Search
  • Follow NativePlanet
Share

భట్కల్ - చరిత్రలో మరచిపోతున్న ఒక ఓడరేవు పట్టణం

17

భట్కల్ పట్టణం కర్నాటక రాష్ట్రంలో అతి పురాతన పట్టణం. గత చారిత్రక వైభవం కలది. దేశంలోని పురాతన ఓడరేవులలో ఒకటి. ఈ పట్టణం ఉత్తర కన్నడ లో కార్వార్ కు 130 కి. మీ. ల దూరంలో ఆహ్లాదకర బీచ్ లతో నిండి ఉంది. భట్కల్ పట్టణం కొంకణ్ రైల్వేకు అనుసంధానించబడి, జాతీయ రహదారి 17 కు దగ్గరగా ఉంటుంది.  భట్కల్ పట్టణ గత చరిత్రలోకి తొంగి చూస్తే... భట్కల్ చరిత్ర ఆసక్తి కరంగా ఉంటుంది. అది హొయసల రాజుల వంశ చరిత్రలో ఒక భాగంగా ఉంటుంది. ఎప్పటికపుడు ఈ పట్టణం దండయాత్రలకు గురవుతోంది. ఈ పట్టణాన్ని అనేక వంశాలు పాలించాయి. వాటిలో విజయనగర రాజులు, సాళువ పాలకులు, చోళులు కూడా ఉన్నారు. ఈ పట్టణంపై పోర్చుగీస్ ప్రభావం బాగా ఉంటుంది. టిప్పు సుల్తాన్ తాను బ్రిటీష్ వారిచే పూర్తిగా ఓడించబడేటంతవరకు ఈ పట్టణంపై పట్టు కలిగి ఉన్నాడు.

ఈ రకమైన వివిధ పాలకుల ప్రభావం భట్కల్ పట్టణాన్ని ఒక విభిన్న పట్టణంగా మార్చింది. ఈ పట్టణంలో దేవాలయాలు, మసీదులు, జైన్ చావడులు ఎన్నో ఉన్నాయి. ఈ పట్టణంలోని జామియా మసీద్, ఖలీఫా మసీద్ మరియు నూర్ మసీద్ వంటివి ఎంతో పేరు పొందాయి. ఇక్కడ ఉన్న దేవాలయాలలో కేతపయ్య నారాయణ దేవాలయం ప్రసిద్ధి గాంచింది. పర్యాటకులు ఇక్కడి బీచ్ లలో విశ్రాంతి పొందుతారు.  

భట్కల్ సందర్శనకు తేలిక మార్గం అంటే రైలు లేదా రోడ్ మార్గం. దీనికి సమీప విమానాశ్రయం మంగుళూరులో ఉంది. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తారు. ఈ సమయంలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

భట్కల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

భట్కల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం భట్కల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? భట్కల్

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - భట్కల్ పట్టణం దేశంలోని వివిధ నగరాలకు రోడ్డు ద్వారా కూడా కలుపబడింది. హైద్రాబాద్, మంగుళూరు, గుల్బర్గా, హుబ్లీ, బీదర్, ముంబై, పూనే వంటి ప్రధాన నగరాలనుండి భట్కల్ కు బస్సులున్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - భట్కల్ రైలు స్టేషన్ దేశంలోని ప్రధాన నగరాలు అంటే న్యూఢిల్లీ, జైపూర్, మార్గోవా మొదలైన వాటితో కలుపబడి భట్కల్ నగరానికి 5 కి.మీ. దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    భట్కల్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం - దేశీయ విదేశీయ పర్యాటకులకు అనువైన మంగుళూరు విమానాశ్రయం భట్కల్ సమీపంలో ఉంది. భట్కల్ నుండి ఈ విమానాశ్రయం 144 కి.మీ. దూరంగా ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue