Search
  • Follow NativePlanet
Share

అంబాజీ - అతి పురాతన తీర్థ యాత్ర  !!

18

అంబాజీ, భారతదేశంలోని అతి పురాతన, ఎంతో ఖ్యాతి పొందిన పురాతన తీర్థయాత్రా కేంద్రాలలో ఒకటి. ఇది శక్తి అమ్మవారికి చెందిన యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులో బనస్కాంత జిల్లాలో దంతా తాలూకాలోని గబ్బర్ కొండల పైన అంబాజీ మాత పీఠం ఉంది. అంబాజీ ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది, అదీ ప్రత్యేకంగా భాదర్వీ పూర్ణిమ, దీపావళి లాంటి పర్వదినాల్లో. దీని చుట్టూ అరావళి పర్వతాల్లోని దట్టమైన అడవులు వున్నాయి. ఇక్కడ ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికతల మేలుకలయిక పర్యాటకులను ఆనందపరుస్తుంది.

గబ్బర్ కొండలు

సముద్రమట్టానికి 1,600 అడుగుల ఎత్తున పురాతన ఆరావళి పర్వతాల నైరుతి వైపున ఉన్న అరాసుర్ కొండలపైన వేదకాలపు సరస్వతి నది జన్మస్థానానికి దగ్గరలో గబ్బర్ కొండలు ఉన్నాయి. ఈ నిటారు గబ్బర్ కొండలు ఎక్కడం చాల కష్టం. తీర్థయాత్రికులు కొండ పాదాల నుండి 300 రాతి మెట్లను ఎక్కి ఒక సన్నని ప్రమాదకర మార్గాన్ని చేరవలసి ఉంటుంది.

ధార్మిక ప్రాముఖ్యత

అంబాజీ ఆలయాన్ని భారతదేశ ప్రధాన శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం సతీదేవి దేహంలోని గుండె గబ్బర్ కొండల పైన పడింది. అరసుర్ కొండల పై ఉండటం వలన పవిత్ర “అరాసురి అంబాజీ” గా పిలిచే ఈ ఆలయంలో ఈ దేవత విగ్రహం ఉండదు. “శ్రీ విస యంత్రాన్ని” ప్రధాన విగ్రహంగా కొలుస్తారు. ఈ యంత్రాన్ని కన్నులతో చూడరాదు. ఈ వీసా శ్రీ యంత్రాన్ని పూజించడానికి కళ్ళకు గంతలు కట్టుకోవలసి ఉంటుంది. ప్రతి ఏటా భాద్రపద పౌర్ణమి నాడు ఇక్కడ ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది, దేశం నలుమూలల నుండి ప్రజలు అంబే మాతను పూజించడానికి జూలై నెలలో ఇక్కడకు వస్తారు. దీపావళి పండుగ సందర్భంగా కూడా అంబాజీ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. మహాభారతంలో కూడా అంబాజీ ప్రస్తావన ఉంది. పాండవులు వనవాసం చేసేటప్పుడు అంబాజీ మాతను కొలిచేవారని ఈ కథ తెలియచేస్తుంది.

భౌగోళిక స్థితి

గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులో కదియద్రకు 73 కిలోమీటర్ల దూరంలో, మౌంట్ అబూ నుండి 45 కిలోమీటర్లు, పాలంపూర్ నుండి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పర్యాటక ఆకర్షణలు

గబ్బర్ పైన సుందర దృశ్యాలనే కాక రోప్ వే ఎక్కడం ద్వారా కూడా ఆనందించ గలిగిన కైలాష్ కొండలు వంటి ప్రాంతాలు ఉన్నాయి.

తీర్థయాత్రికులు తరచూ సందర్శించే మరి కొన్ని ధార్మిక ప్రాంతాలు కూడా గబ్బర్ కొండల పై ఉన్నాయి. ప్రధాన ఆలయం వెనుక మన్ సరోవర్ అనే చెరువు ఉంది. ఈ పవిత్ర చెరువు రెండు ప్రక్కల ఒకటి మహాదేవునికి, రెండవది అంబాజీ మాత సోదరి అజయ్ దేవికి చెందిన దేవాలయాలు రెండు ఉన్నాయి.

వేద కాలపు స్వచ్చమైన నది సరస్వతి జన్మస్థానానికి దగ్గరలో అంబాజీ ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో పురాతన శ్రీ కోటేశ్వర మహాదేవ ఆలయం ఉంది. ఇది గౌముఖ్ వద్ద ఒక పవిత్ర జలాశయంతోను, సరస్వతి నదితోను కలిసింది.

అంబాజీ, అనేక మంది భక్తులు గౌరవించే, వివిధ మతాలకు, నేపథ్యాలకు చెందిన తీర్థయాత్రికులు విచ్చేసే ప్రసిద్ధ భారత దేశ తీర్థయాత్రా కేంద్రం.

అంబాజీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అంబాజీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అంబాజీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అంబాజీ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం అంబాజీకు అహ్మదాబాద్ (180కి.మీ.), అబూ రోడ్డు స్టేషన్ (20కి.మీ.), మౌంట్ అబూ(45కి.మీ.), ఢిల్లీ (785కి.మీ.), పాలంపూర్ (65కి.మీ.), హిమ్మత్ నగర్ (102కి.మీ.) వంటి నగరాలతో అనుసంధానం ఉంది. ఈ నగరాల నుండి అంబాజీకు రాష్ట్రానికి చెందిన బస్సులు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వార అబూ రోడ్డు స్టేషన్, అంబాజీ నుండి 20 కిలోమీటర్ల దూరంలోని అతి దగ్గరి రైలు స్టేషన్. ఇక్కడి నుండి ఢిల్లీ తో బాటు అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు అందుబాటులో ఉంటాయి. స్టేషన్ నుండి అంబాజీకు టాక్సీసేవలు 200 రూపాయల కనీస చార్జీలతో అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ద్వార అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం అంబాజీకు 180 కిలోమీటర్ల దూరంలో అతి దగ్గరగా ఉంది. విమానాశ్రయానికి టాక్సీ చార్జీ సుమారు 2500 రూపాయలు ఉంటుంది. ఈ విమానాశ్రయానికి భారతదేశ ప్రధాన నగరాలతో బాటుగా కొన్ని విదేశీ నగరాలకు కూడా అనుసంధానం ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue