Search
  • Follow NativePlanet
Share
» »వేసవి సెలవుల విహారాలు !

వేసవి సెలవుల విహారాలు !

కొంచెం అటూ ఇటూగా ఫిబ్రవరి నెలలో మొదలై, వేసవి కాలం భారత దేశంలో జూన్ నెల చివరి వరకూ వుంటుంది. ఇటీవలి కాలంలో కొన్ని సంవత్సరాలనుండి భౌగోళిక ఉష్ణోగ్రతలు కూడా అధికం అయ్యాయి. మరొక విషయం ఏమంటే, ఇదే సమయంలో విద్యార్ధులు తమ వార్షిక పరీక్షలు కూడా పూర్తి చేసి, దీర్ఘ కాలిక సెలవులు పొందుతారు. ఒకవైపు వేసవి వేడి మరోవైపు అనేక రోజుల సెలవులు. రెండూ చేరి మొత్తంగా కుటుంబ సభ్యులను హిల్ స్టేషన్ లకు లేదా, ఇతర చల్లని ప్రదేశాలకు వెళ్ళాలనే కోరిక పుట్టిస్తాయి. ఇంటివద్దే వుంటే, వేడికి కూర్చోలేము, నిల్చో లేము. ఎక్కడికైనా చల్లని ప్రదేశానికి తప్పక వెళ్ళాలనిపిస్తుంది. బహుశ ప్రకృతి మాత మానవుడి ఈ పరిస్థితి గ్రహింఛి కొన్ని చల్లటి ప్రదేశాలను కూడా వేసవిలో అందించినదని భావించవచ్చు. అక్కడక్కడ భూమిపై, చల్లని ఆహ్లాదకర ప్రదేశాలైన హిల్ స్టేషన్ లు, కాశ్మీర్ వంటి లోయలు సృష్టించింది. మరి అటువంటి చల్లని ప్రదేశాలు ఎక్కడ వున్నాయి అనేది పరిశీలిద్దాం.

నుబ్ర వాలీ

నుబ్ర వాలీ

బహుశ నుబ్రా లోయ గురించి మీరు వినే వుంటారు. ఈప్రదేశం వేసవిలో చల్లగా వుండి ఆనందిన్చదగినదిగా వుంటుంది. దీని అసలు పేరు దుమ్రా వాలీ. అంటే ఒక పూల తోట అని అర్ధం చెపుతారు. ఈ ప్రదేశం లడఖ్ ప్రాంతానికి ఈశాన్య దిశగా వుంది. లడఖ్ జిల్లా కు రాజధాని పట్టణమైన లెహ్ నగరానికి ఉత్తర దిశగా సుమారు 150 కి. మీ. ల దూరంలో వుంటుంది. నుబ్రా వాలీకి వెళ్ళాలంటే, ప్రపంచం లోనే అతి ఎత్తైన రోడ్డు కల ఖడుర్గా లా పాస్ గుండా చేరాలి .


ఫోటో క్రెడిట్ : Raghavan V Show Thumbnail

 ఖజ్జియార్

ఖజ్జియార్

ఖజ్జియార్, హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో కల డళ్హౌసి సమీపంలో కల ఒక సుందరమైన హిల్ స్టేషన్. ఇది ఒక చిన్న హిల్ స్టేషన్ మధ్యలో ఒక అందమైన సరస్సు, చుట్టూ పచ్చని చెట్లు, వుండి ఆహ్లాదకరంగా వుంటుంది. ఇక్కడ నుండి పశ్చిమ హిమాలయ పర్వత శ్రేణులను చూసి ఆనందించవచ్చు. సమీపంలోని వన్య జీవుల అభయారణ్యం కూడా చూడవచ్చు.
ఫోటో క్రెడిట్ : Sandeep Brar Jat

 తవాంగ్

తవాంగ్

తవాంగ్, భారత దేశంలోని అరుణాచల ప్రదేశ రాష్ట్రంలో కలదు. ఇక్కడ ఒక అతి పెద్ద బౌద్ధ ఆరామం కలదు. ఈప్రదేశంలో అత్యంత నేర్పుతో చేసిన హస్తకళా వస్తువులు లభిస్తాయి. ఇక్కడి జాంగ్ జలపాతాలు ఎగిసి పడుతూ పర్యాటకులను ఆకర్షిస్తాయి. మంచుతో ఘనీభవించిన ఒక అందమైన సరస్సు ఆహ్లాదకర వాతావరణాన్ని మీకు అందిస్తుంది.
ఫోటో క్రెడిట్ : rajkumar1220

 చిరపుంజి

చిరపుంజి

సంవత్సరం లో అధిక భాగం వర్షాలు పడే చిరపుంజి ప్రదేశాన్ని గురించి తెలియని వారుండరు. చల్లటి వాతావరణంతో వేసవిలో కూడా ఈ ప్రదేశం టూరిస్ట్ లను ఆకర్షిస్తూ వుంటుంది. చిరపుంజి మేఘాలయ రాష్ట్రంలో కలదు. ఈ ప్రదేశం ప్రపంచంలో రెండవ అత్యధిక తేమగల ప్రదేశంగా గుర్తించబడింది.

 కాలిపొంగ్

కాలిపొంగ్

కాలిపొంగ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మహాభారత కాలంనాటి పర్వత శ్రేణుల లో కలదు. ఇది ఒక అతి సుందరమైన పట్టణం. వేసవిలో విహార ప్రదేశంగా పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ కల తీస్తా నది ప్రవాహం, పూవులా మార్కెట్, వన్య జీవుల సంచారం, మొదలైనవి ఆనందించవచ్చు. ఫోటో క్రెడిట్ : Anuj Kumar Pradhan

 హార్స్లీ హిల్స్

హార్స్లీ హిల్స్

హార్స్లీ హిల్స్ ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లాలో కల మదనపల్లి సమీపంలో కలవు. వేసవి తాపానికి ఈ కొండల ప్రదేశం సరైన పరిష్కారం కాగలదు. ఈ ప్రదేశానికి వేసవిలో అనేక మంది టూరిస్టులు వచ్చి ఇక్కడ కల ఆహ్లాదకర వాతావరణాన్ని అనుభవిస్తారు. హార్స్లీ హిల్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ కల గుల్మోహార్ చెట్లు, గంగోత్రి సరస్సు,సాహసికులను ఆకర్షించే ఎత్తైన సుందర ప్రదేశాలు ప్రత్యేక ఆకర్షణలు.
ఫోటో క్రెడిట్ : Henri Bergius

 కద్మత్ ఐలాండ్

కద్మత్ ఐలాండ్

వేసవి అనగానే హిల్ స్టేషన్ లు, ఇతర చల్లని ప్రదేశాల విహారానికే వెళ్ళ నవసరం లేదు. సముద్రపు తీరాలలో కల కద్మత్ ద్వీపం, ప్రసిద్ధి చెందిన లక్ష ద్వీప సముదాయాలలో ఒకటి. ఇక్కడ కల సాహస క్రీడలు, స్కూబా డైవింగ్, స్నోర్కేలింగ్ వంటివి అద్భుత సెలవు ఆనందాలను కలిగిస్తాయి. ఫోటో క్రెడిట్ : Manvendra Bhangui

 యర్కాడ్

యర్కాడ్

యర్కాడ్ హిల్ స్టేషన్ తమిళ్ నాడు లోని సేలం పట్టణం సమీపంలో కలదు. ఈ హిల్ స్టేషన్ ను దక్షిణ దేశ రత్నం అంటారు. ఈ హిల్ స్టేషన్ చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ బోటు విహారం కూడా ఆనందించవచ్చు. హిల్ స్టేషన్ మధ్యలో ఒక చిన్న సరస్సు చుట్టూ పచ్చని తోటలతో ఆకర్షనీయం గా వుండి పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తుంది.

ఫోటో క్రెడిట్ : Mithun Kundu

 పోన్ముడి

పోన్ముడి

'బంగారు కొమ్ము' గా ప్రసిద్ధి చెందిన పోన్ముడి హిల్ స్టేషన్ కేరళ లోని పడమటి కనుమలలో కల ఒక అతి సుందరమైన ప్రదేశం. తిరువనంతపురం జిల్లాలో కల ఈ పోన్ముడి హిల్ స్టేషన్ యొక్క ప్రాకృతిక సౌందర్యాలు, మనస్సులను రంజింప చేసి ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. లెక్కకు మించిన వన్య జంతువులు, స్వేచ్చగా విహరించే పక్షి సంపద కల ఈ ప్రదేశం నుండి పడమటి కనుమలలోని ఎత్తైన శిఖర శ్రేణి అందాలను చూపుతుంది.

ఫోటో క్రెడిట్ : vishwaant

 గోకర్ణ

గోకర్ణ

ఉత్తర కర్నాటక రాష్ట్రంలో కల గోకర్ణ ఒక ప్రసిద్ధ మతపర మరియు విహార ప్రదేశం. ఇక్కడ కల ప్రశాంత సముద్ర తీరం మరోవైపున కల పడమటి కనుమల రమణీయ దృశ్యాలు మనస్సులను ఆహ్లాద పరుస్తాయి. కుడ్లె బీచ్, ఓం బీచ్, హాఫ్ మాన్ బీచ్ మొదలైనవి ఇక్కడి ప్రసిద్ధ బీచ్ తీరాలు.
ఫోటో క్రెడిట్ : Axis of eran

 మాపూసా

మాపూసా

మాపూసా, ఉత్తర గోవా లోని ఒక ప్రసిద్ధ పర్యాటక పట్టణం. ఈ పట్టణం కొన్ని ప్రసిద్ధ బీచ్ లకు నిలయం. ఇక్కడి స్థానిక మార్కెట్ లు, స్థానిక ప్రజల సంస్కృతి, రుచికర ఆహారాలు, మీ వేసవి సెలవుల సమయాన్ని రసవత్తరం చేస్తాయి.

ఫోటో క్రెడిట్ : Aaron C

 ఆలీబాగ్

ఆలీబాగ్

మహారాష్ట్రలోని కొంకణ ప్రదేశంలో కల ఒక సుందర సముద్ర తీర పట్టణవే ఆలీబాగ్. సముద్ర తీరాలు, దేవాలయాలు, కల ఈ పట్టణం టూరిస్ట్ లను అధికంగా ఆకర్షిస్తుంది. సముద్ర తీరంలోని నల్లటి ఇసుక, ప్రశాంత వాతావరణం మిమ్మల్ని ఇక్కడ ఆనందింప చేస్తాయి.

ఫోటో క్రెడిట్ : Vijay yerzal

మౌంట్ అబూ

మౌంట్ అబూ

సాధారణంగా, రాజస్థాన్ రాష్ట్రం వేడి ప్రదేశం. అయినప్ప్పటికి వేసవిలో మన మనస్సులను ఆహ్లాద పరిచే వాతావరణం కల ఒక సుందరమైన హిల్ స్టేషన్ కలిగి వుంది. అదే మౌంట్ అబూ హిల్ స్టేషన్. ఆరావళి పర్వత శ్రేణులలో కల ఈ మౌంట్ అబూ హిల్ స్టేషన్ 'ఎడారిలో ఒయాసిస్సు ' వంటిది గా చెప్పవచ్చు. ఒయాసిస్ అంటే అపురూపంగా లభించే ఒక ప్రయోజనం గా చెప్పాలి.

ఫోటో క్రెడిట్ : CorrectKnowledge

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X