Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కీలాంగ్

కీలాంగ్ - ‘ఆశ్రమ భూమి'  !

24

‘ఆశ్రమ భూమి’గా పిలువబడే కీలాంగ్ – హిమాచల్ ప్రదేశ్ లో సముద్ర మట్టానికి 3350 మీటర్ల ఎత్తున నెలకొని వున్న అందమైన పర్యాటక ఆకర్షణ. లాహౌల్-స్పితి జిల్లాకు ప్రధాన కేంద్రం గా వ్యవహరించే కీలాంగ్ లో చాలా పర్యాటక ఆకర్షణలు వున్నాయి. ‘ఖచ్చితంగా ఇక్కడ దేవతలుంటారు – ఇక్కడ మనుషులకు స్థానం లేద’ని ప్రసిద్ధ రచయిత రడ్యార్డ్ కిప్లింగ్ అన్నాడు. ఉల్లాసపరిచే పురాతన పర్వత శ్రేణులు, దట్టమైన పచ్చటి లోయలు నిజంగా ఉత్కంఠభరితంగా వుంటాయి.

చారిత్రిక ప్రాధాన్యం కలిగి, ప్రత్యేకమైన నిర్మాణ శైలిలో వుండే బౌద్ధారామాలు చూసే అవకాశం కల్పిస్తుంది కీలాంగ్. కార్దంగ్ విహారం, షసుర్ విహారం ఈ ప్రాంతంలో ప్రసిద్ది చెందాయి. సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తున 900 ఏళ్ళ నాడు ఏర్పడింది కార్దంగ్ విహారం. షసుర్ విహారాన్ని భూటాన్ లోని నావంగ్ నాంగ్యాల్ మహారాజు వద్ద పనిచేసే బౌద్ధ గురువు జాన్స్కార్ కు చెందిన లామా దేవా గ్యాత్షో ఈ విహారాన్ని 17వ వ శతాబ్దంలో నిర్మించాడు. గురు ఘంటాల్ విహారం, తాయుల్ విహారం, గేముర్ విహారం ఇక్కడి ఇతర ప్రసిద్ధ విహారాలు.

తండి, సిస్సు, ఉదయపూర్ లాంటి కొన్ని ఇతర ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు కూడా వున్నాయి. చంద్రా నదీ తీరం వెంట వున్న ప్రముఖ గ్రామం సిస్సు కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. వర్షాకాలంలోను, శిశిర ఋతువు లోను ఈ ప్రాంతంలో పర్యాటకులు అడవి కొంగలు, బాతులను కూడా చూడవచ్చు. త్రిలోకనాద్ దేవాలయం, మార్కులా దేవి దేవాలయాలకు ఉదయపూర్ గ్రామం ప్రసిద్ది చెందింది. పర్వతారోహణ, చేపలు పట్టడం, జీప్ సవారీ, పేరా గ్లైడింగ్, స్కీయింగ్, క్యాంపింగ్ లాంటి సాహస క్రీడలకు కూడా కీలాంగ్ ప్రసిద్ది చెందింది.

కీలాంగ్ కు రావాలనుకునే యాత్రికులు వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి 165 కిలోమీటర్ల దూరంలో వున్న భు౦టార్ ఇక్కడికి సమీప విమానాశ్రయం. దీనికి న్యూడిల్లీ, ముంబై లాంటి నగరాల నుంచి విమానాలు నడుస్తాయి. కీలాంగ్ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో వున్న జోగీందర్ నగర్ రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరి రైల్ కేంద్రం. పర్యాటకులు మనాలి నుంచి నడిచే ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల ద్వారా కూడా కీలాంగ్ కు చేరుకోవచ్చు.

మే నుంచి అక్టోబర్ వరకు వుండే వేసవి కాలం కీలాంగ్ సందర్శనకు ఉత్తమ సమయ౦.

కీలాంగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కీలాంగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కీలాంగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కీలాంగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : మనాలి నుంచి కీలాంగ్ కు చాలా ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు అందుబాటులో వున్నాయి. ఈ రెండు నగరాల మధ్య 115 కిలోమీటర్ల దూరం వుంది, మనాలి నుంచి నియమిత సమయాల్లో బాసులు కీలాంగ్ కు బయలుదేరతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : ఇక్కడి నుంచి 280 కిలోమీటర్ల దూరంలో వున్న జోగీందర్ నగర్ కీలాంగ్ కు సమీప రైల్వే స్టేషన్. ముంబై, డిల్లీ లాంటి నగరాలకు ఈ స్టేషన్ బాగానే అనుసంధానం చేయబడింది. పర్యాటకులు ఇక్కడి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు లేదా టాక్సీల ద్వారా కీలాంగ్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    పర్యాటకులు వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా కీలాంగ్ చేరుకోవచ్చు. వాయు మార్గం : నగర కేంద్రానికి 168 కిలోమీటర్ల దూరంలో వున్న భుంటార్ కీలాంగ్ సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం న్యూడిల్లీ, ముంబై, శ్రీనగర్ లాంటి నగరాలకు బాగా అనుసంధానం చేయబడి వుంది. విమానాశ్రయం బయటినుంచి కీలాంగ్ చేరుకోవడానికి బస్సులు లేదా టాక్సీలు అందుబాటులో వు౦టాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri