Search
  • Follow NativePlanet
Share
» »రాక్షసుడు ప్రతిష్టించిన శివలింగం ఇప్పుడు ప్రధాన పుణ్యక్షేత్రం

రాక్షసుడు ప్రతిష్టించిన శివలింగం ఇప్పుడు ప్రధాన పుణ్యక్షేత్రం

వాయికోమ్ మహాదేవ దేవాలయం హిందువుల పుణ్యక్షేత్రం.

భారత దేశం దేవాలయాల నిలయమని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క పురాణ ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి దేవాలయం ఒకటి కేరళలో ఉంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొట్టాయంకు 40 కిలోమీటర్ల దూరంలో ఈ వైకోం అనే చోట వైకోమ్ మహాదేవ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం....

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ

P.C: You Tube

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో వైకోమ్ మహాదేవ టెంపుల్ ఒకటి. ఎర్నాకుళం కి 33 కిలోమీటర్ల దూరంలో ఎర్నాకులం మరియు తిరువనందపురం మధ్య రైలు మార్గంలో కొట్టాయంకు 40 కిలోమీటర్ల దూరంలో వైకోం ఉంది.

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ

P.C: You Tube

ఇక్కడ ఉన్న శివుడిని అన్నదాన ప్రభువు అని అంటారు. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే ఇక్కడ ఉదయం పూట దక్షిణామూర్తిగా పూజలు అందుకునే పరమశివుడు సాయంత్రం మాత్రం కిరాతక మూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాలను అనుసరించి పూర్వం ఖరా అనే రాక్షసుడు ఉండేవాడు.

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ

P.C: You Tube

అతను శివుడి పరమ భక్తుడు. ఇతను చిదంబరంలో శివుడి గురించి ఘోర తపస్సు చేసి అతని నుంచి మూడు శివలింగాలను పొందుతాడు. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క శివలింగాన్ని ఉంచుకొని మరో శివలింగాన్ని నోటిలో కరుచుకొని తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అతడు వైకోమ్ వద్దకు రాగానే ప్రయాణబడలిక వల్ల కొద్ది సేపు విశ్రమిస్తాడు.

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ

P.C: You Tube

అప్పుడు అతని నోటిలో ఉన్న శివలింగం భూమిని తాకి అక్కడే ప్రతిష్టించబడుతుంది. ఇక రెండు చేతుల్లో ఉన్న రెండు శివలింగాలను ఎట్టుమన్నూర్, కాడుతత్తూర్‌లో ప్రతిష్టించి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అటు పై ఈ మూడు ప్రాంతాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా మారిపోయాయి.

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ

P.C: You Tube

పరుశురాముడు కూడా ఈ ఆలయంలోని పరమశివుడిని ఆరాధించినట్లు స్థానిక కథనం. ఈ ఆలయ భవనం 11 వ శతాబ్దానికి చెందినది, మరియు చెక్క పలకలు మరియు కుడ్యచిత్రాలు వరుసగా 15 మరియు 18 వ శతాబ్దానికి చెందినవి. లోపలి ప్రాకారం యొక్క గోడ చెక్క చట్రంపై నిలువు వరుసలతో కప్పబడి ఉంటుంది.

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ

వైకోం మహాదేవ దేవాలయం, కేరళ

P.C: You Tube

ఈ దేవాలయంలో ప్రతిరోజూ ఐదు సార్లు పూజలు జరుపుతారు. అదేవిధంగా పర్వదినాల్లో సంగీతం, నృత్య ప్రదర్శనలను కొనసాగిస్తారు. ఏడాదికి ఒకసారి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవంలో పాల్గొనడానికి దేశవిదేశాల నుంచి భక్తులు వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X