» »కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన కూడల్ మాణిక్యం ఆలయంను సందర్శించండి

కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన కూడల్ మాణిక్యం ఆలయంను సందర్శించండి

Posted By: Venkata Karunasri Nalluru

భారతదేశం అతిపురాతన ఆలయాల్లో కేరళలో గల కూడల్ మాణిక్యం ఆలయం ఒకటి. ఈ ఆలయం త్రిస్సూర్ జిల్లాలో ఇరిన్ జలక్కుడ వద్ద వున్నది. కేరళలోని అతి ముఖ్యమైన హిందూ మతానికి చెందిన దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం లార్డ్ భరతునికి అంకితం.

కూడల్ మాణిక్యం ఆలయం విలక్షణ లక్షణాలను కలిగిన నాలుగు దేవాలయాలు కలిగిన ఒక పవిత్రమైన సమితిలోని ఒక దేవాలయం. ఈ దేవాలయంలో రామాయణంలోని నలుగురు సోదరులు ప్రత్యేక స్థానాలలో ఉన్నారు. మిగిలిన మూడు దేవాలయాలు రామ, లక్ష్మణ మరియు శత్రుఘ్నులకు ప్రత్యేకించబడ్డాయి.

ఆలయం యొక్క ఉనికి మరియు స్థితి

ఆలయం ఖచ్చితంగా ఏ కాలంలో నిర్మించారో చెప్పటానికి ఎలాంటి ఆధారం లేదు. ఆసక్తికరంగా ఆలయంలో కనిపించే ఒక రాతి శాసనం క్రీ.శ. 854 వ శతాబ్దంలో చేర రాజు స్తను రవి వర్మన్ కాలం నాటిది అని చెప్పవచ్చును. చేర రాజు ఆలయానికి అధిక భూబాగాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. దీనిని బట్టి ఈ ఆలయానికి గత కాలానికి సంబంధించిన చరిత్ర చాలా వుందని తెలుస్తుంది.

కేరళలోని కూడల్ మాణిక్యం ఆలయం

PC: Aruna

కూడల్ మాణిక్యం ఆలయ నిర్మాణం :

ఈ ఆలయ నిర్మాణం కేరళ శైలి ప్రకారం మహా క్షేత్రంగా (దాని నిర్మాణ అంశాలు పరంగా అన్ని అర్హతలను కలిగిన ఒక ఆలయం) గా భావిస్తారు. ఆలయం సమ్మేళనంలో ప్రతి ఆలయానికి ముఖ్యమైన కూతంబలం, నలంబలం, విలక్కుమడం, శ్రీకోవిల్ లాంటి అనేక విభాగాలు ఉన్నాయి.

కళల కేంద్రం

నలంబలంకు చెందిన ఆలయాల్లో కూడల్ మాణిక్యం మాత్రమే ఒకటిగా ప్రాముఖ్యత సంతరించుకుంటూ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సంప్రదాయ కళా రూపాలను ప్రదర్శిస్తారు. మీరు ఇక్కడ కథాకళి, కూడియట్టం, కూతు మరియు తుళ్ళాల్ వంటి కొన్ని కళారూపాలను చూసి ఆనందించవచ్చు.

ఆలయ కొలనులు

ఆలయ సముదాయంలో 4 పెద్ద చెరువులు వున్నాయి. ఆలయ ప్రాంగణం లోపలే అందులో ఒకటి వున్నది. ఈ చెరువులలో గల చేపలను పూర్వికులు అని నమ్ముతారు. వీటికి భక్తులు స్వయంగా ఆహారాన్ని అందిస్తారు.

కేరళలోని కూడల్ మాణిక్యం ఆలయం

PC: Haribhagirath

ఆలయంలో జరిగే పూజలు

కేరళలో ఇతర దేవాలయాల వలె కాకుండా ఆచారాలు మరియు పూజలు ఇక్కడ పూర్తిగా కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఆలయంలో జరిగే పూజలు 3 మాత్రమే ఉన్నాయి. మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ధూపం కర్రలు మరియు కర్పూరం ఇక్కడ పూజలో వుపయోగించరు.

కూడల్ మాణిక్యం దేవాలయంలో ఆచరించే పండుగలు

కూడల్ మాణిక్యం 11 రోజుల వార్షిక ఉత్సవం మెడం (ఏప్రిల్ / మే) మాసంలో జరుగుతుంది. పండుగ ఉత్రం రోజున మొదలై తిరుఓనం నాడు ముగుస్తుంది.