Search
  • Follow NativePlanet
Share
» »మాన్సూన్ ట్రెక్కింగ్ చిట్కాలు !

మాన్సూన్ ట్రెక్కింగ్ చిట్కాలు !

By Mohammad

ఎండాకాలం ముగిసింది .. మాన్సూన్ సీజన్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా ? అని ఒకవైపు రైతులు గంపెడాశలతో ఎదురు చూస్తుంటారు. మరో వైపు పర్యాటకులు ఎప్పుడెప్పుడు తడిసి ముద్దైన ప్రకృతిలో పరవశి ద్దామా అని ఆలోచిస్తుంటారు. ఎవరికైనా మాన్సూన్ అంటే ఇష్టముండద మీరే చెప్పండి ? ఈ సమయంలో ప్రకృతి తన అందాల్ని విచ్చుకొని పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

పర్యాటకులు ఈ మాన్సూన్ సీజన్ లో జలపాతాలవైపు, హిల్ స్టేషన్ ల వైపు వెళ్ళటానికి ఆసక్తి ని కనబరుస్తుంటారు, ట్రెక్కింగ్ చేయటానికి ఇష్టపడుతుంటారు. తాజా వర్షంలో తడిసిన ప్రకృతిని కళ్ళు ఆర్పకుండా, వీలైతే ఆ వర్షంలో నిలబడి మరీ .. చూస్తుంటారు.

ఇక్కడ చెప్పబోయే మాన్సూన్ చిట్కాలు మీ మాన్సూన్ ట్రెక్కింగ్ ప్రయాణాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని అనుసరిస్తూ మీ పర్యటన లను పూర్తి చేయండి.

మాన్సూన్ లో లోనవాలా

మాన్సూన్ లో లోనవాలా

చిత్ర కృప : ptwo

పరిశోధన ముఖ్యమైన 'కీ'

పరిశోధన అంటే ఏదో ల్యాబ్ అనుకొనేరు. వెతకడం అని అర్థం. ముందుగా ఎక్కడికి వెళ్ళాలో నిర్ధారించుకోవాలి. అతరువాత రూట్ మ్యాప్ సిద్దం చేసుకోవాలి. మీరు ట్రెక్కింగ్ కు వెళ్ళే ప్రదేశం అనువైనదా ? కాదా ?? అని గైడ్ సహాయంతో తెలుసుకోవాలి. వసతి కై బేస్ క్యాంపు లు ఉన్నాయా ? లేదా ? ఉంటె మీ బడ్జెట్ తగ్గట్టు వసతి సదుపాయాలు ఇస్తున్నారా ? లేదా ? అనేవి తెలుసుకుంటే ఉత్తమం.

వాతావరణం చెక్ చేయండి

వాతావరణం అనుకూలిస్తేనే ట్రెక్కింగ్ యాత్ర చేయటానికి ముందుకు కదలండి లేకపోతే వద్దు. కొండ పైకి వెళ్ళేటప్పుడు జారిపడే అవకాశం ఎక్కువ కనుక గ్రూప్ గా వెళ్ళేటప్పుడు ఒకరి చేతులు ఒకటి పట్టుకొని వెళ్ళండి. వీలైనంత వరకు వాతావరణం కుదుటపడ్డాకే ట్రెక్కింగ్ కు బయలుదేరండి. మాన్సూన్ సీజన్ లో, హిమాలయ పరివాహక ప్రాంతాలలో ట్రెక్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్త !! వాతావరణం ఎప్పుడు మారిపోతుందో అస్సలు తెలీదు.

సిన్హఘడ్ ఫోర్ట్

సిన్హఘడ్ ఫోర్ట్

చిత్ర కృప : rohit gowaikar

లిస్టు మీ వద్ద పెట్టుకోండి

మీరు ఏమేమి తీసుకెళ్ళా లో లిస్టు ముందుగానే సిద్ధం చేసుకోండి. ట్రెక్కింగ్ షూ తప్పనిసరి. లెస్ ఉన్న షూ సూచించదగినది. అలాగే ప్రధమ చికిత్స పెట్టె ( ఫస్ట్ ఎయిడ్ కిట్), టార్చ్, వాటర్ ప్రూఫ్ జాకెట్, ప్యాకెట్ లలో రెడీ గా ఉన్న ఆహార పొట్లాలు, ఫిల్టర్ నీళ్ళు మీ వెంట తీసుకెళ్ళండి. పేపర్ మ్యాప్ ను మీతో పాటు తీసుకొని వెళ్ళటం మరీ మంచిది. ఎక్కడున్నామో ? ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది.

స్మార్ట్ గా ప్యాక్ చేయండి

పర్యటన చేసే ప్రతి ప్రయాణీకుడికి ఇది కామన్. ట్రెక్కింగ్ చేసే వారికీ తప్పనిసరి. తక్కువ లగేజీతో బ్యాగ్ తీసుకెళ్లటం సూచించదగినది. కనుక అవసరమైన వస్తువులను మాత్రమే బ్యాగ్ లో పెట్టుకోండి (ఫుడ్ ఐటమ్స్, బాటిల్ మొదలైనవి).

సౌకర్యవంతమైన బట్టలను వేసుకోండి

సాఫ్ట్ గా ఉండే కాటన్ దుస్తులను ధరించండి అవైతే తొందరగా డ్రై అయిపోతాయి అలాగే మీ శరీరానికి వెచ్చదనం ఇచ్చేవా ? కాదా ? కూడా సరిచూడండి. వీలైతే, కాటన్ దుస్తులను లోపల ధరించి, బయట జర్కిన్ లేదా రెయిన్ కోట్ తోడుక్కోండి.

తమ్హిని ఘాట్

తమ్హిని ఘాట్

చిత్ర కృప : Ankur P

గైడెన్స్ లేకుండా వెళ్ళవద్దు!

మీరు గ్రూప్ గా వెళ్ళేటప్పుడు అందులో ఒకరైనా ఆ ప్రదేశం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి, లేపోతే వద్దు. ఒంటరిగా వెళితే గైడ్ సహాయం తీసుకోవడం లేదా అతని సూచనలను పాటిస్తూ ట్రెక్ చేయటం శ్రేయస్కరం.

భద్రత అనేది తప్పనిసరి

మీరు ఎంచుకొనే ప్రాంతం సురక్షిత ప్రాంతం కానట్లయితే అక్కడి అధికారుల అనుమతి తప్పనిసరి. ఉదాహరణకి మీరు ఆటవీ ప్రాంతాన్ని ఎంచుకుంటే, అటవీ అధికారుల అనుమతి తీసుకోవాలి.

ట్రెక్కింగ్ చిట్కాలు మీ భయాలను, అపోహాలను తొలగిస్తాయి. సరైన ప్లాన్ వేసుకొని అమలుపరచండి ; మాన్సూన్ సీజన్ లో చేసే ట్రెక్కింగ్ సాహసాలను సంతోషంగా అనుభవించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X