» »పాపాల్ని హరించే మహా కాళేశ్వరుడు వెలిసిన ఉజ్జయిని గురించిన నిజాలు !

పాపాల్ని హరించే మహా కాళేశ్వరుడు వెలిసిన ఉజ్జయిని గురించిన నిజాలు !

Posted By: Venkata Karunasri Nalluru

ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉజ్జయిని అంటే ఒక అద్భుతమైన విజయం సాధించినవాడు అని అర్థం. ఇక్కడ ఉన్న పురాతన దేవాలయాలు దేశంలో నలుమూలల భక్తులను ఆకర్షిస్తున్నవి. ఈ నగరం శిప్రా నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ ఉన్న కొన్నిప్రసిద్ధ ఆలయాలు చింతమన్ గణేష్ టెంపుల్, బడే గణేష్ జి కా మందిర్, హర్సిద్ధి ఆలయం, విక్రమ్ కీర్తి మందిర్, గోపాల్ మందిర్ మరియు నవగ్రహ మందిర్. మహాకాలేశ్వర్ ఆలయం నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ ఉన్నశివాలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయాన్ని ఐదు స్థాయిలలో విభజించారు మరియు గణేష్, ఓంకారేశ్వర్ శివ, పార్వతి, షణ్ముఖుడు మరియు నంది విగ్రహాలు ఉన్నాయి.

నగరానికి దగ్గరలో ఇండోర్ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం, ఉజ్జయినికి కేవలం 55 కి.మీ. దూరంలో ఉన్నది. ఉజ్జయిని రైల్వే స్టేషన్ భారతదేశంలోని అన్ని పెద్ద నగరాలకి అనుసంధించబడింది. ప్రయాణికులు ముంబై, భోపాల్, ఢిల్లీ, ఇండోర్, ఆహ్మదాబాద్ మరియు ఖజురహో నుండి బస్సుల ద్వారా ఉజ్జయిని చేరుకోవచ్చు. ఇండోర్, భోపాల్, కోట మరియు గ్వాలియర్ నుండి ఉజ్జయినికి రోజువారి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఉజ్జయిని రైల్వే స్టేషన్ దగ్గరలో మీ బడ్జెట్ కు తగ్గట్టుగా హోటళ్ళు ఉన్నాయి. ఉజ్జయినిలో వేసవిలో తీవ్రమైన ఎండలు మరియు శీతాకాలంలో వణుకు పుట్టించే చలిగా ఉంటుంది.

ఉజ్జయిని దర్శించటానికి ఉత్తమ సమయం

ఈ నగరాన్ని దర్శించటానికి అక్టోబర్ మరియు మార్చ్ నెలల మధ్య అనుకూలంగా ఉంటుంది.

పాపాల్ని హరించే మహా కాళేశ్వరుడు వెలిసిన ఉజ్జయిని

1. మహాకాళేశ్వరం

1. మహాకాళేశ్వరం

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశిష్టమైనది. ఇక్కడ మహాకాళేశ్వరుడు మంత్రశక్తితో స్వయంభువుగా వెలశాడు. ఈ ఆలయంలో తెల్లవారుజామున భస్మహారతి విశిష్టంగా జరుగుతుంది. ఈ భస్మహారతిని తిలకిస్తే అకాల మృత్యుభయాలుండవు. అందువల్ల ఈ క్షేత్రాన్ని మహాస్మశానమని కూడా పిలుస్తారు.

PC : Ssriram mt

2. బడా గణపతి ఆలయం

2. బడా గణపతి ఆలయం

'బడా గణపతి' ఆలయం 25 అడుగుల ఎత్తు వుంది. ఇక్కడ వినాయకుడు ఆంజనేయస్వామి వలె కాషాయరంగులో ఉంటాడు. ఈ ఆలయము మహాకాళేశ్వర మందిరానికి దగ్గరగా ఉంటుంది. వినాయకునికి సిద్ది, బుద్ది ప్రార్ధన చేస్తున్నట్లు ఇరువైపులా వున్నారు.

PC : Ujjain.travel

3. హరసిద్ధి ఆలయం

3. హరసిద్ధి ఆలయం

హరసిద్ధి ఆలయం మహాకాళేశ్వర మందిరానికి దగ్గరలోనే వుంది. ఇక్కడ అమ్మవారి అనుగ్రహం కోసం చంద్రగుప్త విక్రమాదిత్యుడు 11 సార్లు తనకు తాను ఆత్మార్పణ చేసుకుని అమ్మవారి అనుగ్రహంతో 11 సార్లు పునర్జీవుడవుతాడు.

PC :Bernard Gagnon

4. చార్ ధామ్ ఆలయం

4. చార్ ధామ్ ఆలయం

విశాలమైన ఆవరణలో చలువరాతితో నూతనంగా నిర్మించిన ఆలయం. ఈ ఆలయంలో బదరీనారాయణుడు, కాశీ విశ్వేశ్వరుడు, రామలింగేశ్వరుడు, ద్వారక కృష్ణుని మందిరాలు వున్నాయి.

PC :Gyanendrasinghchauha

5. శ్రీ చింతామణి గణేష్

5. శ్రీ చింతామణి గణేష్

ఇక్కడ వినాయకుడే స్వయంగా వెలిశాడని చెప్తారు. ఈ దేవాలయం ఉజ్జయినికి దగ్గరలో ఉన్న ప్రసిద్ధ ఆలయం. కొత్తగా పెళ్లయినవాళ్ళు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే సుఖ సంతోషాలతో, సిరులతో జీవిస్తారని చెప్తారు.

PC : V.narsikar

6. శ్రీ హరగోపాల్ మందిరం

6. శ్రీ హరగోపాల్ మందిరం

శ్రీ హరగోపాల్ మందిరం చాలా పురాతనమైన ఆలయం. హరసిద్ధ ఆలయం నుండి సుమారు కిలోమీటరు దూరంలో వున్నది. ఇక్కడ పరమేశ్వడు, రాధాకృష్ణుల విగ్రహాలు వుంటాయి. ఇందులోని కృష్ణుడు చాల అందంగా వుంటాడు.

PC :Bernard Gagnon

7. శ్రీ సిద్ధవట్

7. శ్రీ సిద్ధవట్

శ్రీ సిద్ధవట్ శిప్రానది ఒడ్డున ఉన్నది. ఇక్కడ కుమారస్వామి తపస్సు చేసిన 20 అడుగుల ఎత్తువున్న రావిచెట్టు ఉంది. ఈ రావిచెట్టునే సిద్దవటం అని అంటారు. దీని మహత్యం ఏమంటే ఈ వృక్షం దగ్గర కోరిక చెప్పి తాడు కడితే అది జరుగుతుందని అంటారు. ఈ క్షేత్రంలో గణపతి, కుమారస్వామి, పార్వతిదేవి ఆలయాలు వున్నాయి.

PC :Bernard Gagnon

8. శ్రీ భర్త్రుహరి గుహలు

8. శ్రీ భర్త్రుహరి గుహలు

ఇక్కడ ఒక సందులో నుండి గుహలోకి ప్రవేశించాలి. ఈ గుహలు ఉజ్జయినికి సుమారు 7కి.మీ.దూరంలో వున్నాయి. భర్త్రుహరి విక్రమాదిత్యునికి అన్న అవుతాడు. భర్త్రుహరి కొంతకాలం రాజుగా రాజ్యాన్ని పరిపాలించిన పిదప వైరాగ్యంతో రాజ్యాధికారాన్ని వదులుకుని ఈ గుహలో తపస్సు చేశాడట. ఇప్పుడు ఈ గుహలలో సాధువులు నివశిస్తున్నారు.

PC :Shadow Ayush

9. శ్రీ మంగళనాథ్ మందిరం

9. శ్రీ మంగళనాథ్ మందిరం

శ్రీ మంగళనాథ్ ఆలయం చిన్నకొండమీద వుంటుంది. ఆలయం చేరుకోవాలంటే మెట్లెక్కి వెళ్ళాలి. గర్భాలయంలో వున్న శివలింగానికి వెనుక భాగాన పార్వతి దేవి, వినాయకుడు విగ్రహాలు వున్నాయి. భూదేవి కుమారుడైన అంగారకుడు (కుజుడు) ఇక్కడే జన్మించాడని చెప్తారు. మంగళవారం విశేషపూజలు జరుగుతాయి. ఈ రోజున ఇక్కడకు చాలమంది భక్తులు వస్తారు.

PC :V.narsikar

10. త్రివేణి సంగమం

10. త్రివేణి సంగమం

ఉజ్జయినిలోని త్రివేణి సంగమంలో జంతర్ మంతర్ వున్నది. జంతర్ మంతర్ అంటే ఇక్కడ ఖగోళశాస్త్రానికి సంబందించిన పరిశోధనలు జరుగుతాయి. ఇక్కడ గ్రహణాలు సంభవించే రోజులు మరియు సమయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చును.

PC : Gyanendra_Singh_Chau...

11. శ్రీ కాలభైరవుని ఆలయం

11. శ్రీ కాలభైరవుని ఆలయం

కాలభైరవుని గర్భాలయానికి ముందు కుక్క విగ్రహం దర్శనమిస్తుంది. ఇక్కడ మద్యాన్ని ఒక ప్లేటులో పోసి కాలభైరవుని నోటి దగ్గర పెడతారు. మనం చూస్తూ వుండగానే ఎన్నో సీసాల మత్తు పానీయం లోపలకు వెళ్తుంది. భక్తులు ప్రసాదంగా ఆమత్తు పానీయాన్ని తీసుకు వెళతారు.

PC : K.vishnupranay

12. క్షిప్రానది

12. క్షిప్రానది

క్షీరసాగర మదనంలో దొరికిన అమృత భాండాన్ని దేవతల నుండి దొంగలించి తీసుకువెళ్ళాలని రాక్షసులు చేసిన ప్రయత్నంలో అమృతకలశం నుండి 4 చుక్కలు భూమి మీద పద్దాయి. అందులో ఒకటి ఉజ్జయినిలో పడగా మిగిలినవి నాసిక్, ప్రయాగ, హరిద్వార్ లో పడినవి. అందువలన ఉజ్జయినిలోని శిప్రానదిలో చేసిన స్నానం మోక్షాన్ని యిస్తుందని భక్తుల నమ్మకం.

PC :Gyanendra_Singh

13. శ్రీ సాందీపని ముని ఆశ్రమ౦

13. శ్రీ సాందీపని ముని ఆశ్రమ౦

ఉజ్జయినికి 4 కి.మీ. దూరంలో వున్న శ్రీ సాందీపని ముని ఆశ్రమ౦లో హుండీశ్వర ఆలయం వున్నది. ఎక్కడా చూడని విధంగా ఈ ఆలయంలోని శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు నిలబడి వుంటాడు. ఈ ఆలయానికి వెనుక వైపున ఒక మ్యూజియం వున్నది. అందులో శ్రీకృష్ణభగవానుని జీవిత చరిత్ర అంతా చిత్రాల రూపంలో వున్నది. మ్యూజియానికి ఎదురుగా గోమతికుండ్ సమీపంలో సర్వేశ్వరాలయం వున్నది.

PC : Gyanendra_Singh_