Search
  • Follow NativePlanet
Share
» »వింధ్యాచల్ - మాతా దుర్గా దేవి నివాసం !!

వింధ్యాచల్ - మాతా దుర్గా దేవి నివాసం !!

దేవాలయాలు, ప్రకృతి దృశ్యాలు వింధ్యాచల్ హిందువులకు పవిత్ర పుణ్య క్షేత్రం. ఇక్కడ కల ప్రకృతి అందాలు వాటికి మరొక ఆకర్షణగా వుంటాయి.

By Mohammad

పవిత్రమైన గంగా నది ఒడ్డున కల వింధ్యాచల్ ఇండియా లో ఒక ప్రధాన శక్తిపీఠం. హిందూ పురాణాల మేరకు ఈ పీఠం మాత దుర్గా దేవి నివాసంగా చెపుతారు. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన తర్వాత ఈ దేవత వింధ్యాచల్ ప్రదేశాన్ని తన నివాసంగా ఎంపిక చేసుకొంది.

దేవాలయాలు, ప్రకృతి దృశ్యాలు వింధ్యాచల్ హిందువులకు పవిత్ర పుణ్య క్షేత్రం. ఈ ప్రదేశం విక్టోరియన్ కాలం నాటికి చెందినా అనేక అందమైన భవనాలు కల మీర్జాపూర్ జిల్లాలో కలదు. ఇక్కడ కల ప్రకృతి అందాలు వాటికి మరొక ఆకర్షణగా వుంటాయి. ఈ ప్రదేశం లో అనేక పచ్చటి అడవులు కూడా కలవు. అందమైన దేవాలయాలు, సుందర పరిసరాలు వింధ్యాచల్ ను ఒక మంచి పర్యాటక ప్రదేశం గా తీర్చిదిద్దాయి.

వింధ్యాచల్ టెంపుల్ ఎంట్రెన్స్

వింధ్యాచల్ టెంపుల్ ఎంట్రెన్స్

చిత్రకృప : Ramshankaryadav

వింధ్యావాసిని దేవి టెంపుల్

వింధ్యావాసిని దేవి టెంపుల్ ఉత్తర ప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లాలో కల విన్ధ్యాన్చల్ టవున్ లో కలదు. పురాణాల మేరకు ఈ దేవత దుర్గా దేవి అవతారం. ఈ శక్తి పీఠం ను హిందూ భక్తులు పరమ పవిత్రం గా భావిస్తారు. వింధ్యావాసిని దేవిని స్థానికులు 'కాజాల దేవి' అని ప్రేమగా పిలుస్తారు.

ఈ దేవత ఒక సింహం పై కూర్చుని దర్శనమిస్తుంది. విగ్రహం నల్ల రాతి తో చేయబడింది. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో దాంధ్వజ దేవి, పన్నెండు చేతుల దేవి మరియు మహాకాళి, మరికొన్ని శివ లింగాలు కూడా వుంటాయి. ఒక సప్తసతి మండపం కూడా వుంటుంది. ఈ టెంపుల్ లో నవరాత్రి , అశ్విన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

రాముడు పూజించిన శివలింగం

రాముడు పూజించిన శివలింగం

రామేశ్వర్ మహాదేవ టెంపుల్

రామేశ్వర్ మహాదేవ టెంపుల్ వింధ్యాచల్ లోని రామ్ గయా ఘాట్ లో కలదు. ఇది విన్ద్యవాసిని దేవి టెంపుల్ కు ఒక కి. మీ. దూరం మరియు మిర్జాపూర్ కు ఎనిమిది కి. మీ. ల దూరం లో వుంటుంది. ఇక్కడ శ్రీరాముడు తన పూర్వీకుల కొరకు శివుడి ని పూజించాడని చెపుతారు. వారి జ్ఞాపకార్ధం ఇక్కడ ఒక శివ లింగాన్ని ప్రతిష్టించాడని చెపుతారు.

అష్టభుజ దేవి టెంపుల్

అష్టభుజ దేవి శ్రీకృష్ణుడి పెంపుడు తల్లి అయిన యశోద కు కుమార్తె. పురాణాల మేరకు మధురా పట్టణ రాక్షస రాజు కంసుడు ఈమెను వధించగా, ఆమె వెంటనే తప్పించుకొని వింధ్యాచల్ పర్వతాలకు వెళ్లిందని చెపుతారు. అందమైన ఈ టెంపుల్ ఒక కొండపై కలదు.

కాళి టెంపుల్

వింధ్య పర్వత శ్రేణులలో, వింధ్యావాసిని దేవి టెంపుల్ నుండి 2 కి.మీ. ల దూరం లో ఒక కొండపై కల గుహ లో ఈ కాళీ టెంపుల్ కలదు. దీనిలో కాళీ మాత విగ్రహం వుంటుంది. పరిసరాలు చాలా అందంగా వుండి సంవత్సరం పొడవునా అనేక మంది భక్తులను ఆకర్షిస్తూ వుంటుంది.

వింధ్యాచల్ జలపాతం

వింధ్యాచల్ జలపాతం

చిత్రకృప : Dhiren76 scs

సీతా కుండ్

సీతా కుండ్ అనే ఈ సరస్సు వింధ్యాచల్ లోని మని పర్వతం మరియు విద్యా కుండ్ లకు సమీపం లో ఒక చిన్న కొండపై కలదు. ఇది రామాయణ కాలం నాటిది. రావణుడి ని వధించిన తర్వాత శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు లంక నుండి తిరిగి వస్తున్నపుడు సీత కు దాహం వేయగా లక్ష్మణుడు తన బాణం భూమి లోకి వేసి నీరు పైకి తెప్పించిన ప్రదేశం సీతా కుండ్ గా చెపుతారు.

వింధ్యాచల్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : వింధ్యాచల్ చేరుకోవటానికి సమీపాన వారణాసి ఎయిర్ పోర్ట్ 90 కిలోమీటర్ల దూరంలో కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో వింధ్యాచల్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : వింధ్యాచల్ లో రైల్వే స్టేషన్ కలదు. వారణాసి, గోరఖ్పూర్, లక్నో, ఆగ్రా తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్ళు వస్తుంటాయి.

బస్సు/ రోడ్డు మార్గం : లక్నో, వారణాసి, ఆగ్రా, మీర్జాపూర్ తదితర ప్రాంతాల నుండి వింధ్యాచల్ కు పలు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X