» »దోసెలు, చాక్లెట్లు, నూడుల్స్ ను ప్రసాదంగా అందించే దేవాలయాలు మీకు తెలుసా?

దోసెలు, చాక్లెట్లు, నూడుల్స్ ను ప్రసాదంగా అందించే దేవాలయాలు మీకు తెలుసా?

Posted By: Venkatakarunasri

ప్రసాదం అనగానే అందరికీ నోరూరుతుంది కదా.జనరల్ గా ప్రసాదం అంటే దేవాలయాలకెళ్ళినప్పుడు మనకి ఏం పెడతారు. లడ్డో లేకపోతే చక్కరపొంగలో, లేకపోతే రకరకాల ప్రసాదాలు మనకు పెడుతూవుంటారు.అయితే దోసెలు, చాక్లెట్లు, నూడుల్స్ ని ప్రసాదంగా అందించే దేవాలయాలు మన దేశంలో వున్నాయని మీకు తెలుసా?నిజమండీ ఆశ్చర్యపోనక్కరలేదు.రండి తెలుసుకుందాం.

దేవుడ్ని దర్శించుకుని మన కోరికలు,సమస్యలు,సాధకబాధకాలు తీర్చమని కోరుకుంటుంటాం.దైవదర్శనం తర్వాత భక్తులకు ప్రసాదంగా చాలా వరకు దేవాలయాల్లో కొబ్బరి,చక్కర, స్పటికం, శనగగుగ్గిళ్ళు,మిఠాయివంటి తియ్యటి పదార్థాలను ప్రసాదంగా పెడ్తారు.అయితే కొన్ని ఆలయాల్లో మాత్రం వీటికి భిన్నంగా ప్రసాదాలను భక్తులకందిస్తున్నారు.ఆయా దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదాలను చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోవలసిందే అదేంటో చూద్దాం.

దోసెలు, చాక్లెట్లు, నూడుల్స్ ను ప్రసాదంగా అందించే దేవాలయాలు

1.అలగర్ కోవిల్ దేవాలయం

1.అలగర్ కోవిల్ దేవాలయం

తమిళనాడు రాష్ట్రంలోని అలగర్ కోవిల్ దేవాలయంలో మహావిష్ణువును పూజిస్తారు.దైవదర్శనం అనంతరం భక్తులకు ఏం పెడతారో తెలుసా ప్రసాదంగా దోసెలను వడ్డిస్తారండీ.

PC:youtube

2. కర్ణిమాత దేవాలయం

2. కర్ణిమాత దేవాలయం

రాజస్థాన్ లోని కర్ణిమాత ఆలయంలో ఎలుకలు ఎప్పుడుకూడా సంచారిస్తూవుంటాయట.ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలుకలతో కూడిన ప్రసాదాన్ని ఇస్తారు.నిజమండీ.

PC:youtube

3.కమఖాయ దేవాలయం

3.కమఖాయ దేవాలయం

51 శక్తిపీఠాలలో గౌహతిలోని కమఖాయ దేవాలయం ఒకటి.ఇక్కడ భక్తులకు ప్రసాదంగా అమ్మవారి తడిగుడ్డనందిస్తారు.

PC:youtube

4. త్రిశూర్ మహాదేవ ఆలయం

4. త్రిశూర్ మహాదేవ ఆలయం

కేరళలో గల త్రిశూర్ మహాదేవ ఆలయం గోడలపై మహాభారతంలోని అక్షరాలు రాయబడి వుంటాయి. ఇక్కడ ప్రసాదంగా హిందూమతానికి ఆ ఆలయానికి సంబంధించిన సీడీ,డీవీడీలు, పుస్తకాలను ఇస్తారు.

PC:youtube

5.బాలసుబ్రమణ్య ఆలయం

5.బాలసుబ్రమణ్య ఆలయం

కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి సుబ్రమణ్య ఆలయంలో దేవుడ్ని చాక్లెట్లతో పూజిస్తారు.పూజించిన తర్వాత ఏం పెడ్తారో తెలుసా?ఇంకేం పెడ్తారండి.చాక్లెట్లను ప్రసాదంగా అందిస్తారు.

PC:youtube

6.చైనీస్ కాళి ఆలయం

6.చైనీస్ కాళి ఆలయం

కొలకత్తాలో వున్న చైనీస్ కాళి ఆలయాన్ని చైనీసే నిర్మించారు.ఈ ఆలయంలో అమ్మవారి పూజ అనంతరం నూడుల్స్, ఫ్రైడ్ రైస్ మరియు ఇతర చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ను ప్రసాదంగా పెడ్తారు.ఆహా!ఆ టెంపుల్ మనకుంటే ఎంత బాగున్ననిపిస్తుంది కదూ.

PC:youtube

7.కాలభైరవ ఆలయం

7.కాలభైరవ ఆలయం

మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి భైరవాలయంలో ఒక్క భైరవుడికి మాత్రమే మద్యంతో పూజలు చేస్తారు.మరి ఆటోమేటిక్ గా ఇక్కడకు వచ్చే భక్తులకు ప్రాసాదంగా ఏమిస్తారు.మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు.చూసారా ఎంత విచిత్రంగా వుందో.అప్పుడప్పుడు లడ్డూలు,పులిహోర, చక్కెరపొంగలి ఇవేకాదండీ ఒకసారి మనం ఇక్కడక్కూడా వెల్లొద్దాం.అవన్నీ టేస్ట్ చేద్దాం.ఏమంటారు.

PC:youtube