Search
  • Follow NativePlanet
Share
» »మన భారత దేశంలో మహిళలు సందర్శించకూడని ప్రదేశాలు !!

మన భారత దేశంలో మహిళలు సందర్శించకూడని ప్రదేశాలు !!

By Venkatakarunasri

మీకు ఈ విషయం తెలుసా ?? మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలుగా భావించబడే ప్రపంచంలోని మొదటి ఐదు దేశాలలో భారతదేశం ఉంది. చూడండి ఇండియాను ఏ స్థానంలో పెట్టామో !! గూగుల్ ట్రెండ్స్, తరచుగా "సెక్స్" అనే పదాన్ని టైప్ చేసే ఏడు దేశాలలో భారతదేశం ఒకటని నివేదించింది. ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ ఒక వ్యాసంలో,భారతదేశంలో మహిళ ఒక ఘోరమైన స్థానంలో ఉందని తెలిపింది. మనం మరి భారతదేశంలో ఏ ఏ ప్రదేశాలను మహిళలు సందర్శించకూడదో తెలుసుకుందాం. కనీసం ఇక్కడున్నప్పుడు జాగ్రత్తగానైనా ఉండండి.

గాంధీ మహాత్ముడు ఆడవారు అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగినప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం అని ఎందుకు చెప్పాడో తెలీదు కానీ, ఇప్పుడు అలా జరక్కపోగా రివర్స్ అయ్యింది. ఆడది అర్ధరాత్రి ఎందుకులే ... పగటిపూటనే రోడ్డు మీద వెళ్ళాలంటేనే భయపడే దుస్థితి దాపరించింది నేటి సమాజంలో. మన భారతదేశంలో ఉత్తమ నివాసయోగ్యమైన నగరాలలో మరియు మెట్రో నగరాల్లో కూడా మహిళలు బయటకు తిరగటానికి జంకుతుంటారు. భారతదేశం ఎక్కడున్నా, ప్రపంచంలో అన్ని దేశాలతో పాటుగా ఒక కుర్చీ వేసుకొని కూర్చొగలదు కాదు .. కాదు ఆవిధంగా తయారు చేశాం ఈ దేశాన్ని.

ఢిల్లీ

ఢిల్లీ

ఢిల్లీ భారతదేశంలో మహిళలకు సురక్షితం కానీ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇటీవల జరిగిన గ్యాంగ్ అత్యాచార సంఘటన ఢిల్లీకి 'రేప్ రాజధాని' గా కొత్త టైటిల్ వచ్చింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) ప్రకారం,రాజధాని మొత్తం రేప్ కేసులు 23.8 శాతం అని నివేదించారు. మీరు ఒకవేళ ఈ ప్రదేశంలో ఉన్నట్లయితే నోయిడా అనే ప్రదేశంలో మాత్రం జర జాగ్రత్తగా వెళ్ళండే.

Photo Courtesy: manuel secher

కోలకతా

కోలకతా

కోలకతా లో మహిళల పట్ల ఈవ్ - టీజింగ్, వేధింపులు, అత్యాచారం మరియు అనేక సంఖ్యలో నేరాలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ మహిళలపై ఎక్కువ నేరాలు జరుగుతాయని ప్రసిద్ధిచెందింది.ఇక్కడ మహిళల మీద ఆకృత్యాలు జరుగుతూనే ఉంటుంటాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, చివరికి అక్కడున్న ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి దాపరించింది.

Photo Courtesy: babakoto .eu

బెంగుళూర్

బెంగుళూర్

భారతదేశం యొక్క ఎలక్ట్రానిక్ నగరం అయిన బెంగుళూర్ దక్షిణ భారతదేశం యొక్క నేరాల రాజధానిగా మారింది. డ్రగ్స్ మరియు అత్యాచారాలు కారణంగా రాత్రి షిఫ్టులలో పనిచేసే వారికీ ఈ నగరం సురక్షితం కాదు. అనేక మంది మహిళలు తరచుగా భారతదేశంలో ఈ ప్రదేశంలో సందర్శించటానికి రావటం లేదు.

Photo Courtesy: Vicky W.

గుర్గావ్

గుర్గావ్

గుర్గావ్ లో రేప్ కేసులు మరియు నేరాలు (హర్యానా లో రెండవ అతిపెద్ద నగరం)ఎక్కువగా ఉండుట వలన మహిళలు సందర్శించటానికి సురక్షితం కానీ ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ముఖ్యంగా పనిచేసే మహిళలలో రాత్రి వేధింపులు,అపహరణ మరియు నేరాల ప్రమాదం ఎక్కువగా ఉంది. మబ్బుగా ఉంటే మగపాములు కాటెస్తాయి.

Photo Courtesy: Harsh Mangal

ముంబై

ముంబై

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రేప్ కేసులు 10.8 శాతం ముంబై లోనే జరుగుతున్నాయి. భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని ఒక సురక్షితమైన ప్రదేశం అని భావించబడేది. కానీ వేశ్యావృత్తిని న్యాయమైన పనిగా చేయుట వలన మహిళలు సందర్శనకు సురక్షితం కాదు. మహిళలు ఒంటరిగా ఉంటే అపహరణాలకి గురైతుంది. మీకు తెలియండి కాదు ఇక్కడి నుంచి మహిళలని వస్తువుల మాదిరి ఎగుమతులు చేస్తుంటారు.

Photo Courtesy: jubindave

మధ్యప్రదేశ్ FSI సర్వే ప్రకారం

మధ్యప్రదేశ్ FSI సర్వే ప్రకారం

మధ్యప్రదేశ్ కూడా మహిళలకు భద్రతకు హామీ లేని నగరంగా ఉద్భవించింది. భద్రత ప్రధాన పరిశీలనలో ఉన్నప్పుడు,మధ్యప్రదేశ్ చాలా మంది మహిళలు సందర్శనకు సురక్షితం కానీ ప్రదేశంగా ఉంది. మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక నగరంలో కొంతమంది మహిళలు స. హ . చట్టం కింద కొంత సమాచారాన్ని కూపీ లాగినందుకు వారిమీద అత్యాచారం చేసి చంపేసినారు.

Photo Courtesy: Abhishek727

హైదరాబాద్

హైదరాబాద్

ఇక మన రాష్ట్రంలో హైదరాబాద్. 2011 లో హైదరాబాద్ లో వేధింపుల కేసులు 157 గా నమోదు అయ్యాయి. భారతదేశం లో ఈ ప్రదేశం మహిళలకు సురక్షితం కాదు. ఈ నగరంలో రేప్ కేసుల సంఖ్య కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. మొన్న ఒక అమెరికన్ యువతి మీద జరిగిన అఘాయిత్యానికి హైదరాబాద్ నగరం మొత్తం సిగ్గుతో తలవంచింది.

Photo Courtesy: రవిచంద్ర

పూనే

పూనే

మహారాష్ట్ర లో ముంబై తరువాత రెండవ అతిపెద్ద నగరం పూనే. నగరమే కానీ మహిళలు ఇక్కడ వింతైన అనుభవాన్ని చూడవలసిఉంటుంది. ఇక్కడ ప్రజారవాణా వ్యవస్థ అంతగా బాగోలేదు కనుక మహిళలు సురక్షితంగా గమ్యస్థానాలకు చెకోవాలంటే కష్టపడక తప్పదు.

Photo Courtesy : djoh

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్

ఉత్తరప్రదేశ్ 11.9 శాతం హింసాత్మక నేరాలకు గురౌతున్నారు. మహిళల మీద ఎటువంటి దాడి అయిన చేయవచ్చు. ఇక్కడ మహిళల భద్రత మరింత సందేహాస్పదంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ గురించి మీరు వినే ఉంటారు పేపర్లలో, టీవీ న్యూస్ లలో. ఉత్తరప్రదేశ్ లో కొన్ని మాసాల కిందట మహిళల మీద జరిగిన సంఘటనలకి అక్కడి ప్రభుత్వమే గజ ..గజ.. వణికిపోయింది. కేంద్రం ప్రశ్నలు అడుగుతుంటే నీళ్ళు నమిలింది.

Photo Courtesy:Harshvardhansonkar

గోవా

గోవా

ఇక్కడ భద్రతా సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. గోవా సందర్శనకు వచ్చే ముందు మహిళలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఈ ప్రదేశం డ్రగ్స్ కి ప్రసిద్ది చెందింది.దయచేసి మహిళలు ఇక్కడ ఒంటరిగా ప్రయాణించకండి. విదేశీయులకి ఇవి షరా మామూలే కానీ మనం భారతీయులం.

Photo Courtesy: Flickr

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more