Search
  • Follow NativePlanet
Share
» »వేదంతంగల్ - పక్షులను ప్రేమించేవారికి ఒక వేడుక !!

వేదంతంగల్ - పక్షులను ప్రేమించేవారికి ఒక వేడుక !!

వేదంతంగల్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చిత్రవిచిత్రమైన చిన్న సరస్సులతో వివిధ రకాల వలస పక్షులను ఆకర్షిస్తున్నాయి. వేదంతగల్ బ్రిటిష్ పాలనలో బర్డ్ సాంక్చురీ గా మారింది.

By Mohammad

వేదంతంగల్ తమిళనాడు రాష్ట్రంలోని ఒక పురాతన పక్షుల అభయారణ్యం. ఇది దేశంలోనే పురాతనమైనది. కాంచీపురం పట్టణం నుండి 46 కిలోమీటర్ల దూరంలో, మహాబలిపురం నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఈ పక్షి అభయారణ్యం కలదు. ఇక్కడ అనేక పాత సినిమా షూటింగ్లు చిత్రీకరించారు. నేడు అనేక రకాల వలస పక్షుల ఆవాసంగా వేదాంతంగల్ ఉన్నది.

ఈ పక్షుల కేంద్ర ప్రాంతం చెన్నై నగరం నుండి 80 కి.మీ.దూరంలో 74 ఎకరాలలో వ్యాపించి ఉన్నది. ఈ ప్రాంతాన్ని బస్సు మార్గం ద్వారా సులభంగా చేరుకోవొచ్చు మరియు చెన్నై నుండి ఇక్కడికి చేరుకోవటానికి గంటన్నర సమయం పడుతుంది. శతాబ్దాల క్రితం, ఈ ప్రాంతాన్ని అప్పటి స్థానిక రాజులు మరియు భూస్వాములు 'వేట' ప్రాంతంగా ఉపయోగించుకునేవారని చరిత్ర చెపుతున్నది. ఇది నిజమని ఈ ప్రాంతం యొక్క పేరు చెపుతున్నది. వేదంతంగల్ అంటే తమిళ్ భాషలొ అర్థం "ది హామ్లెట్ ఆఫ్ ది హంటర్".

వేదంతంగల్ - పక్షిప్రేమికులకు సహజ ప్రదేశం

చిత్రకృప : Vinoth Chandar

వేదంతంగల్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చిత్రవిచిత్రమైన చిన్న సరస్సులతో వివిధ రకాల వలస పక్షులను ఆకర్షిస్తున్నాయి. వేదంతగల్ బ్రిటిష్ పాలనలో బర్డ్ సాంక్చురీ గా మారింది. బ్రిటిష్ వారు ఈ ప్రాంతంలోని అర్నితోలాజికల్ యొక్క ప్రాముఖ్యత గుర్తించారు. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని బర్డ్ సాన్క్చ్యుయరీగా పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఉత్తర్వులు జారీ చేసింది మరియు అప్పటినుండి ఈ ప్రాంతం ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మారింది.

వేదంతంగల్ బర్డ్ సాంక్చురీ ప్రపంచవ్యాప్తంగా రెండు ప్రధాన కారణాలతో పర్యాటకులను మరియు పక్షి శాస్త్రవేత్తలను ఆకర్షిస్తుంది. అందులో ఒకటి భారతదేశంలో బ్రిటిష్ వారు వారు ఏర్పాటు చేసిన మొట్టమొదటి బర్డ్ సాంక్చురి కాగా, రెండవ కారణం పక్షుల సంరక్షణలో స్థానిక సంఘాల మధ్య భాగస్వామ్యం.

వేదంతంగల్ - పక్షిప్రేమికులకు సహజ ప్రదేశం

చిత్రకృప : Saravanakumar

అనేక రకాల కాలానుగుణ పక్షులతో వేదంతంగల్ బర్డ్ సాన్క్చ్యుయరీ పక్షి ప్రేమికులను ఆకర్షిస్తున్నది. ఇక్కడ అరుదైన మరియు అన్యదేశ జాతుల పక్షులు, గార్గానే అడవి బాతులు, ఆస్ట్రేలియా యొక్క గ్రే పెలికాన్, శ్రీలంక స్నేక్ బర్డ్, బూడిద రంగు కొంగ, ప్రకాశవంతమైన ఇబిస్, ఓపెన్ గూడకొంగ, స్టార్క్ పెయింటెడ్ సైబీరియన్ మరియు స్పాట్ బిల్ బాటు ఉన్నాయి.

ఈ అభయారణ్యంలో చాలా చిత్రమైన చిన్నచిన్న సరస్సులు అనేకం ఉన్నాయి మరియు ఇవి 74 ఎకరాల ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ అరుదైన యురోపియన్ జాతుల పక్షులను నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో చూడవొచ్చు.

ఈ గ్రామం వివిధ రకాల పక్షులకు వాసంలాగా ఉండటమే కాకుండా, వేదంతంగల్, పింటాలీ, నీలం రెక్కలు టేల్ గార్గానే, గ్రే వాగ్టైల్ మరియు సాధారణ ఉల్లంకి వంటి వలస పక్షులకు కూడా ఒక కాలానుగుణ స్థావరంగా సేవలను అందిస్తోంది. వేదంతంకల్ బర్డ్ సాన్క్చ్యుయరీకి 9 కి.మీ. దూరంలో కరికిలి బర్డ్ సాన్క్చ్యుయరీ ఉన్నది మరియు ప్రయాణికులు ఒకే రోజులో రెండింటిని చూడవొచ్చు.

సందర్శించు సమయం : ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.

వేదంతంగల్ - పక్షిప్రేమికులకు సహజ ప్రదేశం

చిత్రకృప : Sudharsun Jayaraj

వేదంతంగల్ చేరుకొనే మార్గాలు

వాయు మార్గం / విమాన మార్గం

వేదంతంగల్ కు సమీపాన 80 కి. మీ. దూరంలో ఉన్న ఏర్ పోర్ట్ చెన్నై ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్. ఇక్కడి నుండి దేశ, విదేశాలకు సులభంగా ప్రయాణించవచ్చు. క్యాబ్ లేదా ట్యాక్సీ అద్దెకు తీసుకొని వేదం తంగల్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

వేదంతంగల్ కు 26 కి. మీ. దూరంలో ఉన్న చెంగాల్పెట్ రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. తమిళనాడు లో లోకల్ రైళ్ళన్ని ఈ స్టేషన్ గుండా వెళతాయి. అన్ని రకాల రైళ్లకు చెన్నై రైల్వే స్టేషన్ కేంద్రం గా ఉన్నది. ట్యాక్సీ లేదా బస్సుల్లో ఈ రైల్వే స్టేషన్ ల నుండి సులభంగా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం /బస్సు మార్గం

చెన్నై కోయంబెడ్ బస్ స్టాండ్ నుండి వేదంతంగల్ కు అనేక రోడ్డు రవాణా సంస్థల బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్క చెన్నై మాత్రమే కాదు మహాబలిపురం, కాంచీపురం, తిరుత్తని వంటి సమీప ప్రదేశాల నుండి కూడా బస్సులు లభ్యమవుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X