Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఉఖ్రుల్

ఉఖ్రుల్ - సిరోయి కొండలలో ఆకర్షణీయమైన లిల్లీ పువ్వులు ఉన్న ప్రదేశం

19

పచ్చదనం మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆకర్షిస్తూ ఉంటె మీరు తప్పనిసరిగా ఉఖ్రుల్ పట్టణమును సందర్శించాలి. మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రుల్ పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉన్నది. ఉఖ్రుల్ అందం మనల్ని మంత్రముగ్దులను చేస్తుంది. ఈ పట్టణములో ఇరుకైన భవనాలు, ప్రశాంతమైన వాతావరణం కలిగి స్వర్గం వలె ఉంటుందని చెప్పవచ్చు.

ఆకర్షణీయమైన లిల్లీస్

సిరోయి లిల్లీని ఉఖ్రుల్ జిల్లాలో మాత్రమే చూడవచ్చు. ఫ్రాంక్ కిన్గ్దోన్ వార్డ్ అనే ఆంగ్ల వృక్షశాస్త్రజ్ఞుడు లిల్లీ యొక్క ప్రత్యేకమైన నాణ్యతను కనుగొన్న మొదటి వ్యక్తి. అతను దానికి లాంగి మచ్క్లినిఅఎ అని పేరు పెట్టారు. స్థానికులు సిరోయి లిల్లీని కశోన్గ్వోన్ అని పిలుస్తారు. ఇది ఎక్కువగా శిరుఇ కషుంగ్ లేదా శిరొఇ పీక్ లో కనుగొనబడింది.

ఉఖ్రుల్ మరియు పరిసరాలలోని పర్యాటక ప్రదేశాలు

ఉఖ్రుల్ ను సందర్శించటం ఒక మరుపురాని అనుభూతిగా ఉంటుంది. ఉఖ్రుల్ లో ఉన్న అనేక పర్యాటక ఆకర్షణలు ద్వారా ప్రసిద్ది చెందింది. ప్రసిద్ధమైన ఉద్యానవనాలు, శిఖరాలు మరియు జలపాతాలు ఈ ప్రదేశంలోను మరియు చుట్టూ ప్రక్కల కలవు. డంకన్ పార్క్ మరియు ఎల్ శాడై పార్క్ వంటివి పర్యాటకులకు అనువైన పిక్నిక్ స్పాట్ గా ఉన్నాయి. ఖయంగ్ జలపాతాలు మరియు అంగో చింగ్ లను అడవి ప్రాంతంలో ఆసక్తిగల ప్రయాణికులు వీటిని ఇప్పటికీ గుర్తించవచ్చు.

లున్ఘర్ సిహై ఫంగ్రెఇ అనే చదునైన కొండ ప్రదేశం మరియు కచౌఫుంగ్ లేక్ విశ్రాంతికి మరియు సరదాగా నడిచివెళ్ళుట కోసం ఆకర్షణ కలిగిన ప్రదేశాలుగా ఉన్నాయి.  వాస్తవానికి జలపాతాలు, గుహలు, శిఖరాలు, గ్రీన్ టౌన్ ఇవన్నీ ఉఖ్రుల్ యొక్క నైసర్గిక స్వరూపంలో ఒక భాగంగా ఉన్నాయి.

శిరుఇ కశోంగ్ పీక్, ఖయంగ్ పీక్ మరియు నిల్లై టీ ఎస్టేట్ పచ్చదనంతో ఆక్రమిస్తుంది. శిరుఇ కష్నోగ్ పీక్ మే మరియు జూన్ నెలల సమయంలో లిల్లీస్ యొక్క హోస్ట్ ద్వారా మంచుతో కప్పబడుతుంది.ఖంగ్ఖుఇ మంగ్సోర్ గుహ కేవలం పురాతత్వ శాస్త్రం మీద ఆసక్తి ఉన్నవారికి నచ్చుతుంది.

ఉఖ్రుల్ లో ఉండే స్థానికులు

ఉఖ్రుల్ యుద్ధ కళ తెలిసిన తంగ్ఖుల్ నాగ తెగలకు నిలయంగా ఉంది. ఉఖ్రుల్ గొప్ప సాంస్కృతిక కేంద్రంగా ఉంది. ఒక సమయంలో జరిగే ఉఖ్రుల్ పండుగలు చూడటానికి గొప్ప విలువైనవిగా ఉంటాయి. ఈ జిల్లాలో అన్ని కొండలు మరియు పర్వతాలు మరియు పచ్చదనం చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు.

తంగ్ఖుల్ తెగ వారిని ప్రత్యేకంగా వారి విస్తృతమైన దుస్తులను బట్టి గుర్తించవచ్చు. పురుషులు 'హౌరా' అనే ఒక శాలువను ధరిస్తారు. అయితే మహిళలు 'కాషన్' ను ధరిస్తారు. ఇది చాలా మంది పర్యాటకులను విస్మయపరుస్తుంది. వీధుల్లో వారి సంప్రదాయ వస్త్రాలను ధరించటం చూడటానికి చాలా సర్వసాధారణంగా ఉంటుంది.

ఉఖ్రుల్ గురించి చెప్పుకోదగిన విషయం జనాభాలో 90% కంటే ఎక్కువ అక్షరాస్యులుగా ఉన్నారు. నిజానికి ప్రతిష్టాత్మక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేరడానికి నార్త్ ఈస్ట్ నుండి మొదటి గిరిజన ప్రొఫెసర్ గా ప్రొఫెసర్ హోరం ఉఖ్రుల్ నుండి వచ్చారు.

ఉఖ్రుల్ సందర్శించడానికి ఉత్తమ సమయం

ఉఖ్రుల్ సందర్శించడానికి అనువైన సమయం వేసవి సమయంలో ఉంది.

ఉఖ్రుల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఉఖ్రుల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఉఖ్రుల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఉఖ్రుల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ఇంఫాల్ నుండి ఉఖ్రుల్ కు చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉత్తమ మార్గం. ఉఖ్రుల్ చేరుకోవటానికి మణిపూర్ మరియు ఇతర ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. కానీ రాజధాని నగరం నుండి ప్రయాణిస్తున్నప్పుడు మెరుగైన బస్సు సేవలు ఉన్నాయి. ఉఖ్రుల్ జేస్సామి ద్వారా కోహిమాలను కలుపుతుంది. ఇది జాతీయ రహదారి 150 కు అనుసంధానించబడింది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ఉఖ్రుల్ కు సమీపంలోని రైల్వే స్టేషన్ 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిమాపూర్ లో ఉంది. ఉఖ్రుల్ నుండి 215 కిలోమీటర్ల దూరంలో జిరిబం నారో గేజ్ లైన్ ఉంది. అయితే డిమాపూర్ నుండి టాక్సీలు మరియు బస్సులు సులభంగా అందుబాటులో ఉంటాయి. కానీ మొదటి ఇంఫాల్ చేరుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం ఉఖ్రుల్ కు సొంత విమానాశ్రయం లేదు. ఇంఫాల్ విమానాశ్రయం సేవలు అందిస్తుంది. ఉఖ్రుల్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంఫాల్ ను రోడ్డు మార్గం ద్వారా చేరవచ్చు. ఇంఫాల్ విమానాశ్రయం గౌహతి ద్వారా దేశం యొక్క మిగిలిన ప్రాంతాలతో అనుసంధానం కలిగి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue