Search
  • Follow NativePlanet
Share
» »బాహుబలి సినిమాలోని మాహిష్మతి రాజ్యం ఎక్కడుందో మీకు తెలుసా?

బాహుబలి సినిమాలోని మాహిష్మతి రాజ్యం ఎక్కడుందో మీకు తెలుసా?

మహేశ్వర్ యొక్క పూర్వపు నామం మాహిష్మతిగా పిలిచేవారట. మహేశ్వర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కార్గోన్ జిల్లాలో వుంది.

By Venkata Karunasri Nalluru

మాహిష్మతి పేరు వింటే మనకు బాహుబలి సినిమా గుర్తుకు వస్తుంది. కానీ ఆ పేరు వున్న పట్టణాన్ని చూడాలంటే మాత్రం మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ కి వెళ్ళాల్సిందే !మహేశ్వర్ యొక్క పూర్వపు నామం మాహిష్మతిగా పిలిచేవారట.రామాయణ, మహాభారతాల్లో ఈ మాహిష్మతి సామ్రాజ్యపు ప్రస్తావన వుందంట.ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కార్గోన్ జిల్లాలో వుంది. ఇండోర్ నుండి కేవలం 91 కి.మీ దూరంలో ఈ పట్టణం వుంది. నర్మదా నదికి సమీపంలో వున్న సహస్రార్జున మందిరాన్ని దర్శిస్తే ఆ కాలంనాటి కట్టడాలు, గోపురాలు, మనకు ఆ కాలం యొక్క గొప్పదన్నాన్ని తెలియచేస్తాయి.

ప్రపంచంలోనే అతి పెద్దదైన మహిళా మార్కెట్ ఎక్కడుందో మీకు తెలుసా ?ప్రపంచంలోనే అతి పెద్దదైన మహిళా మార్కెట్ ఎక్కడుందో మీకు తెలుసా ?

ఈ ప్రాచీన పట్టణాన్ని కార్త్యవీర్యార్జునుడు తన రాజ్యానికి రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడట. ఇప్పటికీ మహేశ్వర్ లోని సహస్రార్జున దేవాలయంలో 11 అఖండ దీపాలు నాటి నుండి నేటి వరకు వెలుగుతూ వుండటం విశేషం. మరి దీనివెనుక రావణాసురునికి సంబంధించి ఒక ఆసక్తికరమైన చారిత్రాత్మక కథనం మరి 18వ శతాబ్దంలో మరాటా రాణి, రాజమాత అహల్యాబాయి హోల్కర్ తన భర్త మరణం అనంతరం మాహిష్మతి సామ్రాజ్యాన్ని నడిబొడ్డుగా చేసుకుని ఇక్కడ నుండే మాల్వా దేశాన్ని పరిపాలించారట.

రోజులో కాసేపు మాత్రమే కనిపించే దేవాలయం ! ఎక్కడుందో మీకు తెలుసా?

మహేశ్వర్ యొక్క పూర్వపు నామం మాహిష్మతిగా పిలిచేవారట.

1. అహల్యాదేవి

1. అహల్యాదేవి

శివభాక్తురాలైన అహల్యాదేవి ఎన్నో శివాలయాలను పునరుద్ధరించారు. వాటిలో గుజరాత్ లోని ఉజ్జయిని, గయ లాంటి ఆలయాలు వున్నాయి. మరి నర్మదా నది ఒడ్డున నిలబడి అహల్యాభాయి కోటను చూస్తే అందమైన చిత్రకారుడు గీసిన చిత్రపటంలా ఉంటుందట.

Photo Courtesy: Arjun Valsaraj

2. మాహిష్మతి రాజ్యం

2. మాహిష్మతి రాజ్యం

సహస్రార్జుని తర్వాత నిషాదరాజ్యపు రాజు మాహిష్మతి రాజ్యాన్ని చేజిక్కించుకుని పరిపాలించాడట. కురుక్షేత్ర యుద్ధ అనంతరం ధర్మరాజు రాజ్యానికి రాజయ్యాక ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని యుద్ధాన్ని ప్రారంభించాడట. కానీ వారు హస్తగతం చేసుకోలేకపోయారు. అప్పుడు తమ్ముడైన సహదేవుడి సహకారంతో పాండవులు మాహిష్మతి రాజ్యాన్ని తమ రాజ్యంలో కలిపేసుకున్నారట. ఇలా ఆర్యావర్తంలో మాహిష్మతి ఈశ్వరుని పేరుతో మహేశ్వర్ గా మారింది.

Photo Courtesy: Nilrocks

3. మాహిష్మతి చీరలు

3. మాహిష్మతి చీరలు

ఇక్కడ నేయబడిన మాహిష్మతి చీరలు చాలా అందంగా నేయబడి చాలా ప్రసిద్ధి గాంచినవి. ఇక్కడ విలక్షణమైన నమూనాలతో మరియు ఆకర్షణీయమైన రంగులతో నూలు చీరలు నేస్తారు. ఈ ప్రదేశం కొనుగోళ్లకు పుట్టినిల్లువంటిది. ఇక్కడ శీతాకాలంలో జరిగే రంగులతో నిండి ఉన్న గంగాలేశ్వర్ ఉత్సవాలను చూడటానికి ప్రతి సంవత్సరం వందల కొద్ది యాత్రికులు వస్తుంటారు.

Photo Courtesy: Telugu Nativeplanet

4. మహేశ్వర్ లో ఉన్న మరియు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

4. మహేశ్వర్ లో ఉన్న మరియు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

మహేశ్వర్ పర్యాటక రంగ ప్యాకేజీలు వారసత్వ సైట్లతో ఆకర్షణ గొలుపుతూ ఉంటాయి. అది కోటలు, కనుమలు, రాజ భవనాలు, ఆలయాలు లేదా ఏ ఇతర సైట్ అయిన అవనీయండి, మహేశ్వర్ వద్ద పర్యాటకులు వాటి అందాలను ఆస్వాదించడానికి భారీ సంఖ్యలో ఉంటారు. మహేశ్వర్ లో వారసత్వం కోసం వివిధ ప్రామాణికాలతో అమార్చిన ప్రత్యేకమైన నిర్మాణకళను చూసి పర్యాటకులు ఆశ్చర్యపడుతున్నారు.

Photo Courtesy:Jean-Pierre Dalbéra

5. మహేశ్వర్ - దైవ సంబంధం మరియు వేడుకలు

5. మహేశ్వర్ - దైవ సంబంధం మరియు వేడుకలు

మహేశ్వర్ లో శివుడి దేవాలయాలు అనేకం ఉన్నాయి మరియు ఈ ప్రదేశం యొక్క పేరును అనువదిస్తే " స్వామి మహేష్ ని స్వర్గం" అని చెప్పవొచ్చు, శివుడికి ఇంకొక పేరు మహేశుడు. ఈ ప్రదేశం ప్రాచీనకాలం నుంచి వేల ప్రజల తీర్థయాత్రా కేంద్రంగా ఉన్నది.

Photo Courtesy: ECHOES IN THE WONDERLAND

6. పండుగలు

6. పండుగలు

దీనిని దర్శించే యాత్రికులు ఒక పవిత్రమైన భావంతో నర్మదా నదిలో స్నానం చేస్తారు మరియు మహేశ్వర్ లో ఉన్న ఆలయాలను దర్శించుతారు. ఈ పట్టణంలో నిస్సందేహంగా పండుగలు ఉత్సాహభరితంగా మరియు ఆసక్తితో జరుపుకుంటారు. మహా మృత్యుంజయ రథయాత్ర, గణేషుని మరియు నవరాత్రి పండుగలు, ఇక్కడ జరుపుకునే పండుగలలో కొన్ని.

Photo Courtesy: Telugu Nativepalnet

7. మహేశ్వర్ ఎలా చేరుకోవాలి?

7. మహేశ్వర్ ఎలా చేరుకోవాలి?

ఇండోర్ నుండి మహేశ్వర్ కు చేరుకోవటానికి 3 గంటల సమయం పడుతుంది. మధ్య ప్రదేశ్ లోని ముఖ్య నగరాల నుండి మహేశ్వర్ కు చేరుకోవటానికి బస్సు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది.

విమాన మార్గం: ఇండోర్ విమానాశ్రయం, మహేశ్వర్ నుండి 85 కి మీ. దూరంలో ఉన్నది మరియు ఈ ప్రదేశానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం. విమానాశ్రయం నుండి మహేశ్వర్ కు టాక్సీలు మరియు బస్సుల ద్వారా సులభంగా చేరుకోవొచ్చు. కావున, ప్రయాణికులు విమాన మార్గం ద్వారా రెండు గంటలలోనే ఇండోర్ మరియు మహేశ్వర్ మధ్యన ఉన్న దూరాన్ని పూర్తి చేయవొచ్చు.

రైలు మార్గం: మహేశ్వర్ లో రైల్వే స్టేషన్ లేదు. మహేశ్వర్ కి 66 కి. మీ. దూరంలో ఇండోర్ రైల్వే స్టేషన్ ఉన్నది. అది ఒక ప్రధాన రైల్వే స్టేషన్ అవటం వలన, రైళ్ల రాకపోకలు మరియు కనెక్టివిటీ మార్గం ఉత్తమంగా ఉన్నాయి. ఇండోర్ నుండి మిగిలిన దూరాన్ని టాక్సీలు మరియు బస్సుల ద్వారా చేరుకోవొచ్చు. మహేశ్వర్ కి చేరువలో ఉన్న మరి కొన్ని రైల్వే స్టేషన్ లు బార్వాహ (39 కి.మీ.), ఖాండ్వా (110 కి.మీ.) లు.

రోడ్డు మార్గం: మధ్య ప్రదేశ్ లోని అన్ని ముఖ్య నగరాల నుండి మహేశ్వర్ ను సులభంగా మరియు సౌకర్యవంతంగా చేరుకోవొచ్చు. మహేశ్వర్ లో రోడ్ రవాణా చాలా బాగా నిర్వహిస్తున్నారు. మధ్య ప్రదేశ్ లో ఉన్న ఏ ఇతర ప్రదేశం నుండైన మహేశ్వర్ ప్రైవేటు మరియు పబ్లిక్ బస్సుల ద్వారా సులభంగా చేరుకోవొచ్చు. టాక్సీల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

Photo Courtesy: Prashanth Sampagar

8. మహేశ్వర్ ను దర్శించటానికి అనుకూల కాలం

8. మహేశ్వర్ ను దర్శించటానికి అనుకూల కాలం

మహేశ్వర్ ను దర్శించటానికి శీతాకాలంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఇక్కడికి వొచ్చినప్పుడు, మీ ఆడవారి కోసం కాటన్ చీరలు కొనుగోలు చేయటం మర్చిపోవొద్దు.

Photo Courtesy: Jean-Pierre Dalbéra

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X