Search
  • Follow NativePlanet
Share
» »ఒంటరి ప్రయాణ అనుభవాలు !

ఒంటరి ప్రయాణ అనుభవాలు !

సాధారణంగా, సెలవులు వచ్చాయంటే, ఇంట్లో బోర్ కొట్టేస్తోంది అంటూ, స్నేహితులు, బంధువులు, లేదా ఇరుగు పొరుగులు తో కలసి ఎదో ఒక ప్రదేశానికి పర్యటనలు చేస్తూ వుంటాం. అయితే, కొంతమంది ఎవరితోనూ కలవక, ఒంటరిగా కూడా ప్రయాణిస్తూ వుంటారు. ఇది మంచిదే. కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే, ఒంటరి ప్రయాణం చేయాల్సిందే. ఈ రకమైన ఒంటరి ప్రయాణాల వలన ప్రయోజనాలు ఏమిటి? అవి ఏ రకంగా మనకు లాభిస్తాయి ? అనేది పరిశీలిద్దాం.

ఒంటరి ప్రయాణ లాభాలు !

1. కొత్త వారిని కలుస్తాం !
ఒంటరిగా ట్రావెల్ చేసేటపుడు, ట్రావెల్ ఆసక్తి కల ఇతరులను తప్పక కలుస్తాము. వారితో స్నేహం చేసుకుంటాము. అక్కడి స్థానికులతో సంభాషించి పరిచయాలు ఏర్పరచుకుంటాము. వారి జీవన విధానం తెలుసుకుంటాము.

2. స్వంత ఛాయస్ !
ఒక గ్రూప్ లో ప్రయానిన్చేటపుడు ఎంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ, కొన్ని, హద్దులు లేదా, అడ్డంకులు కూడా వుంటాయి. గ్రూప్ లోని వారితో కొన్ని విబేధాలు కలిగినప్పటికీ, చివరకు వారితో కలిసే ప్రయాణించాలి. ఆపై మీకు ఛాయస్ వుండదు. అదే, మీరు ఒంటరి పర్యాటకులు అయితే, నిర్ణయాలు మీవి. మరింత స్వేచ్ఛ కనుక ఒకసారి ఒంటరిగా తప్పక ప్రయానింఛి ఆనందించండి.

3. సవాళ్ళను ఎదుర్కొనే సమర్ధత !
ఒంటరి ప్రయాణం మీకు అనేక సవాళ్ళను ఇస్తుంది. ఎవరూ తెలియని ప్రదేశంలో మీరు వసతి తీసుకొని సంచరించ వలసి వస్తుంది. భాష కొత్త గా వుంటుంది, రాత్రి జర్నీ, టాక్సీ లలో ప్రయాణం వంటివి అన్నీ కొత్తగా, ఒక సవాలుగా వుండి మిమ్ములను మరింత సమర్ధవంతులుగా చేస్తాయి. ఎలా మేనేజ్ చేశామా ? అనేది మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది.

4. ప్రయాణ సంతృప్తి !
మీ ఒంటరి పర్యటనలో మిమ్ములను మీరు ఎప్పటికపుడు సంతృప్తి కలిగించుకోనండి. తగిన సమయాన్ని అన్ని అంశాలకూ కేటాయించండి. మరల మీరు తిరిగి మీ ప్రదేశానికి చేరే సరికి, ఏ రకమైన ఒత్తిడి లేకుండా చూసుకొనండి.

ఒంటరి ప్రయాణ అనుభవాలు !

5. మార్పు కలిగిస్తుంది !
మిమ్ములను మీరు కొత్త ప్రదేశాలకు, కొత్త ప్రజలకు అనుగుణంగా మార్పు చేసికొనటం ఒక ఉత్తమ మార్గం. ఈ పరిస్థితి మీ ఒంటరి పర్యటనలో మీకు తప్పక ఏర్పడి, మార్పును స్వీకరించేలా చేస్తుంది. మీలోని సమర్ధతలను మరింత మెరుగు పరుస్తుంది.

6.చెడు అనుభవాల మరుపు !
గతంలోని చెడు అనుభవాలను మరువనంత కాలం ముందుకు సాగలేము. గత కాల పర్యటనల చెడును సమర్ధవంతమైన మీ స్వంత నిర్వహణలో మరువ గలరు. కొత్త అనుభవాలను చేకూర్చుకోనగలరు. సవాళ్ళను స్వీకరించి మరింత సమర్ధులై ఇతరుల పర్యటనలు సైతం నిర్వహించగలరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X