Search
  • Follow NativePlanet
Share
» »శీతాకాల పర్యటన - ఉదయపూర్ సందర్శన !

శీతాకాల పర్యటన - ఉదయపూర్ సందర్శన !

మీరు ఉదయపూర్ నగరం చూడకపోతే, ఇండియా లోని అద్భుతమైన ప్రదేశాల పర్యటన కోల్పోతున్నారన్న మాటే. శృంగార భరిత, ప్రశాంత వాతావరణాలు కల ఉదయపూర్ లో ఎన్నో వారసత్వ హోటళ్ళు, సాంప్రదాయక రీతిలోని కొత్త కొత్త రాజ భవనాలు కలవు. మీరు ఈ ప్రదేశంలో ఎక్కడైనా సరే వసతి పొందండి. కాని పిచోలా సరస్సు నుండి జగ మందిర్ వరకూ ఒక బోటు విహారం చేయడం మరచి పోకండి. జగ మందిర్ లో రాత్రివేళ కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల దీపాలు వెలుగుతాయి. పురాతన నగరంలోని పాము వలే మెలికలు తిరిగే సందులు కల ఉదయపూర్ ను బేస్ గా పెట్టుకొని మేవార్ ప్రాంతం అంతా పర్యటీంచండి.

ఏమి చూడాలి ?

సిటీ పాలస్

పిచోలా సరస్సు ఒడ్డున నిర్మించిన ఈ సిటీ పాలస్ పూర్తిగా మార్బుల్ మరియు గ్రానైట్ లతో నిర్మించబడింది. దీని నిర్మాణంలో మీరు యురోపెయన్ మరియు చైనీస్ శిల్ప శైలులు చూడవచ్చు. ఉదయపూర్ లో ఈ నిర్మాణం ఒక గొప్ప శిల్పకళ కల కలిగి వుంటుంది. ఈ కారణంగా ఈ ఆకర్షణీయ ప్రదేశానికి పర్యాటకులు అధిక సంఖ్యలో తరచుగా వస్తారు. ఈ రాజభవన నిర్మాణ పునాదులు మహారాణా ఉదయ సింగ్ వేశాడు. అయితే, అతని తర్వాతి పాలకులు ఈ చారిత్రక కట్టడానికి ప్రస్తుత వైభవానికి విస్తృతం చేసారు. ఈ భవనం ఎగువ భాగానకల బాల్కనీల నుండి, గోపురాల నుండి సుందరమైన సరస్సు మరియు సిటీ దృశ్యాలు చూడవచ్చు.

బాగోర్ కి హవేలీ

అద్భుతమైన ఈ రాజ ప్రాసాదం 1750 లో మేవార్ ప్రధాన మంత్రి అమీర్ చాంద్ బాద్వా చే నిర్మించబడింది. ప్రస్తుతం ఇది ఒక మ్యూజియం గా మార్చ బడి, ప్రతి సాయంత్రం జరిగే సాంప్రదాయ తోలు బొమ్మల ఆట, సంగీత ప్రదర్శనలకు నిలయంగా వుంది. అందమైన ప్రాంగణం, కారిడార్ లు టెర్రస్ లు కల ఈ హవేలీ లేదా రాజ ప్రాసాదంలో సుమారు వందకు పైగా అలంకరించబడిన గదులు కలిగి వుంది. ప్రతి గది సాంప్రదాయ ఫర్నిచర్ తో ఆధునిక కళా ఖండాలతో నిండి వుంటుంది. అందమైన మేవార్ పెయింట్ లు చూసేందుకు దీనిలో కల క్వీన్స్ చాంబర్ తప్పక చూడండి. రంగుల గ్లాస్ తో అతకబడిన రెండు నెమళ్ళ ను చూడటం మరువకండి.

జగ మందిర్ పాలస్
జగ్ మందిర్ పాలస్ ఒకప్పుడు రాచ కుటుంబ పార్టీ లకు, వేడుకలకు నిలయంగా వుండేది. పిచోలా సరస్సు మధ్యలో ఒక ద్వీపం వలే నిర్మించబడిన ఈ కట్టడం ఒక అసాధారణ నిర్మాణం. రాత్రులు వెలుగులతో నిండి ఉదయపూర్ సందర్శకుల మదిలో ఎప్పటికి ఒక మంచి జ్ఞాపకం గా ఉండిపోతుంది. పగటి వెలుగులో కూడా తప్పక చూసి అక్కడే కల అతి పెద్ద మార్గ్బుల్ ఏనుగులు రాచ మహిళల ప్రైవేటు భవనం అయిన జేనానా మహల్ శిల్ప కళ చూసి కూడా ఆనందించవచ్చు. మీరు చూసే సమయంలో కనుక ఎవరివైనా వివాహ వేడుకలు జరుగుతూంటే, అది ఒక కన్నుల విందుగా వుంటుంది. మీ పర్యటనకు బోనస్!

మ్యూజియంలు

శిల్పగ్రాం మ్యూజియం
శిల్పగ్రామం ఒక హస్త కళల గ్రామం. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఆరావళి పర్వత శ్రేణుల దిగువ భాగంలో కలదు. ఈ ప్రదేశంలోని గుడిసెలు మీకు ఇండియా లోని వివిధ ప్రదేశాలలోకల వివిధ కళలతో పాటు స్థానికుల హస్త కళలను కూడా ప్రదర్శిస్తాయి. వింటర్ సమయంలో ఈ కళాకారులు వార్షిక క్రాఫ్ట్స్ ఫెయిర్ జరుపుకుంటారు. ఇండియా లోనే ఈ ఫెయిర్ అతి పెద్దదిగా చెపుతారు. ఉదయపూర్ లోని హవాలా విలేజ్ సమీపంలో కల శిల్పగ్రాం మ్యూజియం ఉదయం 11 గం. నుండి రాత్రి 7 గం. వరకూ తెరచి వుంటుంది.

శీతాకాల పర్యటన ఉదయపూర్ సందర్శన !

ఆర్ట్ గాలరీ లు

మేవార్ ఆర్ట్ గాలరీ
రాజస్తాన్ దాని మినిఎచార్ పెయింటింగ్ లకు ప్రసిద్ధి. వీటికి మొగల్ కళల ప్రభావం కలదు. వీటి తయారీలో చెక్క, మార్బుల్ ఉపయోగిస్తారు. మేవార్ ఆర్ట్ గాలరీ లో మీరు అనేక రాజస్థాని పెయింటింగ్ లు వివిధ కళాకారులు చేసిన వస్తువులు అందమైన ఆర్ట్ వర్కులు చూడవచ్చు. గాలరీ ప్రవేశంలో ప్రదర్శనకు ఉంచిన కళాకృతులు అక్కడి పని వారి అద్భుత పని నైపుణ్యం, అంకిత స్వభావం చాటుతాయి. మేవార్ ఆర్ట్ గాలరీ, న్యూ ఫతేపుర లో కలదు.

ఎపుడు పర్యటించాలి ?
ఉదయపూర్ సందర్శనకు డిసెంబర్ నుండి ఫిబ్రవరి నెలల వరకూ గల వింటర్ కాలం ఆహ్లాదంగా వుంటుంది. ఉదయం, సాయంకాలాలు చల్లటి గాలులతో పర్యటన తేలికగా వుంటుంది. పగటి పూట నులి వెచ్చగా వుంటుంది. ఎడారి పర్యటనా ప్రదేశాలైన జైసల్మేర్ వంటివి వింటర్ లో ప్లాన్ చేసినప్పటికీ, నగరాలైన, జైపూర్, ఉదయపూర్, జోద్ పూర్ లు, సంవత్సరంపొడవునా పర్యటించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X