Search
  • Follow NativePlanet
Share
» »బైక్ నడపటంలో ఆనందాలు !

బైక్ నడపటంలో ఆనందాలు !

ఎక్కడకైనా వెళ్ళాలంటే, అనేక రకాల వాహనాలు కలవు. ఆ ప్రదేశం ఎంత దగ్గర అయినప్పటికీ మనం ఏ బస్సో లేక కారో, లేక ట్రైన్ ఎక్కి మరీ వెళతాము. అయితే, ఎప్పుడైనా ఒక బైక్ పై మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి అందులో కల సౌకర్యం, ఆనందం అనుభవిన్చారా ? మరి ఈ స్టొరీ చదవండి. మీరు ఇంతవరకూ అనుభవించని ఆ బైక్ ప్రయాణ అనుభవం ఎలా ఉంటుందనేది పరిశీలించండి.

1. మీకు ఇష్టంఅయిన ప్రదేశానికి ఒక స్వేచ్చా విహంగం వలే ఒక మోటార్ బైక్ పై దూసుకు పొండి. బైక్ వేగం మీ ఇష్టం. ఎక్కడ కావాలంటే అక్కడ నిలుపు కొని కూల్ డ్రింక్ లేదా కాఫీ వంటివి తాగవచ్చు. ఇక మీ బైక్ ప్రయాణ వేగం, దూరం వంటివి ఎవరూ నిరోధించక పోతే, మరి ఆ ప్రయాణం మీకు ఒక అడ్వెంచర్ కాగలదు.

బైక్ ఎందుకు నడపాలి ?

2. మీ బైక్ ప్రయాణంలో కావలసినన్ని ప్రదేశాలలో నిలుపుకొని ఆనందించండి. ఆయా ప్రదేశాల వివరాలు తెలుసుకోండి. వింతలు విశేషాలు ఆనందించండి. కాఫీ లు, టీ బ్రేకులు, లంచ్ ఆనందించండి. అంతేకాదు, బైక్ నిలిపి ఒక చెట్టు నీడన విశ్రమించవచ్చు కూడాను.

౩. రాత్రి వేళ బస
మీ బైక్ ప్రయాణంలో చీకటి పడిందా ? సమీపంలో కల చక్కని ప్రదేశం చూసి హాయిగా రిలాక్స్ అవండి. కొన్ని మార్లు సురక్షిత ప్రదేశంలో ఆరు బయట ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ కూడా విశ్రాంతి పొంది ఆనందించవచ్చు.

4. మానత్వంలో కల మీ విశ్వాసాన్ని తిరిగి పొందండి.
మీ బైక్ ప్రయాణంలో కొన్ని మార్లు అక్కడి స్థానికుల సహకారం అవసరం అవుతుంది. మీ అవసరాలకు ఆ స్థానికులు తప్పక సహకరిస్తారు. ప్రతి ఫలంగా మీరు బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ వుంటే, సమీప దూరాలకు స్థానికులకు లిఫ్ట్ ఇవ్వండి. వారి థాంక్స్ అందుకోనండి.

5 . బైక్ ప్రయాణంలో నెమ్మదిగా ప్రయానించండి. మీకు సౌకర్యం అనుకున్న వేగంలో వెళుతూ ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించండి. అందమైన ప్రదేశం కనపడితే బైక్ ఆపి మరీ ఆనందించండి.

6. జంటగా ప్రయాణం
బైక్ పై చేసే ప్రయాణంలో డ్రైవింగ్ తెలిసిన ఒక ఆప్త మిత్రుడు లేదా ఒక గర్ల్ ఫ్రెండ్ వంటి వారు వుంటే మరీ మంచింది. అలుపు సొలుపు లేకుండా ఒకరి తర్వాత మరి ఒకరు డ్రైవింగ్ చేస్తూ, ఎంత దూరాలనైనా సరే పర్యటిన్చేయ వచ్చు. అయితే, బైక్ రిపేర్ లో వాడే అవసరమైన టూల్స్ పెట్టుకొనటం మాత్రం మరువకండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X