Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» హరిద్వార్

హరిద్వార్ - 'దేవతల కు ప్రవేశ ద్వారం' !

47

హరిద్వార్ లేదా హర ద్వార్ అనేదానికి అర్ధం అక్షరాల చెప్పవలెనంటే 'దేవతల కు ప్రవేశ ద్వారం' అని చెప్పాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రం లో కల అందమైన ఈ పర్వత పట్టణం ఒక తీర్థ యాత్రా స్థలం. ఇది హిందువులకు చాలా ప్రధానమైనది. ఇండియా లోని సప్త పూరీలు గా అంటే ఏడూ పవిత్ర నగరాల లో ఒకటిగా ఈ ప్రదేశం చెప్పబడుతోంది. ఇంతేకాక ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ లోని మరొక మూడు ప్రదేశాలకు కూడా ప్రవేశంగా వుంటుంది అవి రిషికేశ్, కేదార్నాథ్ మరియు బద్రి నాథ్ లు.

హరిద్వార్ పట్టణాన్ని మాయా పూరి, లేదా, కపిల లేదా మోక్షద్వార్, మరియు గంగా ద్వార్ అని కూడా పిలుస్తారు. ఈ పేర్లు వివిధ పురాతన హిందూ పురాణాలలో పేర్కొనబడ్డాయి. ఈ పవిత్ర ప్రదేశం యొక్క చరిత్ర పరిశీలిస్తే, ఇది సుమారుగా రాజు విక్రమాదిత్యుడు కాలం నాటిది. ఈ ప్రదేశం అక్కడ కల ప్రపంచ ప్రఖ్యాత మత పర కేంద్రాలకు మరియు టూరిస్ట్ ఆకర్షణలకు పేరు గాంచినది. ఇక్కడ కల పవిత్ర ప్రదేశాలు చాలా వరకు గంగా నది ఒడ్డున కలవు.

ఇక్కడ ప్రధాన ప్రదేశం హర -కి -పురి. దీనిని చాలా మంది బ్రహ్మ కుండ్ అని అంటారు. ఈ స్థలం వద్ద గంగా నది పర్వతాల నుండి వెలికి వచ్చి మైదానాలలో కి ప్రవేశిస్తుంది. ఇక్కడి స్నాన ఘట్టాలలో భగవానుడు విష్ణు మూర్తి పాద ముద్రలు కూడా చూడ బడతాయి. యాత్రికులు ఈ ప్రదేశంలో అనేక మతపర కార్యక్రామాలు చేస్తారు. అవి సిరోముండనం అంటే తలకు వెంట్రుకలు తీయుట, 'ఆస్థి విసర్జనం ' అంటే చనిపోయిన వారి అస్థికలు లేదా బూడిద నది లో కల్పుట వంటివి. ప్రతి 12 సంవత్సరాలకు ఇక్కడ 'కుంభ మేలా' నిర్వహిస్తారు. దీనికి ప్రపంచం నలుమూల నుండి యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు.

ఇక్కడ ఇంకా, మాయా దేవి టెంపుల్, మానస దేవి టెంపుల్, మరియు చండి దేవి టెంపుల్ కూడా కలవు. ఈ మూడు టెంపుల్ లు ఇండియా లోని 52 శక్తి పీఠాలలోనివి గా చెపుతారు.

పురాణాల మేరకు పార్వతి రూపమైన సతి అనే దేవత తన తండ్రి తన భర్త శివుడిని అవమాన పరచడంతో తన జీవితాన్ని ఇక్కడ త్యాగం చేసిందని చెపుతారు. సతి మరణం శివుడిని కలవర పరిచిందని అపుడు శివుడు ఆమె మృత దేహాన్ని తీసుకొని కైలాష్ పర్వతానికి వెళ్ళాడని చెపుతారు. శివుడు ఆమెను తీసుకు వెళ్ళేటపుడు, ఆమె శరీర మృత భాగాలు అక్కడ వివిధ ప్రదేశాలలో పడ్డాయని కధనంగా కలదు. ఆ దేవత బొడ్డు మరియు గుండె పడ్డ ప్రదేశం లో సరిగ్గా మాయా దేవి టెంపుల్ నిర్మిత మైనదని చెపుతారు.

వైష్ణో దేవి టెంపుల్, భారత మాత టెంపుల్, మరియు పిరాన్ కైలార్ వంటివి మరి కొన్ని దర్శనీయ క్షేత్రాలు. చాలా మందికి జమ్మూ లోని వైష్ణో దేవి టెంపుల్ ఆకారం లో ఇక్కడ ఒక వైష్ణో దేవి టెంపుల్ కట్టారనేది తెలియదు. ఈ టెంపుల్ కు వెళ్ళే మార్గం కూడా జమ్మూ లోని వైష్ణో దేవి టెంపుల్ మార్గం వలెనె పూర్తిగా సొరంగాలు, గుహలు కలిగి వుంటుంది.

భారత మాత టెంపుల్ భారత మాతకు అంకితం చేయబడిన హరిద్వార్ లోని ఒక ప్రసిద్ధి టెంపుల్. ఈ టెంపుల్ ను మత గురు స్వామీ సత్యమిత్రానంద గిరి నిర్మించారు. దీనిలో ఎనిమిది అంతస్తులు వుంటాయి. ప్రతి ఒకటి కూడా వివిధ దేవతలకు మరియు స్వాతంత్ర పోరాట యోధులకు అంటే , మహాత్మా గాంధి, వీర సావర్కార్, సుభాస్ చంద్ర బోస్ వంటి వారికి అంకితం చేయబడ్డాయి. ఈ టెంపుల్స్ మాత్రమే కాక, ఇక్కడ సప్త రుషి ఆశ్రం, శ్రావనాద్ జి టెంపుల్, చిల్లా వైల్డ్ లైఫ్ సంక్చురి, దక్ష మహాదేవ టెంపుల్, గోవు ఘాట్ వంటి వాటికి కూడా యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు.

సప్త రుషి ఆశ్రం మత పరంగా విశిష్ట మైనది. హిందూ పురాణాల మేరకు, ఈ ఆశ్రమం సప్త రుషి లు లేదా ఏడుగురు ఋషులు అంటే అత్రి, కాశ్యప, జమదగ్ని, భరద్వాజ, వసిష్ట , విశ్వామిత్ర మరియు గౌతం ఋషులు ఇక్కడ ధ్యానం చేసేవారు.

హరిద్వార్ వచ్చిన యాత్రికులు ఇక్కడ జరిగే వివిధ ఉత్సవాలలో అంటే రామనవమి, బుద్ధ పూర్ణిమ, కన్వార్ మేళ, దీపావళి వంటి వాటిలో పాల్గొనవచ్చు. ప్రతి సంవత్సరం కన్వర్ మేలా నిర్వహణ లో హరిద్వార్ కు సుమారు మూడు మిలియన్లకు పైగా యాత్రికులు వస్తారు.

హరిద్వార్ ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం మాత్రమేకాక ఇక్కడ కల భారత్ హెవీ ఎలేక్ట్రికల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ కారణంగా పారిశ్రామిక నగరంగా కూడా చెప్పబడుతోంది. మొట్ట మొదటి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ లేదా ఐ ఐ టి రూర్కీ కూడా ఇక్కడే స్థాపించ బడింది.

పర్యాటకులు వాయు, రైలు, రోడ్డు మార్గాల లో తేలికగా హరిద్వార్ చేరవచ్చు. సమీప ఎయిర్ పోర్ట్ జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్. ఇది సుమారు 34 కి.మీ.ల దూరంలో కలదు. ఢిల్లీ లోని ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఇక్కడకు తరచు విమాన సేవలు నడుపు తుంది. హరిద్వార్ లో రైలు స్టేషన్ కలదు. ఇక్కడి నుండి ఇండియా లోని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. రోడ్డు మార్గంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు కలవు. న్యూ ఢిల్లీ నుండి బస్సు లు తరచుగా నడుస్తాయి.

హరిద్వార్ లో వేసవులు వేడి గాను, వింటర్ అతి చలిగాను వుంటాయి. వర్షాకాలం తేమ అధికం. సందర్శనకు వర్షా కాలం సూచించ దగినది కాదు. హరిద్వార్ సందర్శనకు సెప్టెంబర్ నుండి జూన్ నెల వరకూ కల ఆహ్లాదకర సమయం సూచించదగినది.

హరిద్వార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హరిద్వార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హరిద్వార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హరిద్వార్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం హరిద్వార్ పట్టణం కు దేశం లోని వివిధ ప్రదేశాల నుండి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు లు నడుస్తాయి. హరిద్వార్ - న్యూ ఢిల్లీ ల మధ్య అనేక డీలక్స్ బస్సు లు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం హరిద్వార్ కు రైలు స్తైఒన్ కలదు. ఇక్కడ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు నడుస్తాయి. సిటీ నది బొద్దు నుండి సుమారు ఒక కిలో మీటర్ దూరం లో రైల్ స్టేషన్ కలదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం హరిద్వార్ కు సమీప ఎయిర్ పోర్ట్ డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ . ఇది సుమారు 34 కి. మీ. ల దూరం లో కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి న్యూ ఢిల్లీ కి ప్రతి రోజూ విమానాలు కలవు. ఈ విమానాశ్రయం నుండి టాక్సీ లలో హరి ద్వార్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed