Search
  • Follow NativePlanet
Share
» »రీసైక్లింగ్‌కు స‌రికొత్త నిర్వ‌చ‌నం.. ఎన‌ర్జీ కేఫ్‌!

రీసైక్లింగ్‌కు స‌రికొత్త నిర్వ‌చ‌నం.. ఎన‌ర్జీ కేఫ్‌!

రీసైక్లింగ్‌కు స‌రికొత్త నిర్వ‌చ‌నం.. ఎన‌ర్జీ కేఫ్‌!

ప్ర‌పంచవ్యాప్తంగా మ‌నం వాడిప‌డేసిన వ‌స్తువుల‌తో ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు వాటిళ్లుతోంద‌ని టీవీల్లో.. వార్త‌ల్లో.. నిత్యం వింటూనే ఉంటాం. అలాంటి వ‌స్తువుల‌ను మ‌ర‌లా ఉప‌యోగించేలా చాలామంది వినూత్నంగా కృషిచేస్తూనే ఉన్నారు. అలా ప‌నికిరాని వ‌స్తువుల‌తో త‌యారు చేసిన‌ క‌ళాకృతుల‌ను మ‌నం చాలానే చూసుంటాం. ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే ఎన‌ర్జీ కేఫ్ కూడా అలాంటిదే. రీసైక్లింగ్ కు స‌రికొత్త నిర్వ‌చనం చెబుతోన్న ఆ కేఫ్ విశేషాల‌ను తెలుసుకుందామా?!

పాట్నాలోని బోలీ రోడ్డు సమీపంలో విద్యుత్ భవన్. దీని కాంపౌండ్ దాటగానే ఆకర్షణీయమైన రంగులతో అలంకరించి ఉన్న చిన్న బిల్డింగ్ తారసపడుతుంది. అదే 'ఎనర్జీ కేఫ్' బిల్డింగ్. ఈ కేఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు విద్యుత్ భవనంలోని పాత, పనికిరాని సామాన్లను ఉపయోగించి రీసైక్లింగ్ చేసినవే. ఇది రీసైక్లింగ్ ఎనర్జీ సేవింగ్స్ ఉద్దేశానికి అద్దంపడుతుంది. అదే ఈ కేఫ్ ప్రత్యేకత. దీనిని ఏర్పాటు చేసి ఏళ్లు గ‌డుస్తున్న విభిన్న ప్ర‌దేశాల జాబితాలో నేటికీ ఇది కొన‌సాగుతూనే ఉంది.

cover-pic-1551081093-1662965486.jpg -Properties

వారి ఆలోచ‌న కార్య‌రూపమే.. కేఫ్‌

ఇక‌, ఈ కేఫ్ ఆవిర్భావం గురించి తెలుసుకుంటే భ‌లే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. పాట్నాలోని మీఠాపూర్‌లో విద్యుత్తు శాఖకు సంబంధించిన పవర్ ప్లాంట్ మూసివేశారు. అయితే, అక్కడి క్యాంటిన్‌లో ఉపయోగించే ఛాయ్ కేట్లీ, కేఫ్‌లోని గోడలపై వేలాడుతూ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కేఫ్‌ను తయారుచేయాలనే ఆలోచన అప్ప‌టి బీహార్ విద్యుత్‌ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమృత్, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ మంజిత్, నేహాసింగ్‌కు వచ్చిందట. ఆ ఆలోచ‌న కార్య‌రూపం దాల్చ‌డంతో ఈ కేఫ్ ఆవిర్భ‌వించింది.

ఈ కేఫ్ సైన్ బోర్డు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని తయారుచేయడానికి పాత సైకిల్లోని విడి భాగాలను ఉపయోగించారు. ఇక్క‌డి గోడ‌లు మిన‌హా.. ఎక్క‌డ చూసినా మ‌నం రోజూ వాడి ప‌డేసే వ‌స్తువులే అందంగా ఆహ్వానం ప‌లుకుతున్న‌ట్లు తార‌స‌ప‌డ‌తాయి.

-13728300833-1662965494.jpg -Properties

అంబాసిడర్ కారునూ వ‌ద‌ల్లేదు..

కేఫ్ కోసం పాత ఇనుప డ్ర‌మ్ముల‌ను క‌ట్ చేసి కుర్చీలు, సెంటర్ టేబుల్స్‌గా తయారుచేశారు. ఎలక్ట్రికల్ ఫ్యాన్లుకు చెందిన వ‌స్తువుల‌తో టేబుల్స్, బెంచీలను కూడా తయారుచేశారు. అందుకే దీనిలోప‌ల‌కు అడుగు పెట్ట‌గానే ఎలక్ట్రికల్ ఫ్యాన్ల నట్లు, బోల్టులు కూడా మనకి కనిపిస్తాయి. అక్కడే ట్రాన్స్ఫార‌మ్ ఆయిల్ డ్రమ్‌తో కూర్చోవడానికి టూల్ (సిట్టింగ్ టూల్)ను అందంగా తయారుచేశారు. ఇన్సులేటర్, డస్ట్ బిన్, ఎలక్ట్రికల్ వైర్లతో మోడ్రన్ ఆర్ట్ తయారుచేశారు. మెన్ బోర్డు, గోడ గడియారం పాత కలప చెక్కతో తయారుచేశారు. కేఫ్‌లో ఒక పాత అంబాసిడర్ కారును సోఫాగా మార్చేశారు. ఈ కారు 2001 వరకు బీహార్ స్టేట్ ఎలక్ట్రికల్ బోర్డు అధికారిక ఛైర్మన్ కారుగా ఉండేది. ఈ కారు నెంబర్ ప్లేట్ కూడా కేఫ్ లోని గోడలకు ఒక షో పీస్ మాదిరిగా వేలాడదీసి ఉంటుంది. ఇక్క‌డికి వ‌చ్చేవారు టీ, కాఫీలకంటే.. సెల్ఫీల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు మ‌రి.

-13827869913-1662965509.jpg -Properties

ఇలా రీసైక్లింగ్ చేసే విధానాన్ని అందరూ అలవాటు చేసుకుంటే నిరుపయోగ వస్తువులే కనిపించవేమో కదూ? మ‌రి ఆల‌స్య‌మెందుకు, మీ క్రియేటివిటీకి ప‌దునుపెట్టండి. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవ‌డంలో మ‌న వంతు బాధ్య‌త మ‌న‌మూ తీసుకోవాలి క‌దా! అప్పుడే భ‌విష్య‌త్తు త‌రాల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ర్యావ‌ర‌ణాన్ని అందించ‌గ‌లం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X