Search
  • Follow NativePlanet
Share
» »చారిత్ర‌క నిర్మాణాల నేల‌.. సిక్కోలు జిల్లా! (రెండ‌వ భాగం)

చారిత్ర‌క నిర్మాణాల నేల‌.. సిక్కోలు జిల్లా! (రెండ‌వ భాగం)

శ్రీ‌కాకుళంలోని మందస మండలంలో ఉన్న వాసుదేవ పెరుమాళ్ళు ఆలయాన్ని సంద‌ర్శించేందుకు బ‌య‌లుదేరాం. దీనిని అలనాటి చారిత్రక కట్టడానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. 1206 సంవత్సరంలో మందస ప్రాంతాన్ని పరిపాలించిన రాజా వామన్ సింగ్ దేవ్ పాత కోట ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని ఆశించారు. తర్వాత రాజవంశీయులు 14 శతాబ్దంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు.

తర్వాత రాజవంశీయులు 14 శతాబ్దంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు. అనివార్య కారణాల వల్ల ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట జరపలేకపోయారు. 1744వ సంవత్సరంలో కాంచీపురం శాలిగ్రామ ఏకశిలా విగ్రహాన్ని తెప్పించి వాసుదేవ పెరుమాళ్ళు పేరుతో విగ్రహ ప్రతిష్ట చేశారు. కొన్ని దశాబ్దాల తర్వాత దేవాదాయశాఖ ఈ ఆలయాన్ని స్వాధీనపరచుకుంది. ఇది శిథిలావస్థకు చేరుకుంటున్న సమయంలో శ్రీ మదుభయ వేదాంతాచారి పీఠం వారు ఆలయాన్ని అభివృద్ధి పేరుతో 2000 సంవత్సరంలో దేవాదాయశాఖ తీసుకొని పునర్నిర్మించారు

చారిత్ర‌క నిర్మాణాల నేల‌.. సిక్కోలు జిల్లా! (రెండ‌వ భాగం)

చారిత్ర‌క నిర్మాణాల నేల‌.. సిక్కోలు జిల్లా! (రెండ‌వ భాగం)

అనివార్య కారణాల వల్ల ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట జరపలేకపోయారు. 1744వ సంవత్సరంలో కాంచీపురం శాలిగ్రామ ఏకశిలా విగ్రహాన్ని తెప్పించి వాసుదేవ పెరుమాళ్ళు పేరుతో విగ్రహ ప్రతిష్ట చేశారు. కొన్ని దశాబ్దాల తర్వాత దేవాదాయశాఖ ఈ ఆలయాన్ని స్వాధీనపరచుకుంది. ఇది శిథిలావస్థకు చేరుకుంటున్న సమయంలో శ్రీ మదుభయ వేదాంతాచారి పీఠం వారు ఆలయాన్ని అభివృద్ధి పేరుతో 2000 సంవత్సరంలో దేవాదాయశాఖ తీసుకొని పునర్నిర్మించారు. ప్రస్తుతం ఆలయానికి మంచి ప్రాముఖ్యత లభించింది. అయితే వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయం బాగోగుల విషయంలో అధికారులు పూర్తిగా జోక్యం చేసుకోకపోవడం మాకు ఆశ్చర్యకరం.

 రాజరిక చిహ్నంగా కోట‌..

రాజరిక చిహ్నంగా కోట‌..

ఆల‌యానికి వెళ్లే మార్గానికి ప్రారంభంలోనే రాజరిక చిహ్నంగా ఇక్కడి రాజులు నివసించిన కోట ఉంది. ఇప్పటికీ ఈ కోట చెక్కుచెదరకుండా వినియోగంలో ఉండడం విశేషం. రాజ వంశీయులు ఏటా పండగల సమయంలో ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారని కోట నిర్వాహకులు చెప్పారు. అలాగే మందసలో శ్రీరాజా శ్రీనివాస్ మహారాజ్ పేరున ఒక పాఠశాల కూడా ఉంది. అంతకు పూర్వం ఈ భవనాన్ని చికిత్సాలయంగా వినియోగించేవారు. దీనిని 1901వ సంవత్సరంలో రాజు ప్రభుత్వానికి అప్పగించారు. ఆ సమయంలో ఒక సంస్కృత ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టారు. నేటికీ ఈ నిబంధన కొనసాగుతోంది. ప్రస్తుతం బాలబాలికలు కలిపి వెయ్యి మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. నేటికీ పాఠశాల భవనం చెక్కుచెదరకుండా ఉండడం దీని ప్రత్యేకత. మందస శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పాండవులమెట్ట..

పాండవులమెట్ట..

పాండవులమెట్ట జిల్లాలోని ఆమదాలవలస మండలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక నిర్మాణ సముదాయమే పాండవులమెట్ట. బ్రిటన్‌లోని స్టోన్సెంజ్ అనే స్మారక నిర్మాణాన్ని పోలి ఉంటాయి ఇక్కడి నిర్మాణాలు. పొడవాటి బండ రాళ్లను ప్రాకారాలుగా అమర్చారు. వీటిని విలువైన చారిత్రక నిర్మాణాలుగా గుర్తించి భవిష్యత్ తరాలకు అందించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం తగుచర్యలు తీసుకొని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది. క్రీస్తు పూర్వం 3000 నుండి1000 సంవత్సరాల మధ్య కాలంలో ప్రపంచంలో పలుచోట్ల జరిగిన రాతి నిర్మాణాల సంస్కృతిలో భాగంగా పాండవులమెట్ట ప్రాంతాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఐదు బండరాళ్ళపై పెద్ద ఆకారంలో ఉన్న రాయిని పైకప్పుగా అమర్చారు. దీనిని సూర్యుని ఆరాదించుకోవడానికో, వేద‌శాలగానో, చికిత్సా ప్రదేశంగానో ఉపయోగించి కూడా ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.

సంర‌క్ష‌ణ‌లో నిర్లక్ష్యం..

సంర‌క్ష‌ణ‌లో నిర్లక్ష్యం..

అంతటి ఘనచరిత్ర ఉన్న పాండవులమెట్ట సంరక్షణ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర పురావస్తుశాఖ అధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్మాణాలు క‌నిపించాయి. అయినా కేంద్ర పురావస్తుశాఖ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తంచేయకపోవడం మాకు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. విదేశాల‌లో మాదిరిగానే దీనిని కూడా ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా తీర్చిదిద్దాల‌ని అక్క‌డి వారు ఆశిస్తున్నారు. ఇక్క‌డి చుట్టుప‌క్క‌ల మ‌రిన్ని చారిత్ర‌క నిర్మాణాలు ఉన్నాయ‌ని స్థానికులు చెప్పుకొచ్చారు. అయినా అప్ప‌టికే మేం వేసుకున్న ట్రిప్ స‌మ‌యం దాటిపోవ‌డంతో శ్రీ‌కాకుళానికి బై బై చెప్పాం. అవ‌కాశం ఉంటే మ‌రోసారి ఈ నేల‌పై ఉన్న చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను చూస్తామ‌ని వారికి మాట‌కూడా ఇచ్చాం. మ‌రెందుకు ఆల‌స్యం సిక్కోలు నేల‌పై దాగిన చారిత్ర‌క అందాల‌ను మీరూ చూసేయండి!

Read more about: mandasa srikakulam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X