» »దాదాపు వేయి సంవత్సరాల క్రితం నాటి రహస్య గుహలా ! ఇదేదో చూడాల్సిందే !

దాదాపు వేయి సంవత్సరాల క్రితం నాటి రహస్య గుహలా ! ఇదేదో చూడాల్సిందే !

Posted By: Venkata Karunasri Nalluru

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జంగ్లీ మహరాజ్ రోడ్ మార్గంలో పటలేశ్వర్ గుహాలయం ఉన్నది. ఇది 1400 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆలయ గొప్పతనం ఏమిటంటే, ఆలయాన్ని ఒక పెద్ద రాయిని ఒలిచి నిర్మించినారు. ఇక్కడకు దేశవిదేశాల నుండి ఎంతోమంది యాత్రికులు వచ్చి సందర్శిస్తారు. ప్రధాన గుహలలో గోడల మీద ముఖ్యంగా శివుని గూర్చి భారత పౌరాణిక కథలు వర్ణించబడి వున్నాయి. శిల్పాలు సూచిస్తూ తీసిన కొన్ని సరిహద్దులు ఉన్నాయి. గుహ భారీ సముదాయం ఒక తోట వలె మార్చబడింది. ఇక్కడికి సమీపంలో కొన్ని పాత ఆలయానికి చెందిన కొన్ని నిర్మాణాలు ఉన్నాయి.

మహారాష్ట్రలోని 1000 సంవత్సరాల క్రితం నాటి పురాతన గుహలు

1. ఎలిఫెంటా గుహలు

1. ఎలిఫెంటా గుహలు

మహారాష్ట్రలోని ఎలిఫెంటా దీవిలో ఉన్న గుహలను "ఎలిఫెంటా గుహలు" అని పిలుస్తారు. పూర్వం పోర్చుగీసు వారు వర్తక వ్యాపారం కోసం ఈ ప్రదేశాన్ని సందర్శించినపుడు ఏనుగుల శిల్పకళా శైలి అధికంగా కనపడింది. అందుకే దీనికి ఎలిఫెంటా అని పేరు పెట్టారు. ఎలెఫెంటా గుహలలో రెండు రకాల గుహలు ఉన్నాయి.
Photo Courtesy: Philip Larson

2. బౌద్ధ మతానికి చెందిన గుహలు

2. బౌద్ధ మతానికి చెందిన గుహలు

మొదటి రకం హిందువులకు సంబంధించినది మరొకటి బౌద్ధ మతానికి చెందినది. ముంబై నగరంలోని గేట్ వే ఆఫ్ ఇండియా టర్మినల్ నుండి గంట ప్రయాణ దూరంలో ఉన్న ఈ గుహలకు బోట్ లేదా ఫెర్రీల ద్వారా చేరుకోవచ్చు.
pc: Vaikoovery

3. సిల్హారా రాజులు నిర్మించిన గుహలు

3. సిల్హారా రాజులు నిర్మించిన గుహలు

9వ శతాబ్దం మరియు 13వ శతాబ్దాల మధ్యకాలంలో (810-1260) సిల్హారా రాజులు ఎలిఫెంటా గుహలను నిర్మించారు. ఎలిఫెంటా గుహలు మహారాష్ట్ర లోని 'ఘరాపురి ద్వీపం' లో గలవు.

pc: Vaikoovery

4. 20 అడుగుల ఎత్తులో వున్న సదాశివుని విగ్రహం

4. 20 అడుగుల ఎత్తులో వున్న సదాశివుని విగ్రహం

ఇక్కడకు దేశవిదేశాల నుండి ఎంతోమంది యాత్రికులు వచ్చి సందర్శిస్తారు. ఇందులోని ప్రముఖ విగ్రహం 20 అడుగుల ఎత్తులో వున్న సదాశివుని విగ్రహం. త్రిముఖంతో కూడి పంచముఖ శివునికి పోలి వుంది.
pc: Vaikoovery

5. అజంతా మరియు ఎల్లోరా గుహలు

5. అజంతా మరియు ఎల్లోరా గుహలు

ఉత్తర మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో గల అజంతా మరియు ఎల్లోరా గుహలు ప్రపంచ వారసత్వ సంపదలలో ఒకటిగా గుర్తింపు పొందినాయి. హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన పెయింటింగ్, శిల్పాలు మరియు చిత్రాలు, చెక్కడాలు ఇక్కడ కనిపిస్తాయి.
Photo Courtesy: Youri

6. 30 గుహలు

6. 30 గుహలు

బుద్ధునికి సంబంధించి అజంతాలో 30 వరకు గుహలు ఉన్నాయి. అదేవిధంగా ఎల్లోరాలో 34 గుహలుంటే బౌద్ధ మతానికి 12 గుహలు, హిందూ మతానికి సంబంధించి 17 గుహలు మరియు జైన మతానికి సంబంధించి 5 గుహలు ఉన్నాయి.
pc: Akshatha Inamdar

7. పటలేశ్వర్ గుహాలయం

7. పటలేశ్వర్ గుహాలయం

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జంగ్లీ మహరాజ్ రోడ్ మార్గంలో పటలేశ్వర్ గుహాలయం ఉన్నది. ఇది 1400 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆలయ గొప్పతనం ఏమిటంటే, ఆలయాన్ని ఒక పెద్ద రాయిని ఒలిచి నిర్మించినారు.
Photo Courtesy: Ankita Kolamkar

8. 1400 సంవత్సరాల క్రితం నాటి గుహలు

8. 1400 సంవత్సరాల క్రితం నాటి గుహలు

గుహలు ఎలిఫెంటా మరియు ఎల్లోరా గుహలను పోలి ఉంటాయి. ఈ గుహలో ప్రధాన దైవం శివుడు. ఈ గుహాలయాన్ని ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 : 30 వరకు దర్శించవచ్చు.
pc: Bikashrd

9. కర్ల - భజ గుహలు

9. కర్ల - భజ గుహలు

మహారాష్ట్రలోని ఖండాలా నుండి 16 కి.మీ. దూరంలో కార్ల - భజ గుహలు ఉన్నాయి. దీనిని క్రీ.పూ. 2 వ శతాబ్దంలో నిర్మించినారు. ఇక్కడున్న అపారమైన సౌందర్యం మరెక్కడా కానరాదు. బౌద్ధ హీనాయాన శాఖ కు చెందిన ఈ గుహలు పురాతన బౌద్ధ రాతి గుహాలయాలకు చక్కని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
Photo Courtesy: Dinesh Valke

10. పటలేశ్వర గుహ దేవాలయాలు

10. పటలేశ్వర గుహ దేవాలయాలు

పటలేశ్వర గుహ దేవాలయాలు పటలేశ్వరస్వామి నీటి క్రింద కొలువై వుంటాడు. ఇక్కడ శివుడు ముఖ్యమైన దేవుడు. ఈ దేవాలయాలు ఎలిఫెంటా గుహదేవాలయాల మాదిరిగానే వుంటుంది.
pc: Bikashrd

11. క్రీ.శ. 700 కు మరియు క్రీ.శ. 800 కాలానికి చెందిన గుహలు

11. క్రీ.శ. 700 కు మరియు క్రీ.శ. 800 కాలానికి చెందిన గుహలు

దీనిని 8 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ గుహల రాళ్ళు క్రీ.శ. 700 కు మరియు క్రీ.శ. 800 కాలానికి చెందినవి. ఈ దేవాలయాలు పూనే యొక్క పరిరక్షించిన కట్టడాలలో భాగంగా పరిగణించబడుతున్నాయి. ఆలయంలో ప్రస్తుతం నల్లరాతి చెక్కడాలు వున్నాయి. ఈ ఆలయంలో ప్రార్థనలు మరియు వేడుకలు ఒక భాగంగా జరుగుతాయి.
pc: wikimedia.org

12. శివలింగము

12. శివలింగము

ఇప్పటికీ శివలింగమును నెయ్యి, పెరుగుతో అభిషేకం చేస్తారు. ఆలయంలో ఒక ఇత్తడి గంట శిబిరంలోని ప్రవేశమార్గం వద్ద బయట బ్యాలెన్స్ గా వుంటుంది.
pc: Bikashrd

13. పాత ఆలయానికి చెందిన నిర్మాణాలు

13. పాత ఆలయానికి చెందిన నిర్మాణాలు

గుహ భారీ సముదాయం ఒక తోట వలె మార్చబడింది. ఇక్కడికి సమీపంలో కొన్ని పాత ఆలయానికి చెందిన కొన్ని నిర్మాణాలు ఉన్నాయి.
pc: Karthik Easvur

14. 1300 సంవత్సరాల పైబడిన ఆలయం

14. 1300 సంవత్సరాల పైబడిన ఆలయం

1300 సంవత్సరాల పైబడిన ఈ ఆలయం పూనేలోని పురాతన స్మారకంగా ఉంది. భారతదేశం యొక్క పురావస్తు కార్యాలయం వారు దీనిని సర్వే చేస్తున్నారు.
pc: Bikashrd

15. భారత పౌరాణిక కథలు

15. భారత పౌరాణిక కథలు

ప్రధాన గుహలలో గోడల మీద ముఖ్యంగా శివుని గూర్చి భారత పౌరాణిక కథలు వర్ణించబడి వున్నాయి. శిల్పాలు సూచిస్తూ తీసిన కొన్ని సరిహద్దులు ఉన్నాయి.
pc: Khoj Badami

16. గర్భగుడి

16. గర్భగుడి

ముందు గర్భగుడి పూర్తి చేసిన తర్వాత వీటిలో ఒకటి గుహలోని రాతిలో లోపాల కారణంగా అసంపూర్ణంగా మిగిలిపోయినట్లుగా కనిపిస్తుంది.
pc:Khoj Badami

17. శివలింగం వుండే గుహ

17. శివలింగం వుండే గుహ

గుహలోని ఆలయంలో గల మూడు విగ్రహాలలో ప్రధానమైనది శివలింగం వుండే గుహ. గుహలోని ప్రదక్షిణ మార్గంలో ఒక గుహాలయం అసంపూర్ణంగా వుంది.
pc:Karthik Easvur

18. బసాల్ట్ రాతితో చేసిన ఆలయం

18. బసాల్ట్ రాతితో చేసిన ఆలయం

హిందూ మత దేవుడు శివుడు ప్రధానదైవంగా గల ఈ ఆలయం బసాల్ట్ రాతితో చేసిన ఆలయం.
pc:Jimbzthegr8

19. గర్భగుడి

19. గర్భగుడి

గర్భగుడి ప్రతి వైపు 3-4 మీటర్లు కలిగిన ఒక ఘనమైన ఆకారంలో వుంది. ఇక్కడ ఒక శివలింగము వుంది మరియు ప్రతి వైపు రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి.
pc:Tanayphoto2016

20. ఆలయం

20. ఆలయం

రాజకీయ ఉపద్రవాల వల్ల గర్భగుడి యొక్క ఆలయం అసంపూర్తిగా మిగిలి వుంది.
pc:Akash Mandleek