాష్ట్రంలో కలదు. పచ్చటి తేయాకు తోటలు, మనోహర ప్రదేశాలు ఈ ప్రదేశాన్ని పర్యాటక మరియు స్థానిక ఆకర్షణీయ ప్రదేశంగా తీర్చి దిద్దాయి. మున్నార్ లో ఎన్నో ఆకర్షణలు ఉన్నప్పటికీ, దిగువ పేర్కొన్న ప్రత్యేక ఆకర్షణలు మాత్రం మీ కేరళ ట్రిప్ లో మిస్ కాకండి. మరి అటువంటి ప్రత్యేక ఆకర్షణలు ఏమిటో పరిశీలిద్దాం.


ఎకో పాయింట్ (మున్నార్ నుండి 15 కి. మీ.లు)
మున్నార్ సందర్శనలో కొన్ని కొండల నడుమ కల ఒక చిన్న ప్రదేశం అయిన ఎకో పాయింట్ తప్పక చూడండి. సహజమైన ఈ ప్రతిధ్వని ప్రదేశం మీరు ఎంత బిగ్గరగా అరిస్తే అదే రీతిలో మరల సౌండ్ అలల తో మీ వద్దకు వచ్చి వినపడుతుంది. ఆసక్తి కల యువత గ్రూప్ లు గా ఈ ఎకో పాయింట్ కు వచ్చి రకరకాల ధ్వనులు చేసి ఆనందస్తారు.

ఫోటో పాయింట్ (మున్నార్ నుండి 3 కి. మీ. ల దూరం)
ఈ ఫోటో పాయింట్ ప్రదేశంలో మీరు ఫోటోలు తీసుకొనటం తప్ప చేయవలసినది ఏదీ వుండదు. మీరు కనుక ఫోటోగ్రఫీ ప్రియులైతే, ఈ ప్రదేశానికి తప్పక వెళ్ళాలి. ఈ ప్రదేశం అంతా అడవులు, మరియు నీటి ప్రవాహాలు, జలపాతాలతో నిండి వుంటుంది. ఈ ప్రదేశం మట్టుపెట్టి కి వెళ్ళే మార్గంలో కలదు. పచ్చటి అడవులు, గల గల పారే ప్రవాహాలు, పచ్చటి కొండలు వంటివి ఎన్నో ప్రదేశాలు చూడవచ్చు.

మున్నార్ లో ప్రత్యేక ఆకర్షణలు!

టాప్ స్టేషన్ (మున్నార్ నుండి 37 కి. మీ.)
మనోహర దృశ్యాలు కల ఈ ప్రదేశం మున్నార్ కు సమీపంలోనే కలదు. పడమటి కనుమల మరియౌ చుట్టూ కల కొండల అద్భుత దృశ్యాలతో కన్నులకు విందు గా వుంటుంది. ఈ ప్రదేశంలో అతి ఎత్తులో కొన్ని టీ తోటలు కలవు. ఈ ప్రదేశంలో మీకు మబ్బుల పై భాగంలో వున్నా అనుభవం కలుగుతుంది. మున్నార్ లోని పచ్చటి ప్రదేశాలను ఎత్తులో నుండి చూసేందుకు ఇది ఒక మంచి ప్రదేశం.

మట్టుపెట్టి డాం (మున్నార్ నుండి 13 కి. మీ.లు)
ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు అక్షరాల ఒక స్వర్గం అనిపిస్తుంది. దట్టమైన టీ తోటల మధ్య కల ఈ ప్రదేశాన్ని మట్టుపెట్టి డాం అంటారు. మట్టుపెట్టి డాం నీటిలో బోటింగ్ చేయవచ్చు. ఒక చక్కని బోటింగ్ అనుభవంతో పాటు చుట్టూ కల పరిసరాలను కూడా చూసి ఆనందించవచ్చు.

ఎలిఫెంట్ లు వచ్చే ప్రదేశం (మున్నార్ నుండి 18 కి. మీ.లు)
అద్భుతమైన ఈ ప్రదేశంలో మీరు ఏనుగుపై సవారి ఆనందించవచ్చు. దానితో పాటు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసే, మున్నార్ కొండలు, టీ తోటలు కూడా చూసి ఆనందించవచ్చు. మీరు ప్రకృతి కాలి నడకలు ఆనందించే వారైతే, పచ్చటి మైదానాలలో నడిచి ఆనందించవచ్చు.

కేరళలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం అయిన మున్నార్ చేరటం కష్టమైనా ప్రయాణం కాదు. ప్రైవేటు బస్సు లు ఇతర రోడ్డు రవాణా సౌకర్యాలు కేరళ లోని ప్రధాన నగరాలనుండి, మరియు తమిళ్ నాడు లోని ప్రధాన ప్రదేశాలనుండి మున్నార్ కు కలవు. మున్నార్ సందర్శనకు సంవత్సరంలో ఏ కాలంలో అయినా సరే పర్యటించవచ్చు. ప్రతి సీజన్లో మున్నార్ ఒక కొత్త రూపు సంతరించుకొంటుంది. కనుక, చిన్న హిల్ స్టేషన్ అయిన మున్నార్ కు అతి త్వరలోనే వచ్చే మీ టూర్ ప్రోగ్రాం లో ప్రణాళిక చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X