Search
  • Follow NativePlanet
Share
» »మధ్య ప్రదేశ్ లో పది పర్యాటక ఆకర్షణలు!

మధ్య ప్రదేశ్ లో పది పర్యాటక ఆకర్షణలు!

మధ్య ప్రదేశ్ ను 'భారత దేశపు హృదయ భాగం ' అని ముద్దుగా పిలుస్తారు. భౌగోళికంగా దేశానికి మధ్యలో కల ఈ రాష్ట్రంలో అనేక అద్భుత టూరిస్ట్ ఆకర్షణలు కలవు. కామకేలి ప్రదర్శించే అరుదైన శిల్పాల ఖజురాహో, పచ్మారి లోని ప్రశాంతమైన పర్వతాలు, బాంధవ్ ఘర్ లోని వన్య ప్రాణులు వంటివి మధ్య ప్రదేశ్ రాష్ట్ర అరుదైన ఆకర్షణలు. మరి మధ్య ప్రదేశ్ పర్యటనలో తప్పక చూడవలసిన పది ఆకర్షణలు పరిశీలించండి.

భారత దేశపు హృదయ భాగం

భారత దేశపు హృదయ భాగం

ఖజురాహో కామ కేళి శిల్పాలు ప్రపంచం అంతా ప్రసిద్ధి. యునెస్కో సంస్థ గుర్తించిన ఈ పర్యాటక ప్రదేశం అనేక మంది చరిత్రకారులను, ఆర్కియోలజి శాస్త్రజ్ఞులను ఆకర్షిస్తుంది.

ఖజురాహో టెంపుల్స్, వసతి గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.

భారత దేశపు హృదయ భాగం

భారత దేశపు హృదయ భాగం

భీమ్బెట్కా గుహలు - భీమ్బెట్కా గుహలు సుమారు 600 కు పైగా కలవు. వీటిలో కొన్ని అతి ప్రాచీనమైనవి. వింధ్య పర్వతాలలో కల ఈ గుహలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందాయి. గుహలలో మానవ జీవితం ప్రతిబింబించే చిత్రాలు కలవు.

Photo Courtesy: Nandanupadhyay

భారత దేశపు హృదయ భాగం

భారత దేశపు హృదయ భాగం

బాంధవ ఘర్ వన్య ప్రాణులు - ఈ ప్రదేశంలో వన్య జంతువులు కలవు. తెల్ల పులులకు ప్రసిద్ధి. బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్ ఒకప్పుడు రేవా పాలించిన రాజులకు వేటాడే ప్రదేశం గా వుండేది. పులులే కాక, ఈ నేషనల్ పార్క్ లో అనేక పక్షులు, ఇతర జంతువులు, సీతాకోక చిలుకలు, పాములు కూడా కలవు. బాంధవ్ ఘర్ ఆకర్షణలు ఇక్కడ చూడండి. Photo Courtesy: Archith

భారత దేశపు హృదయ భాగం

భారత దేశపు హృదయ భాగం

పచ మారి - పచ మారి కొండలను 'సపూతర కి రాణి ' అని పిలుస్తారు. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1110 మీటర్ల ఎత్తున కలదు. వివిధ ఆటవిక తెగల ప్రదేశం అయిన ఇది ప్రస్తుతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. కాల క్రమేనా ఎంతో అభివృద్ధి చెందినది.

భారత దేశపు హృదయ భాగం

భారత దేశపు హృదయ భాగం

ఉజ్జయని పురాతన దేవాలయాలు - ఉజ్జయని పట్టణం శిప్రా నది ఒడ్డున కలదు. ఇక్కడ అనేక దేవాలయాలు కలవు. కుంభ మేళ, శివరాత్రి, అర్ధ కుంభ మేళ వంటి పండుగలకు ప్రసిద్ధి. ఉజ్జయని లో వీధి తిండ్లు అయిన పాణి పూరి, భెల్ పూరి వంటివి ప్రసిద్ధి.

Photo Courtesy: LRBurdak

భారత దేశపు హృదయ భాగం

భారత దేశపు హృదయ భాగం

ఓర్చ్చ లో చ్చాత్రీస్ - ఓర్చా రాజ్య పాలకుల సమాధులు ఇక్కడ చూడవచ్చు. ఈ స్మారక చిహ్నాలు అందంగా చెక్కబడిన గోడలు, స్తంభాలు, డోములతో కను విందు చేస్తాయి. ఓర్చా గురించిన మరింత సమాచారం ఇక్కడ చూడండి.

Photo Courtesy: Dey.sandip

భారత దేశపు హృదయ భాగం

భారత దేశపు హృదయ భాగం

గ్వాలియర్ - చారిత్ర క నగరం - చరిత్రకు సంబంధిన ఎన్నో కోతలు, మ్యూజియం లు మిమ్ములను ఈ ప్రదేశ స్వర్ణ యుగానికి తీసుకు వెళతాయి. పతంకర్ బజార్ లో మీకు నచ్చిన హస్తకళ వస్తువులు, నకిలీ ఆభరణాలు, కుడ్య చిత్రములు, ఇతర బొమ్మలు కొనుగోలు చేయవచ్చు.
Photo Courtesy: Gyanendra Singh Chauhan

భారత దేశపు హృదయ భాగం

భారత దేశపు హృదయ భాగం

మందు - మందు ను సంతోషాల భూమి అంటారు. మొగల్ రాజులు గడిపిన స్వర్ణ యుగానికి ఈ భూమి నిదర్శనం. ఎప్పటికి మరువలేని ప్రేమ కధలకు పుట్టిల్లు. ఈ ప్రదేశ ప్రధాన ఆకర్షణలు, మాల్వా ఫెస్టివల్, మాల్వా ఆహారాలు, అనేక పర్యాటక ఆకర్షణలు.

Photo Courtesy: Anurodhraghuwanshi

భారత దేశపు హృదయ భాగం

భారత దేశపు హృదయ భాగం

సాంచి లోని బౌద్ధ స్తూపాలు - గౌతమ బుద్ధుడు సాంచిని ఎపుడూ సందర్సిన్చనప్పటికి, అతని బోధనలు ఈ గ్రామంలో చూడబడతాయి. సాంచి స్తూపం మధ్య ప్రదేశ్ లో ఒక గొప్ప ఆకర్షణ.

Photo Courtesy: Joel Suganth

భారత దేశపు హృదయ భాగం

భారత దేశపు హృదయ భాగం

కన్హా నేషనల్ పార్క్ - కన్హా నేషనల్ పార్క్ మధ్య ప్రదేశ్ లోని నేషనల్ పార్క్ లలో అతి పెద్దది. 1974 లో ఇక్కడ కన్హా టైగర్ రిజర్వ్ ఏర్పరచారు. ఇక్కడ కల వెదురు అడవులు, వాగులు, వంకలు, తో ప్రదేశం ఆకర్షణీయంగా వుంటుంది. కొన్ని అరుదైన జంతువులను కూడా ఈ పార్క్ లో చూడవచ్చు.

Photo Courtesy: Aloshbennett

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X