Search
  • Follow NativePlanet
Share
» » చెన్నై నుండి ట్రాన్ కేబార్ రోడ్డు ప్రయాణం !!

చెన్నై నుండి ట్రాన్ కేబార్ రోడ్డు ప్రయాణం !!

ఒక చిన్నపాటి అంటే కొద్దిరోజుల వారాంతపు విహారం చెన్నై నుండి చేయాలనుకుంటున్నారా ? అలాగయితే, చెన్నై నుండి ట్రాన్ కేబార్ సూచించ దగినది. ఈ రోడ్ ట్రిప్ మీలోని ఈ ఉత్సాహాన్ని అధికం చేస్తూ ప్రకృతి, చరిత్ర లతో ఏకం చేస్తుంది. చెన్నై ఎండల నుండి గతంలో ఫ్రెంచ్ పాలకులు పాలించిన పాండిచేరి లేదా ఇపుడు చెప్పబడే పుదు చెర్రీ కి బయలు దేరండి. ప్రపంచంలోనే అతి పెద్ద రెండవ మాన్గ్రోవ్ ఫారెస్ట్ లకు చేరండి. అక్కడ నుండి చివరగా ఇండియా లో డెన్మార్క్ చరిత్ర కల ట్రాన్ కేబార్ చేరుకొండి. గతంలో ఇక్కడ అంతా డెన్మార్క్ దేశస్తులు వుండేవారు. చెన్నై నుండి రోడ్ ట్రిప్ లో ఎలా చేరాలి ? అనే దానికి మీకు ఇక్కడ మార్గదర్శకతలు ఇస్తున్నాం. పరిశీలించండి.

చెన్నై నుండి ట్రాన్ కే బార్ కు దూరం 280 కి. మీ. లు. ఈ మార్గంలో మీరు పాండిచేరి - పిఛావరం - ట్రాన్ కేబార్ చేరతారు. ఈస్ట్ కోస్ట్ రోడ్ లేదా నేషనల్ హై వే మీదుగా కూడా చేరవచ్చు. రెండు మార్గాలు కూడా సుమారు మూడు గంటల సమయం తీసుకుంటాయి. పగటివేళ పాండిచేరి లో గడపండి. పాండిచేరి లో ఏమి చేయాలి ? అనేదానికి ఇక్కడ క్లిక్ చేయండి.

వారాంతపు విహారం

వారాంతపు విహారం

చెన్నై నుండి ట్రాన్ కే బార్ కు దూరం 280 కి. మీ. లు. ఈ మార్గంలో మీరు పాండిచేరి - పిఛావరం - ట్రాన్ కేబార్ చేరతారు. ఈస్ట్ కోస్ట్ రోడ్ లేదా నేషనల్ హై వే మీదుగా కూడా చేరవచ్చు. రెండు మార్గాలు కూడా సుమారు మూడు గంటల సమయం తీసుకుంటాయి. పగటివేళ పాండిచేరి లో గడపండి.


Photo Courtesy: joseph jayanth

వారాంతపు విహారం

వారాంతపు విహారం

పిచ్చవరం
మరుసటి రోజు ఉదయం పాండిచేరి నుండి పిచ్చవరం చేరండి. ఈ ప్రయాణం అరగంట మాత్రమే. పిచ్చవరం ఉదయం 9 గంటల లోపు చేరాలి. లేదా ఎండ అధికమై వేచి ఉండలేనంత అలసటలు కలుగుతాయి. ఇక్కడ కల మాన్ గ్రోవ్ ఫారెస్ట్ లు చూసేందుకు బీచ్ లో కంట్రీ లేదా మేకనైసేడ్ బోటు లు కలవు. కంట్రీ బోటు అయితే, కెనాల్ ఎంత చిన్నదైనప్పటికి తిరగవచ్చు. Photo Courtesy: VasuVR

వారాంతపు విహారం

వారాంతపు విహారం

పిచ్చవరం నుండి ట్రాన్ కేబార్
బోటు నడిపే వాడికి కనీసం రెండు నుండి మూడు వందల రూపాయలు టిప్ గా ఇస్తే, చిన్న చిన్న కెనాల్ ల గుండా కూడా ఈ మాన్ గ్రోవ్ లలోకి తీసుకు వెళ్లి చూపుతాడు. ఇదంతా చూసేటప్పటికి మధ్యాహ్నం పన్నెండు లేదా ఒకటి గంట అవుతుంది. ఇక అపుడు లంచ్ కి త్రివేండ్రం వెళ్ళండి. ఇక్కడి నుండి త్రివేండ్రం అరగంట ప్రయాణం మాత్రమే. త్రివేండ్రం నుండి ఒక గంట ప్రయాణిస్తే చాలు ట్రాన్ కేబార్ వచ్చేస్తుంది.

Photo Courtesy: Ashwin Kumar

వారాంతపు విహారం

వారాంతపు విహారం

ట్రాన్ కేబార్
దీనినే తరంగంబాడి అని కూడా పిలుస్తారు. 17 వ శతాబ్దం లో ఇది డెన్మార్క్ దేశస్తుల కాలనీ. ట్రాన్ కేబార్ లేదా తరంగంబాది అనే దానికి అర్ధం పాటలుపాడే తరంగాలు. డెన్మార్క్ దేశస్తులు ఈ కాలనీ ని సుమారు 225 సంవత్సరాలు తమ కింద ఉంచుకున్నారు. చివరకు 1845 సంవత్సరం లో బ్రిటిష్ వారికి అప్ప చెప్పారు. ఒకప్పుడు ఇది చాలా బిజి గా వుండే కోట. కాని ఒక రైల్వే లైన్ పడ్డ తర్వాత దాని ప్రాధాన్యత కోల్పోయింది.

Photo Courtesy: Joseph Jayanth

వారాంతపు విహారం

వారాంతపు విహారం

ట్రాన్ కేబార్ లో ఎక్కడ వుండాలి ?
ఇక్కడ వసతులు అధికంగా లేవు. ఒకటి బీచ్ లో కల బంగళా, రెండు తమిళనాడు హౌస్, మూడు గెట్ హౌస్ నాల్గవది నాయక హౌస్. బీచ్ బంగళా లో రెస్టారెంట్ కలదు. కొద్దిసేపు రెస్ట్ తర్వాత మధ్యాహ్నం ప్రదేశమంతా చూడవచ్చు.

Photo Courtesy: Sankara Subramanium

వారాంతపు విహారం

వారాంతపు విహారం

ట్రాన్ కేబార్ లో ఏమి చూడాలి ?

ఫోర్ట్
డాన్స్ బోర్గ్ కోట
దీనిని 1620 లో డెన్మార్క్ వారు బిజినెస్స్ కొరకు కొత్తగా వచ్చినపుడు నిర్మించారు. దీని నిర్మాణం అనేక సంవత్సరాలు కొనసాగింది. చాలా సార్లు రిపేర్లు చేసారు. ఫోర్ట్ ఆవరణలో ఒక చిన్న డేనిష్ మ్యూజియం కలదు. ఎంట్రీ ఫీజు రూ.5 గా వుంటుంది. మ్యూజియం ఉదయం 10.30 నుండి సా. అయిదు గంటల వరకూ తెరచి వుంటుంది.
Photo Courtesy: Joseph Jayanth

వారాంతపు విహారం

వారాంతపు విహారం

టవున్ గేట్
దీనిని ట్రాన్ కేబార్ చుట్టూ 1660 లో నిర్మించారు. ప్రస్తుతం కల గెట్ మరో మారు 1791 లో నిర్మించారు.
Photo Courtesy: Joseph Jayanth

వారాంతపు విహారం

వారాంతపు విహారం

చర్చి లు
క్రీ. శ. 1701మరియు 1718 లలో నిర్మించబడిన చర్చి లు ఇక్కడ కలవు. ఇవి ఇండియాలో అతి పురాతన చర్చి లు గా చెప్పబడతాయి.

Photo Courtesy: Chenthil

వారాంతపు విహారం

వారాంతపు విహారం

ట్రాన్ కేబార్ మారిటైం మ్యూజియం
ఇక్కడ కల మ్యూజియం ను 2004 సునామి తర్వాత ఇండియా ప్రభుత్వం కాక డచ్ దేశస్తులే మరో మారు నిర్మించారు. దీనికి ఎంట్రీ ఫీజు లేదు. లోపల వుండే గైడ్ పూర్తి సమాచారం ఇస్తాడు. పుస్తకాలు, పోస్ట్ కార్డ్ లు, మ్యాప్ లు కొనవచ్చు. ట్రాన్ కేబార్ ప్రదేశం క్రమేనా చాలావరకు సముద్రం లోకి కలసి పోతోంది.

Photo Courtesy: Joseph Jayanth

వారాంతపు విహారం

వారాంతపు విహారం

మాసిలమాని నాతార్ టెంపుల్
ఈ టెంపుల్ కు మూడు గోపురాలు కలవు. వీటిలో రెండు ఇప్పటికే సముద్రంచే కప్పబదినాయి. ఈ దేవాలయం పాన్ద్యుల కాలం నాటిదిగా దాన్సోబర్గ్ మ్యూజియం లోని ఒక శాసనం చెపుతుంది. సుమారు క్రీ. శ. 1306 సంవత్సరం నాటిది. ఇపుడు మరోమారు తిరిగిఈ టెంపుల్ కి రిపేర్లు చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X