Search
  • Follow NativePlanet
Share
» »వ‌ల‌స ప‌క్షుల విడిది కేంద్రం.. తేలినీలాపురం!

వ‌ల‌స ప‌క్షుల విడిది కేంద్రం.. తేలినీలాపురం!

విదేశీవిహంగాల విడిదికేంద్రం శ్రీకాకుళం జిల్లాలోని తేలినీలాపురం. పచ్చని పైర్లతో సిక్కోలు సొగసులను ప్రకృతి ప్రేమికులకు చాటిచెప్పే పదహారణాల పల్లెటూరు ఇది. మనసును ఆహ్లాదపరిచే పక్షుల కిలకిలా రావాలకు, ప్రశాంత వాతావరణానికి చిరునామా ఈ పల్లె. ఎటుచూసినా పంటపొలాలు, జలపుష్పాలతో నిండిన చెరువులు ఇక్కడ దర్శనమిస్తాయి. మనసును కట్టిపడేసే ఇక్కడి అందాల సుందర వనాలను చూసేందుకు, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ, రైతు నేస్తాలుగా పేరొందిన విదేశీ విహంగాలను వీక్షించేందుకు సిద్ధమా మరి!

వ‌ల‌స ప‌క్షుల విడిది కేంద్రం.. తేలినీలాపురం!

వ‌ల‌స ప‌క్షుల విడిది కేంద్రం.. తేలినీలాపురం!

తేలినీలాపురం శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి అరవైఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి ఏటా సెప్టెంబర్ మొదటి వారానికి వేల సంఖ్యలో సైబీరియా(రష్యా), మలేసియా, హంగరీ, సింగపూర్, జర్మనీ తదితర ప్రాంతాలనుంచి పక్షులు చేరుకుంటాయి. ఏడు నెలలపాటు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి జరుపుకుని మార్చి చివరి వారంలో మాతృదేశానికి తిరిగిపడతాయి. వీటి వలసకు ఒక కారణం, ఈ కాలంలో ఆ దేశాలలోని ఉష్ణోగ్రతలు సంతానాభివృద్ధికి అనువుగా ఉండకపోవడం. ఇక్కడి వెచ్చని వాతావరణం గుడ్లు పొదగడానికి తోడ్పడుతుంది. గుడ్లు పెట్టేందుకు నీటి వనరులు పుష్కలంగా ఉండే ప్రాంతాలను ఇవి ఎంచుకుంటాయి. ఈ వలస పక్షులలో నూటపదమూడు జాతులు ఉన్నాయి. గతంలో పదివేల పక్షుల వరకూ వలస వచ్చేవి. క్రమేపీ ఆ సంఖ్య మూడువేలకు పడిపోయింది.

దేవతా పక్షులు'గా భావిస్తారు..

దేవతా పక్షులు'గా భావిస్తారు..

ఈ పక్షులు చింత చెట్లమీద మాత్రమే గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. వీటి బరువు నాలుగు నుండి ఏడు కేజీల వరకూ ఉంటుంది. ఇంత బరువుతో కూడా గంటకు ఏభై ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇందుకు వీటి ఎముకల నిర్మాణం ఎంతగానో సహకరిస్తుంది. ఈ పక్షులు అగకుండా ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం వరకూ ఎగరగలవు. ఆహారం కోసం దగ్గరలోని సముద్ర ప్రాంతానికి వెళతాయి. అక్కడ వేటాడిన చేపలను తెచ్చి పిల్లలకు అందిస్తాయి. ఆహారాన్ని గూటికి తెచ్చేందుకు ప్రత్యేకంగా వీటి ముక్కుకింద ఒక సంచిలాంటిది ఉంటుంది. ఇందులో ఒకేసారి కిలో నుంచి కిలోన్నర ఆహారాన్ని నింపుకోగలవు. తెచ్చిన ఆహారంలోంచి ఏవైనా కిందపడితే వాటిని ముట్టుకోవు. చెట్టుపైనుండి పిల్లపక్షులు కింద పడినా సరే వాటిని కూడా తాకవు. పరిసర ప్రాంత గ్రామీణ ప్రజలు వీటిని దేవతా పక్షులు'గా భావిస్తారు. ఇవి పంటపొలాల్లో విహరిస్తే పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. పెద్ద పరిమాణంలో ఇవి చెట్లపై గూళ్లను ఏర్పాటుచేసుకుంటాయి. ఇక్కడ కనిపించే పక్షులలో గూడకొంగలు, గూడబాతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

గూడకొంగలు

గూడకొంగలు

మలేసియాలో ఎక్కువగా కనిపించే ఈ పక్షులు పొడవాటి సన్నని కాళ్ళను కలిగి ఉంటాయి. సాధారణంగా ఆడ పక్షులు 110 నుండి 150 సెంటీమీటర్లు ఎత్తు ఉండి, రెండు నుంచి నాలుగు కిలోల బరువు ఉంటాయి. మగవి మాత్రం 187 సెంటీమీటర్ల ఎత్తు వరకూ ఉంటాయి. వీటి బరువు సుమారుగా 4.5 కేజీల కంటే ఎక్కువగా ఉంటుంది. సన్నని పొడవాటి మెడ వీటి ప్రత్యేకత. బురద నేలల్లో తల మొత్తాన్ని నీటిలో ఉంచి ఇవి వేటాడతాయి. వీటి ముక్కు వంకరగా ఉండి, దాని సహాయంతో బురద అడుగున ఉండే చిన్న చేపపిల్లలను, నాచుమొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. వీటి మిగతా శరీరం ఊదా తెలుపు రంగుల్లో ఉండగా, రెక్కలు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి. గగనతలంలో ఎగిరేటపుడు తలను, కాళ్లను సమాంతరంగా ఉంచి చూసేవారికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి

గూడబాతులు...

గూడబాతులు...

గాలిలో ఎగిరే పక్షిజాతులలో ఇవే పెద్దవి. 20 నుండి 360 సెంటీమీటర్ల వరకూ ఎత్తు ఉండే భారీ పక్షిజాతి ఇది. వీటి బరువు పదకొండు నుంచి పదమూడు కిలోల వరకూ ఉంటుంది. మగ పక్షులు తొమ్మిది నుంచి పదిహేను కిలోల బరువు ఉంటాయి. వీటి కాళ్ళు బాతు కాళ్ళ మాదిరిగా పొట్టిగా ఉంటాయి. నీటిలో ఈతకొడుతూ చేపలను వేటాడతాయి. నీటితో పాటు చేపల్ని ఒడిసిపట్టుకుని తర్వాత నీటిని వదిలేస్తాయి. ఈ పక్షులు చేసే అరుపులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. పర్యావరణ నేస్తాలుగా కూడా ఇవి ఎంతగానో రైతులకు సహాయపడుతున్నాయి. అధికారులు పక్షుల సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X