Search
 • Follow NativePlanet
Share
» »విశాఖ సాగ‌ర తీరంలో అబ్బుర‌ప‌ర‌చే నేవీ డే విన్యాసాలు

విశాఖ సాగ‌ర తీరంలో అబ్బుర‌ప‌ర‌చే నేవీ డే విన్యాసాలు

విశాఖ సాగ‌ర తీరంలో అబ్బుర‌ప‌ర‌చే నేవీ డే విన్యాసాలు

విశాఖ తీరంలో యుద్ధనౌక‌లు గ‌ర్జించ‌నున్నాయి.. గ‌గ‌న త‌లంలో విమానాలు ర‌య్యిన దూసుకెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.. భూమి ద‌ద్ద‌రిల్లేలా పేలుళ్లుతో త‌మ శ‌క్తిని ప్ర‌ద‌ర్శించేందు ఉవ్విళ్లూరు తోంది నావికాద‌ళం.. విశాఖ సాగ‌ర తీరంలో నౌకాద‌ళ దివోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించ‌నున్న విన్యాసాలు.. సైనికుల విరోచిన పోరాటాలు.. క‌ళ్ల‌కు క‌ట్టేలా ప్ర‌ద‌ర్శించేందుకు సాగ‌ర తీరం సిద్ధ‌మైంది.

ఏటా డిసెంబర్ 4వ తేదీని ఇండియన్ నేవీ ఫోర్స్ డేగా భారత నావికాదళంగా జరుపుతుంది. ఎయిర్ ఫోర్స్ డేకు గగనతలంలో విన్యాసాలు చేస్తూ ఎలా అయితే జరుపుగుతుందో నేవీ డే రోజున అదే స్థాయిలో సంబరాలు చేసుకుంటారు. ఈ మేరకు విశాఖలోని నేవీ విభాగం ముస్తాబైంది. దీని కోసం ఆర్కే బీచ్ ప్రత్యేకంగా సిద్ధం చేశారు. అదే సమయంలో గగనతలంలోని విమానాలకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. బీచ్ కు ఆహార పదార్థాలను తీసుకురావొద్దని ఆంక్షలు విధించారు. స‌ముద్ర‌పు అల‌ల‌పై చేసే విన్యాసాల‌ను తిల‌కించేందుకు విశాఖ తీరంవైపు వీక్ష‌కులు అడుగులు ప‌డుతున్నాయి.

తీర ప్రాంత రక్షణకు వెన్నెముక..

తీర ప్రాంత రక్షణకు వెన్నెముక..

భారత నౌకాదళం ప్రపంచంలోనే అతిపెద్ద దళాల్లో సమర్థమైన నౌకాదళ శక్తిగా నిలిచింది. దేశంలోనే ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం ఆవిర్భవించింది. అంతేకాదు.. ఈ నౌకాదళ దినోత్సవం నిర్వహించుకోడానికీ కేంద్ర బిందువు కూడా విశాఖపట్నమే కావడం మరో విశేషం. తీర ప్రాంత రక్షణకు వెన్నెముకగా ఉన్న ఈఎన్‌సీ (ఈస్ట్‌ నేవల్‌ కమాండ్‌).. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఇండియన్‌ నేవీ.. ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటూ శత్రుదుర్భేద్యంగా మారుతోంది.

ఆక‌ట్ట‌కున్న సన్నాహక విన్యాసాలు..

ఆక‌ట్ట‌కున్న సన్నాహక విన్యాసాలు..

బంగ్లా విమోచన యుద్ధంలో ఘన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా నిర్వహించుకునే నౌకాదళ దినోత్సవం (నేవీ డే) జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఆర్కే బీచ్‌లో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ నౌకాదళ విన్యాసాలు చూప‌రుల‌ను ఎంత‌గానో ఆక‌ట్ట‌కుంటాయి. గత వారం రోజులుగా ఆర్కే బీచ్‌లో నేవీడే సన్నాహక విన్యాసాలు జరుగుతుండగా, శ‌నివారం పూర్తి స్థాయి రిహార్సల్స్ నిర్వహించారు.

నేవీడేను పురస్కరించుకుని ఆర్కే బీచ్‌లో చేసిన ఈ సన్నాహక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించే విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. సముద్రంలో ఆయిల్ రిగ్ పేల్చివేత, చేతక్ హెలికాఫ్టర్ విన్యాసాలు సంద‌ర్శ‌కుల చూపు తిప్పుకోనీయ‌వు. నౌకాదళ కమాండోలు భారత పతాకంతో చేసే గ్లైడింగ్ విన్యాసం ఇక్క‌డి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. వీటితో పాటు నౌకాదళ బ్యాంకు వాద్య సంగీతం ఎంత‌గానో ఆకట్టుకోనుంది.

వెలుగులతో కనువిందు చేసే క్ష‌ణాలు..

వెలుగులతో కనువిందు చేసే క్ష‌ణాలు..

యుద్ధ సమయంలో నావికాదళం ఎలా స్పందిస్తుంది? శత్రువులపై ఎలా ఎదురుదాడికి దిగుతుందో విన్యాసాల రూపంలో చూప‌నున్నారు. గగనంలో యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతూ బాంబులు వేయడం వంటి విన్యాసాలను ప్రజలు ఎంతో చూడ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఏటా ఈ ప్రదర్శనలు చూడటానికి పెద్దఎత్తున నగర ప్రజలు తీరానికి చేరుకుంటారు.

సాయంత్రం 5 గంటల సమయంలో సముద్రంలో యుద్ధ నౌకలు విద్యుత్తు వెలుగులతో కనువిందు చేసే క్ష‌ణాల‌ను చూసేందుకు మ‌రికొన్ని గంట‌లే స‌మ‌య‌ముంది. మీరూ విశాఖ ద‌గ్గ‌ర‌లో ఉంటే ఈ విన్యాసాల‌ను ఆస్స‌లు మిస్స‌వ్వొద్దు. నేవీ డే సంద‌ర్భంగా అధికారులు సంద‌ర్శ‌కుల కోసం ప్ర‌త్యేకంగా బ‌స్సు స‌ర్వీసుల‌ను అందుబాటులో ఉంచారు. న‌గ‌రం మొత్తం ట్రాఫిక్ ఆంక్ష‌ల‌తో.. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌తో ఉంటుంది.

  Read more about: navy day rk beach
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X