రాజస్థాన్ లోని బరన్ జిల్లాను ఏప్రిల్ 10, 1991 న కోట జిల్లా నుంచి వేరు చేసి ఏర్పరిచారు. ఈ ప్రాంతం అంతా సగావన్, ఖేర్, సలాన్, గర్గ్సరి అడవులతోనూ, ఈ ప్రాంతం గుండా ప్రవహించే కాలిసింద్ నది తోనూ ఆక్రమి౦చబడి వుంది. ఈ ప్రాంతం 14, 15 శతాబ్దాలలో సోలంకి రాజపుత్రుల చేత పాలించబడింది.
రామాయణంలో బరన్ : బరన్ లో దేశం అంతటి నుంచీ యాత్రికులను ఆకర్షించే పలు ప్రాంతాలు వున్నాయి. సీతాబరి, కకొని, బిలాస్ఘర్, శాహాబాద్ కోటలు ఇక్కడి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో కొన్ని. వీటిలో సితాబరి కి చారిత్రిక, ధార్మిక ప్రాముఖ్యం కూడా వుంది. హిందూ పురాణ గాధల ప్రకారం, శ్రీరాముని భార్య సీతా దేవి లవకుశులకు ఇక్కడే జన్మనిచ్చింది. అయోధ్యను వీడిన సీత తన పిల్లలతో కలిసి ఇక్కడే నివసించినదని భావిస్తారు. సీతాదేవి పేరిట నిర్మించిన ఒక ఆలయం కూడా ఇక్కడ వుంది. ఈ గుడి చుట్టుపక్కల యాత్రికులు వివిధ జల కుండాలను చూడవచ్చు. సీతాబరి మేళా అనే ప్రసిద్ధ సంత ఏటా ఇక్కడ జరుగుతుంది.
కొన్ని ముఖ్య దేవాలయాలు : భంద్ దేవరా దేవాలయం, బ్రహ్మణి మాతాజీ దేవాలయం, మణిహార మహాదేవ మందిరం ఇక్కడి ప్రధాన ధార్మిక కేంద్రాల్లో వున్నాయి. బరన్ లోని ఆత్రు తహశీల్ లో యాత్రికులు గర్గచ్చ్ అవశేషాలు కూడా చూడవచ్చు. 9 నుంచి 13 శతాబ్దాల మధ్య నిర్మించిన పురాతన దేవాలయాలు కూడా ఇందులో వున్నాయి. బరన్ చేరుకోవడం : భంద్ దేవరా దేవాలయం బరన్ లోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. అలాగే దీనిని ‘రాజస్థాన్ ఖజురహో’ అనికూడా పిలుస్తారు, ఈ ఆలయం రాంగడ్ కొండమీద బరన్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివుడి విగ్రహంతో ఈ దేవాలయం 10వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ కొండమీద కిస్నాయి, అన్నపూర్ణా దేవి ఆలయాలు కూడా ఉన్నాయి.
ఈ ప్రాంతం నించి దేశం లోని ఇతర ప్రధాన ప్రాంతాలకు వాయు, రైలు, రోడ్డు మార్గాలు అనుసంధానించబడి ఉన్నాయి. బరన్ కి జైపూర్ విమానాశ్రయం, బరన్ రైల్వే స్టేషన్ దగ్గరలో వున్నాయి. యాత్రీకులు బరన్ వెళ్ళడానికి అజ్మీర్, బికనేర్, జైపూర్, డిల్లీ, కోటా, గ్వాలియర్ తో సహా సమీపంలోని ఇతర నగరాల నుండి కూడా బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సందర్శనకు ఉత్తమ సమయం బరన్ వెళ్ళాలనుకునే పర్యాటకులకు ఫిబ్రవరి, అక్టోబర్ నెలల మధ్య సమయం అనువుగా ఉంటుంది. ఆ సమయంలో అక్కడి వాతావరణం సందర్శనకు అనువుగా ఉంటుంది.



Click it and Unblock the Notifications